50 Important Telugu Methodology Bits for AP TET & DSC

50 Important Telugu Methodology Bits for AP TET & DSC

50 Important Telugu Methodology Bits for AP TET & DSC పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మాతృభాష స్వభావం, భాషోత్పత్తి వాదాలు, ధ్వని మరియు అర్థవిపరిణామాలకు సంబంధించిన 50 అత్యంత ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మీ ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవడానికి ఈ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి.

1. “మాతృభాష” నిర్వచనాలకు సంబంధించి సరికానిది ?
1. తల్లి నుంచి నేర్చుకునే మొట్టమొదటి భాష – మాతృభాష
2. కుటుంబంలో అందరూ ఉపయోగించే భాష – మాతృభాష
3. శిశువు తన మనోభావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగించే భాష – మాతృభాష
4. శిశువు పాఠశాలలో ప్రవేశించాక నేర్చుకునే భాష – మాతృభాష

Answer: 4

2. శిశువు తన సౌందర్య దృష్టిని, ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం.
1. ద్వితీయ భాష
2. తృతీయ భాష
3. మాధ్యమ భాష
4. మాతృభాష

Answer: 4

3. “శిశువు తన అభిప్రాయాన్ని, సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష” అని నిర్వచించినవారు ?
1. మహాత్మాగాంధీ
2. వినోబాభావే
3. జాకీర్ హుస్సేన్
4. దయానంద సరస్వతి

Answer: 1 (As per key: 3)

4. “శిశువు పాఠశాలలో ప్రవేశించక ముందే ధారాళంగా మాట్లాడే భాష. శిశువు తన జీవితంలోని అన్ని రంగాలలో ఆత్మ విశ్వాసంతో వ్యవహరించేది మాతృభాష ద్వారానే” అని అన్నవారు ?
1. గోడవర్తి సూర్యనారాయణ
2. W.M. రైబర్న్
3. P.B. బల్లార్డ్
4. బ్లాక్ (Bloch)

Answer: 4

5. “మానవుడు శైశవావస్థ నుండి తన హావభావాలను, హాస క్రోధానురాగాదులను, ఆలోచనలను, ఆచరణలను ఏ భాషా ముఖంగా వ్యక్తపరచునో అదే అతని మాతృభాష” అని నిర్వచించినవారు ?
1. జాకీర్ హుస్సేన్
2. దయానంద సరస్వతి
3. వినోబాభావే
4. గోడవర్తి సూర్యనారాయణ

Answer: 4

6. డబ్ల్యు.ఎం.రైబర్న్ పేర్కొన్నట్లు “ఆనందానుభూతితోపాటు, జ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి, అభిరుచులను, భావాలను రూపుదిద్దుకోవడానికి, దేవుడిచ్చిన సృజనాత్మక శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి తోడ్పడే సాధనం”.
1. ప్రాంతీయ భాష
2. మాతృభాష
3. పరభాష
4. మాండలిక భాష

Answer: 2

7. “శైశవం మొదలుకొని (శైశవదశ నుండి) జీవితాన్ని తీర్చిదిద్ది, ఆత్మ విశ్వాసాన్ని కలిగించి, జాతి అభివృద్ధికి, దేశాభ్యుదయానికి, లోకోద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకు ఉంది” అని నిర్వచించినవారు ?
1. W.M. రైబర్న్
2. రామచంద్రుని వెంకట శేషయ్య
3. P.B. బల్లార్డ్
4. విశ్వనాథ సత్యనారాయణ

Answer: 3

8. భాషా ప్రయోజనాలైన భావ గ్రహణ, భావ వ్యక్తీకరణలకు ఏ భాషపై వ్యక్తి ఎక్కువగా ఆధారపడి ఉంటాడో అలాంటి మూలాధారమైన భాషే మాతృభాష అన్నవారు ?
1. P.B. బల్లార్డ్
2. ఠాగూర్
3. రామచంద్రుని వెంకట శేషయ్య
4. బ్లాక్

Answer: 3

9. “శరీరంతో తల ఎరుగక వాడితే, దారిపొడుగునా తిరిగి ఎరుగక నడిస్తే ఎంత తేడా ఉంటుందో మాతృభాషలో విషయం నేర్చుకున్న వాడికి, పరభాషలో నేర్చుకొను వాడికి అంతే తేడా ఉంటుంది” అని మాతృభాషలో బోధన ప్రాధాన్యతను తెలిపినది ?
1. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
2. గిడుగు సూర్యనారాయణ
3. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి
4. పోరంకి దక్షిణామూర్తి

