TET and DSC
Psychology (Paper 1&2) PART-2
TET DSC Psychology 50 Bits in Telugu. TET DSC పరీక్షకు ఉపయోగపడే ముఖ్యమైన Psychology Questions and Answers ను practice చేయండి.
51. శిశువుకు మొదట దగ్గర భాగాలపై పట్టు వస్తుంది తర్వాత దూరంగా ఉండే భాగాలపై పట్టు వస్తుంది అనేది ఈ సూత్రానికి చెందుతుంది.
A. సమీప దూరస్థ
B. శిరఃపాదాభిముఖం
C. క్రమానురహితం
D. వైవిధ్యం
52. వికాసానికి సంబంధించిన సరైన ప్రవచనం (C TET 2021 January)
A. వికాస వేగం అందరికి ఒకేలా ఉంటుంది
B. కేవలం పాఠశాలలో అభ్యసన వలనే వికాసం జరుగుతుంది.
C. వికాసం అనేది కేవలం బాల్య దశ తోనే జరుగుతుంది.
D. వికాసం బహుమితీయమైనది (Multidimensional)
53. బాల్య దశలో వికాసం (C TET 2021 January)
A. నెమ్మదిగా ఉంటుంది, కొలవలేము
B. బహుళ స్థాయిలలో ఉంటుంది మరియు సంక్లిష్టం
C. కేవలం పరిమాణాత్మక మార్పులను మాత్రమే కలిగి ఉంటుంది
D. క్రమరహితం మరియు ఒకదానితో మరియొకటి సంబంధం లేకుండా ఉంటుంది.
54. సావిత్రికి త్వరగా మాటలు వచ్చాయి కానీ సావిత్రి చెల్లికి నాలుగు సంవత్సరాల వయస్సు వరకు మాటలు రాలేదు
A. వికాసం పరస్పర చర్య
B. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
C. వికాసం ఏకీకృత మొత్తం
D. వికాసను ప్రాగుక్తీకరించవచ్చు
55. కోల్బర్గ్ ప్రకారం ఇతరుల గుర్తింపు కోసం ఒక పని చేయటం అనేది ఈ నైతిక స్థాయికి చెందినది (C TET 2021 January)
A. పూర్వ సంప్రదాయ
B. సంప్రదాయ
C. ఉత్తర సంప్రదాయ
D. నియత సంప్రదాయ
56. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనే నియమానికి సంబంధించి సరికాని ప్రవచనం
A. ప్రస్తుత వికాస వేగ లక్షణాలను బట్టి భవిష్యత్‌ను అంచనా వేయటం
B. ఒక దశలోని వికాస లక్షణాలను బట్టి రాబోయే వికాస దశలోని లక్షణాలను ముందుగానే ఊహించుట
C. శిశువు ప్రస్తుతం ఆధారంగా అతడు ఎంత వృద్ధి చెందుతాడో అంచనా వేయటం
D. వికాసం క్రమపద్ధతిలో కొనసాగినప్పటికీ దాని వేగంలో విభిన్నత ఉంటుంది.
57. వికాసం క్రమానుగతమైనది అనే నియమానికి సంబంధించి సరికాని క్రమం
A. అక్షరాలు ఉచ్ఛరించడం – పదాలు – వాక్యాలు
B. భాషణం – లేఖనం – పఠనం – శ్రవణం
C. అంకెలు – సంకలనం – వ్యవకలనం – గుణకారం – భాగాహారం
D. పాల దంతాలు – శాశ్వత దంతాలు
58. ఆనువంశికతకు సంబంధించి సరికానిది
A. జన్మతః సంక్రమించే లక్షణాలు
B. శిశువుపై అన్నింటికంటే ముందుగా ప్రభావిత కారకం
C. జన్యువులపైన క్రోమోసోమ్లు అమరి ఉంటాయి
D. పిల్లలు పూర్వీకుల పోలికలు కలిగి ఉండటం
59. వుడ్‌వర్త్ పరిసరం గురించి చెప్పిన ప్రవచనం
A. వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్యకారకం పరిసరమే.
B. జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం పరిసరం
C. నాకొక డజను మంది శిశువులను ఇవ్వండి మీరు కోరిన విధంగా తయారు చేస్తాను.
D. అనువంశికత వ్యక్తిపై 10% ప్రభావం చూపితే పరిసరం 90% ప్రభావం చూపుతుంది అని చెప్పటం
60. పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మితులను వీటి ఆధారంగా వివరించారు. (C TET 2021 January)