Answer: 1

10. భారతదేశ విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనాభాషగా ప్రవేశపెట్టినది ?
1. లార్డ్ వెల్లెస్లీ
2. మింటో మార్లే
3. లార్డ్ మెకాలే
4. డల్హౌసీ

Answer: 3

11. బోధన భాషగా ఆంగ్లం ప్రాముఖ్యతను తగ్గించి, దేశ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినది ?
1. జాతీయ విద్యా సంస్థ (National Council of Education, 1906)
2. కలకత్తా యూనివర్సిటీ కమిషన్
3. ఉడ్స్ రిపోర్ట్
4. కేంద్ర విద్యా విషయక సలహా సంఘం

Answer: 1

12. 1906వ సంవత్సరంలో బోధన భాషలైన ఆంగ్లానికి ప్రాముఖ్యతను తగ్గించి దేశ భాషలకు ప్రాధాన్యమివ్వాలని సూచించిన జాతీయ విద్యా సంస్థ ప్రముఖులు ?
1. మౌలానా అబుల్ కలాం ఆజాద్ – బాలగంగాధర తిలక్
2. రాజేంద్ర ప్రసాద్ – గాంధీజీ
3. రవీంద్రనాథ్ ఠాగూర్ – బిపిన్ చంద్రపాల్
4. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ – నెహ్రూ

Answer: 3

13. బోధన భాషలైన ఆంగ్ల భాషకు ప్రాముఖ్యత తగ్గించి దేశ భాషలకు ప్రాధాన్యమివ్వాలని ఏర్పరచిన జాతీయ విద్యా సంస్థ సభ్యులు ?
1. వల్లభాయ్ పటేల్, రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్
2. రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్, చిత్తరంజన్ దాస్, గురుదాస్ బెనర్జీ, రాస్ బిహారీ ఘోస్
3. రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్, చిత్తరంజన్ దాస్,
4. సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, రవీంద్రనాథ్ ఠాగూర్

Answer: 2

14. 1906 లో ఏర్పడిన జాతీయ విద్యా సంస్థలో ప్రముఖులలో ఒకరు ?
1. డార్విన్ ఎల్
2. సత్యదేవ్
3. చిత్తరంజన్ దాస్
4. బాలగంగాధర తిలక్

Answer: 3

15. ప్రొవిన్షియల్ అటానమీ నివేదిక ద్వారా ఇంగ్లీషు అధికారభాషగా, బోధనా భాషగా స్థిరపడింది ?
1. డల్హౌసీ
2. మాంట్ బాటన్
3. మెకాలే
4. వారన్ హేస్టింగ్స్

Answer: 3

16. మాతృభాష మాధ్యమంగా ఉంటే కలిగే నష్టం గురించి హరిజన పత్రికలో 9-7-1938లో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యత గురించి రాసిన వారు ?
1. హుమయూన్ కబీర్
2. జాకీర్ హుస్సేన్
3. మహాత్మా గాంధీ
4. మౌలానా అబుల్ కలాం ఆజాద్

Answer: 3

17. భారతదేశం వంటి బహు భాషాదేశంలో ఏయే భాషలు నేర్చుకోవాలి. ఏది జాతీయ భాషగా ఉండాలన్న అంశాల ఆధారంగా రూపొందిన సూత్రం ?
1. సమస్యా సూత్రం
2. సంబంధ సూత్రం
3. త్రిభాషా సూత్రం
4. అధికార భాషా సూత్రం

Answer: 3

18. పాఠశాలల్లో మూడు భిన్న భాషలను ప్రథమ, ద్వితీయ, తృతీయ భాషలుగా బోధించడానికే తార్కికమైనది ?
1. త్రిభాషా సూత్రం
2. బహుభాషా సూత్రం
3. ద్విభాషా సూత్రం
4. ప్రాంతీయ ఇంధనం

Answer: 1

19. స్వాతంత్ర్యం తరువాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ఏ ప్రాతిపదిక ఆధారంగా జరిగింది ?
1. కుల ప్రాతిపదికన
2. మత ప్రాతిపదికన
3. ప్రాంత ప్రాతిపదికన
4. భాషా ప్రాతిపదికన

Answer: 4

20. స్వాతంత్ర్యానికి ముందు మనదేశంలో అమలులో ఉండేదని భావించే భాషా సూత్రం ?
1. ఏక భాషా సూత్రం
2. ద్విభాషా సూత్రం
3. త్రిభాషా సూత్రం
4. బహుభాషా సూత్రం

Answer: 2

21. బ్రిటిష్ పాలకులు అధికార భాషగా ఇంగ్లీషును స్థిరపరిచారు. స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశంలోని చాలా రాష్ట్రాలలో ఇంగ్లీషు ప్రథమ భాషగా ఉండేది. అయితే ద్వితీయ భాషగా ఏ భాష ఉండేది ?
1. శాసన భాష
2. జాతీయ భాష
3. అంతర్జాతీయ భాష
4. మాతృభాష లేదా ప్రాంతీయ భాష

Answer: 4

22. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో అధికారభాషగా, మాధ్యమ భాషగా ఉన్న భాష ?
1. తెలుగు – ఉర్దూ
2. ఇంగ్లీషు – తెలుగు
3. హిందీ – తెలుగు
4. ఉర్దూ – ఇంగ్లీషు

Answer: 4

23. 1956 లో త్రిభాషా సూత్రాన్ని రూపొందించినది ఎవరు ?
1. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC)
2. జాతీయ విద్యా సంస్థ (NEC)
3. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (NCERT)
4. కేంద్రీయ విద్యా విషయక సలహా సంఘం (CABE)

Answer: 4

24. స్వతంత్ర భారతదేశంలో అధికార భాషా ప్రతిపత్తి ఉంటుందనే భావనతో 1937 లో దేశంలోని చాలా రాష్ట్రాలలో తృతీయ భాషగా ఏ భాషను ప్రవేశపెట్టారు ?
1. మాతృభాష లేదా ప్రాంతీయ భాష
2. హిందీ
3. ఇంగ్లీషు
4. ఒక భారతీయ భాష

Answer: 2

25. “భాషోత్పత్తి” అంశంపై 1866వ సంవత్సరంలో చర్చను నిషేధించిన భాషాశాస్త్ర సంఘం ?
1. బ్రిటన్ భాషాశాస్త్ర సంఘం (Britain Linguistic Society)
2. ప్యారిస్ భాషాశాస్త్ర సంఘం (Paris Linguistic Society)
3. భారత భాషాశాస్త్ర సంఘం (Indian Linguistic Society)
4. ఇటాలియన్ భాషాశాస్త్ర సంఘం (Italian Linguistic Society)

Answer: 2

26. “సహజ ధ్వని ఆధార వాదాలు” అనే అంశాన్ని 1861వ సంవత్సరంలో పేర్కొన్న ప్రముఖ భాషాశాస్త్రవేత్త ?
1. మాక్స్ ముల్లర్
2. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి
3. ట్రాంబెట్టి (ఇటలీ)
4. పైథాగరస్, ప్లేటో

Answer: 1

27. ప్రపంచం ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయి అని తెలిపే భాషోత్పత్తివాదం ?
1. సమాలోచనవాదం
2. ఏకమూల భాషావాదం
3. స్ఫోటవాదం
4. దైవదత్తవాదం

Answer: 2

28. “మానవులు పరస్పరం సంప్రదించుకొని, తర్కించుకొని అక్షరాలు, పదాలు ఏర్పరచుకొనుటయే భాషకు ప్రారంభ స్థితి” అన్న అభిప్రాయం ?
1. సమాలోచనవాదులది
2. ఆశ్చర్యవాదులది
3. శ్రమజీవులది
4. శ్వాసవాదులది

Answer: 1

29. “ఓం” కారమే భాషకు మూలం అని తెలిపే వాదం ?
1. దైవదత్తవాదం
2. స్ఫోటవాదం
3. ఏకమూల భాషావాదం
4. స్వభావ వాదం