A. మనో వైజ్ఞానిక ఉపకరణాలు
B. ఉద్దీపన – ప్రతిస్పందన సంసర్గము
C. సమీప వికాస మండలం
D. స్కీమా
61. RNA కు సంబంధించి సరైనది
A. జెనెటిక్ కోడ్‌ను తల్లిదండ్రుల నుంచి పిల్లలు చేరవేయడంలో DNA కు సహాయపడుతుంది
B. వారసత్వ సంక్రమణకు మూల కారణం
C. అనువంశికతకు ప్రాథమిక ఆధారం
D. లింగ నిర్ణయాన్ని నిర్ణయిస్తుంది.
62. క్రింది వాటిలో అనువంశికవాది కానివారు
A. మెండల్
B. విన్ షప్
C. ఆల్ పోర్ట్
D. స్కోడాక్
63. క్రింది వానిలో పరిసరవాది కానివారు
A. జె.బి. వాట్సన్
B. బోరింగ్
C. W. బాగ్వే
D. గాల్టన్
64. సంయుక్త బీజ దశలో పై పొర ఏర్పరచని నిర్మాణం
A. నాభిరుజ్జువు
B. పిండం
C. జరాయువు
D. ఆమ్నియాటిక్ సంచి
65. పిండదశకు సంబంధించి సరైనది
A. ఏడు నెలలకే శిశువు తయారు అవుతుంది.
B. లోపలి పొర పిండంగా మారుతుంది
C. శరీరంలోపల, బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి
D. ఈ దశ ఫలదీకరణ నుంచి రెండు వారాల వరకు ఉంటుంది.
66. పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు జరిగే వికాసం యొక్క వరుస క్రమం (C TET 2021 January)
A. ఇంద్రియ, మూర్త, అమూర్త
B. అమూర్త, ఇంద్రియ, మూర్త
C. మూర్త, అమూర్త, ఇంద్రియ
D. అమూర్త, మూర్త, ఇంద్రియ
67. కౌమార దశలో మానసిక వికాసానికి సంబంధించి సరైనది
A. ప్రశ్నించే వయస్సు
B. అన్వేషణ దశ
C. సందిగ్ధ వయస్సు
D. అభ్యసన సంసిద్ధత ఏర్పడుతుంది
68. ఈ క్రింది వానిలో భాష వికాసానికి సంబంధించి సరికానిది
A. శైశవ దశ – ప్రాక్ వాగ్ రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడు
B. పూర్వ బాల్య దశ – వాగుడు కాయ దశ
C. ఉత్తర బాల్య దశ – భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది.
D. కౌమార దశ – అమూర్త ఆలోచన పెరగడంవల్ల కవితలు, రచనలు చేస్తారు.
69. ఈ క్రింది వాటిలో నైతిక వికాసానికి సంబంధించి సరైనది
A. శైశవ దశ – తప్పులు చేసినపుడు నేరం చేశామన్న భావన ఉంటుంది.
B. పూర్వ బాల్య దశ – నైతికతను దాని ఫలితం ఆధారంగా గుర్తిస్తారు
C. ఉత్తర బాల్య దశ – నియమాలను స్వయంచాలకంగా పాటిస్తారు.
D. కౌమార దశ – నైతికతను దాని సంఘటన ఆధారంగా నిర్ణయిస్తారు
70. సాంఘిక వికాసానికి సంబంధించి సరికానిది
A. పూర్వ బాల్యదశ – సాంఘిక క్రీడ
B. కౌమార దశ – పాత్ర గుర్తింపు
C. శైశవ దశ – సంసర్గ క్రీడ
D. ఉత్తర బాల్య దశ – ముఠాదశ
71. క్రింది వాటిలో మానసిక వికాసానికి సంబంధించి సరికాని జత
A. ఉత్తర బాల్య దశ – కార్యకారణ సంబంధం అర్థం చేసుకోగలరు
B. పూర్వ బాల్య దశ – ప్రశ్నార్థకాల దశ
C. కౌమార దశ – సంధి దశ
D. శైశవ దశ – ప్రశ్నించడం నేర్చుకుంటారు కాని జవాబు కోసం వేచి ఉండడానికి ఆసక్తి చూపరు
72. కౌమార దశ లక్షణం కానిది
A. ఉద్వేగ అస్థిరత ఉంటుంది
B. ప్రజ్ఞా వికాసం ఉచ్ఛ స్థాయి
C. నాయకారాధన
D. ముద్దు పలుకులు మాట్లాడుతారు
73. శైశవ దశలో శిశువు తల్లిని లేదా తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వటం క్రింది ఏ వికాసానికి సంబంధించినది
A. మానసిక వికాసం
B. సాంఘిక వికాసం
C. ఉద్వేగ వికాసం
D. నైతిక వికాసం
74. ఏ దశలో అలవర్చుకొన్న సాంఘిక ప్రవర్తనల ఆధారంగానే భవిష్యత్తులోని సాంఘిక సర్దుబాటు ఆధారపడుతుంది.