Answer: 2

30. భగవంతుడే భాషను ప్రసాదించాడు / సృష్టించాడని భావించే వాదం – ఆ వాదానికి ఉన్న ఇతర పేర్లు ?
1. బౌబౌ వాదం / ధ్వన్యనుకరణ వాదం
2. వివక్షా ప్రేరణ వాదం / ఆశ్చర్య వాదం / పూపూ వాదం / టట్ టట్ వాదం
3. ప్రకంపనా వాదం / డింగ్ డాంగ్ వాదం
4. దైవదత్త వాదం / భగవద్దత్త వాదం / భగవత్ప్రసాద వాదం / అలౌకిక వాదం / సాంప్రదాయ వాదం

Answer: 4

31. ఒక స్వీడన్ భాషావేత్త దైవదత్త వాదం ప్రకారం దేవుడు సృష్టించిన ఈడెన్ ఆరామంలో ఎవరెవరు ఏయే భాషలలో వ్యవహరించారో వాటికి సంబంధించి సరికాని జత గుర్తించండి.
1. ఆడమ్-స్వీడిష్
2. సాటన్ (సర్పం) – డేనిష్
3. ఈవ్-ఫ్రెంచ్
4. ఆడమ్-ఫ్రెంచ్

Answer: 4

32. హిందువులకు-సంస్కృతం, మహ్మదీయులకు – అరబ్బీ (అరబిక్), క్రైస్తవులకు-హిబ్రూ భాషలు దైవ భాషలు అని తెలిపే వాదం ?
1. భగవద్దత్త వాదం
2. ధాతు వాదం
3. సాంకేతిక వాదం
4. స్వతస్సిద్ధ వాదం

Answer: 1

33. మానవుడి వాక్ అవయవాల నుంచి ఉత్పన్నమైన భాషా విజ్ఞానానికి ఉపయోగపడే ప్రతి శబ్దాన్ని ఏమంటారు ?
1. వర్గం
2. అక్షరం
3. ధ్వని
4. కంఠ్యం

Answer: 3

34. మానవులు భాషించడానికి (మాట్లాడేటప్పుడు) రకరకాల ధ్వనులు ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నారో వివరించే శాస్త్రం ?
1. అలంకార శాస్త్రం
2. వ్యాకరణ శాస్త్రం
3. ఛందఃశాస్త్రం
4. ధ్వనిశాస్త్రం (Phonetics)

Answer: 4

35. మనిషి ఉచ్చరించేటప్పుడు ముఖ యంత్రంలోని అవయవాల కదలికలు ఎలా ఉంటాయని పరిశీలించే ధ్వని శాస్త్ర శాఖను ఏమంటారు ?
1. ఉచ్చారణాత్మక ధ్వనిశాస్త్రం (Articulatory Phonetics)
2. తరంగాత్మక ధ్వనిశాస్త్రం (Acoustic Phonetics)
3. శ్రవణాత్మక ధ్వనిశాస్త్రం (Auditory Phonetics)
4. ధ్వనిశాస్త్రం (Phonetics)

Answer: 1

36. మానవుని ఉచ్చారణా ధ్వనులు గాలిలో కలిగించే విభిన్న ధ్వని తరంగాలను యంత్రాల సహాయంతో నమోదు చేసి వాటిలో గల భేదాలను పరిశీలించే ధ్వని శాస్త్ర శాఖను ఏమంటారు ?
1. ఉచ్చారణాత్మక ధ్వని శాస్త్రం
2. తరంగాత్మక ధ్వని శాస్త్రం
3. శ్రవణాత్మక ధ్వని శాస్త్రం
4. ధ్వని శాస్త్రం

Answer: 2

37. ఉచ్ఛారితలైన ధ్వనుల వాయు తరంగాలు చెవిలోకి ప్రవేశించి కర్ణభేరి, దానికి సంబంధించిన ఎముకల మీద ఎలాంటి మార్పులు కలిగిస్తాయని పరిశీలించే ధ్వనిశాస్త్ర శాఖ
1. ఉచ్చారణాత్మక ధ్వనిశాస్త్రం
2. తరంగాత్మక ధ్వనిశాస్త్రం
3. శ్రవణాత్మక ధ్వనిశాస్త్రం
4. ధ్వనిశాస్త్రం

Answer: 3

38. “బొమ్మ” పదంలోని వర్ణాల సంఖ్య ?
1. 2
2. 3
3. 4
4. 5

Answer: 4

39. ముఖయంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం ?
1. కరణం
2. స్థానం
3. ప్రయత్నం
4. ఉదరం

Answer: 2

40. కరణాలు కదులుతూ కంఠం నుంచి వచ్చే గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాలను తాకుతాయి. అందువల్ల మనలో కలిగేది ?
1. వస్తూత్పత్తి
2. భావోత్పత్తి
3. రసోత్పత్తి
4. వాగుత్పత్తి / ధ్వన్యుత్పత్తి

Answer: 4

41. ఉచ్చారణకు స్థాన కరణాలను సంయోగించునది ?
1. కంఠం
2. ఓష్ఠ్యం
3. వర్తులితం
4. ప్రయత్నం

Answer: 4

42. ముఖయంత్రంలో పై భాగాన ఉన్నప్పటికీ కదులుతూ ఉండడం వల్ల కరణం అయినదేదీ ?
1. కంఠం
2. లంబిక
3. మూర్ధం
4. తాలువు

Answer: 2

43. ధ్వనుల స్థాన, కరణ, ప్రయత్నాన్ని, ఉచ్చారణా విధానాన్ని తెలిపేది ?
1. లిపి విజ్ఞానం
2. అలంకార విజ్ఞానం
3. భాషా విజ్ఞానం
4. ధ్వని విజ్ఞానం

Answer: 4

44. ఒక భాషలో ఉన్న ఒక ధ్వనులు తర్వాత కాలంలో మార్పు చెందడాన్ని ఇలా పిలుస్తారు ?
1. అర్థ విపరిణామం
2. ధ్వని పరిణామం (Phonetic Change)
3. సంకేతికం
4. విసంకేతికం

Answer: 2

45. ధ్వని పరిణామం (Phonetic Change) కు సంబంధించి సరికానిది ?
1. భాషలోని, పదాల్లోని అర్థం స్థిరంగా ఉండి శబ్దం మారడం – శబ్ద పరిణామం / ధ్వని పరిణామం
2. ధ్వనుల మార్పును మొట్టమొదటిసారిగా వివరించినది – టోలమీ (ఇటలీ)
3. రెండు భిన్న వర్ణాలు కలిసి ఏక వర్ణంగా మారడం – వర్ణ సమీకరణం
4. రెండు భిన్న వర్ణాలు కలిసి ఏక వర్ణంగా మారడం – వర్ణ విభేదం

Answer: 4

46. వర్ణ సమీకరణానికి సంబంధం లేని పదం ?
1. చూచు + ఇంచు = చూపించు
2. గది + లు = గదులు
3. పది + లు = పదులు
4. మది + కు = మదికి

Answer: 1

47. ధ్వని పరిణామానికి సంబంధించి వర్ణ సమీకరణం (Assimilation) లో పూర్వ వర్ణ సమీకరణానికి సంబంధించి సరికాని ఉదాహరణ ?
1. ములికి + లు = ములుకులు
2. పలికి + లు = పలుకులు
3. గుడి + కు = గుడికి
4. కులికి + లు = కులుకులు

Answer: 3

48. వర్ణ సమీకరణానికి సంబంధించి పరవర్ణ సమీకరణానికి సంబంధం లేని ఉదాహరణ ?
1. నది + కు = నదికి
2. వాని + కు = వానికి
3. దాని + కు = దానికి
4. పది + లు = పదులు

Answer: 4

49. ఒకే ధ్వనిని రెండుసార్లు ఉచ్చరించినపుడు గాబరావల్లగానీ, తడబాటువల్లకానీ, ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని రావడం ?
1. వర్ణ సమీకరణం
2. వర్ణ విభేదం
3. వర్ణ సమ్మేళనం
4. వర్ణలోపం

Answer: 2

50. వర్ణ సమ్మేళనంకు సంబంధించి సరికానిది ?
1. అనేక వర్ణాలు కలిపి ఏక వర్ణంగా రూపొందడం – వర్ణ సమ్మేళనం. దీనికే వర్ణ సంయోగం, వర్ణ సంయోజనం అని కూడా పేరు.
2. చెఱకు – చెరకు, జాయి – రాయి వర్ణ సమ్మేళనానికి ఉదాహరణలు
3. ముల్-ముల్, కళ్-కల్, కణ్-కన్ను అనేవి వర్ణ సమ్మేళనానికి ఉదాహరణలు
4. నవ్వులాట – నవ్వుటాల అనేది వర్ణ సమ్మేళనానికి ఉదాహరణ.

Answer: 4

Leave a Comment