A. పూర్వ బాల్యదశ
B. శైశవ దశ
C. కౌమార దశ
D. ఉత్తర బాల్య దశ
75. ఈ క్రింది వాటిలో శైశవ దశకు సంబంధించినది
A. ఏకాంత క్రీడల్లో పాల్గొంటారు
B. స్వయం కేంద్రీకృతంగా ఉంటాడు
C. ఉద్వేగాలు తీవ్రంగా, తరచుగా వస్తుంటాయి & తక్కువ సమయం ఉంటాయి
D. ఆలోచనలు అమూర్త రూపంలో ఉంటాయి.
76. పూర్వ బాల్య దశకు సంబంధించినది
A. ఉద్వేగపరంగా నెమ్మదిగా ఉండే దశ
B. వయోజనుడులా కనిపిస్తారు
C. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ
D. భాష సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావిస్తారు.
77. క్రింది వాటిని జతపరచండి.
1. పూర్వ బాల్య దశ. ఎ. విమర్శించడం
2. ఉత్తర బాల్య దశ. బి. ప్రశ్నించడం నేర్చుకుంటారు
3. శైశవ దశ. సి. హఠం చేయడం
4. కౌమార దశ. డి. ముఠా దశ
1. 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
2. 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3. 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4. 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
78. ఈ క్రింది వానిలో సరికాని జత
A. శైశవ దశ – పెరుగుదల వేగంగా జరుగుతుంది
B. పూర్వ బాల్య దశ – లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడా ఉంటాయి
C. ఉత్తర బాల్య దశ – పగటి కలలు కనే దశ
D. కౌమార దశ – కంఠస్వరంలో మార్పు
79. క్రింది వాటిలో ఉత్తర బాల్య దశకు సంబంధించినది
A. అహం కేంద్రీకృతం
B. స్వయం కేంద్రీకృతం
C. వాగుడుకాయదశ
D. ముఠాదశ
80. ఈ క్రింది వాటిలో సరికాని జత
A. శారీరక వికాసం – శాశ్వత దంతాలు
B. మానసిక వికాసం – ప్రశ్నార్థకాల దశ
C. ఉద్వేగ వికాసం – ఉద్వేగ కేథార్సిస్
D. సాంఘిక వికాసం – అహం కేంద్రీకృతం
81. ఈ క్రింది వాటిని జతపరచండి.
1. ఉత్తర బాల్య దశ. ఎ. వాగుడుకాయ దశ
2. శైశవ దశ. బి. స్వయం కేంద్రీకృతం
3. కౌమార దశ. సి. ముఠా దశ
4. పూర్వ బాల్య దశ. డి. సంధి దశ
1. 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
2. 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
82. పియాజేకి సంబంధించిన సరైన ప్రవచనం
A. బహుమతులపై అభ్యసనం ఆధారపడుతుంది
B. పునర్బలనాలపై పిల్లల అభ్యసనం ఆధారపడుతుంది
C. అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు
D. ఉద్దీపనలు అభ్యసనను ప్రభావితం చేస్తాయి.
83. స్కీమాటాకి సంబంధించి సరైనది
A. సంఘటిత ప్రవర్తన నమూనా
B. జన్యు సంబంధమైనది
C. సహజ సామర్థ్యం
D. నిర్మాణాత్మక ఉపగమం.
84. స్కీమాటాకి సంబంధించి సరికానిది
A. పరిసరాల వల్ల వ్యవస్థీకరణం చెందుతాయి
B. సమన్వయరాహిత్య చర్యలు, సమన్వయసహిత చర్యలుగా మారడం
C. అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలు
D. వయస్సుతో పాటు మారకుండా స్థిరంగా ఉంటాయి.
85. పియాజే ప్రకారం ‘ఆపరేషన్స్’ అంటే
A. సమన్వయ రాహిత్యచర్యలు – సమన్వయ సహిత చర్యలుగా మారడం
B. జ్ఞానేంద్రియాల ద్వారా సాధించిన జ్ఞానాన్ని చాలకక్రియ ద్వారా సమన్వయపరచడం
C. కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలు
D. ప్రతిక్రియా జీవి నుంచి పర్యాలోచన జీవిగా పరావర్తనం చెందడం
86. వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది
A. భౌతిక లేదా మనో వైజ్ఞానిక నిర్మాణాలను ఎక్కువ సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సిద్ధత
B. ప్రారంభంలో సరళంగా ఉండే ప్రవర్తన క్రమంగా ఉన్నత ప్రవర్తనగా మారడం
C. పరిసర డిమాండ్ తో సర్దుబాటు చేసుకోవడం
D. కొత్త స్కీమాటాలను రూపొందించుకొన్న తరువాత వాటిని ఇతర స్కీమాటాలో జత చేయడం.
87. ఏ నెలల మధ్య శిశువు ఆట వస్తువులను, బొమ్మలను క్రింద పడేసి ఆనందం పొందగలడు
A. 8-12 నెలలు
B. 12-18 నెలలు
C. 4-8 నెలలు
D. 2-4 నెలలు
88. పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ చాలక దశలో ఏర్పడే లక్షణం
A. వస్తు స్థిరత్వ భావన
B. కన్జర్వేషన్
C. నిగమనాత్మక ఆలోచన
D. నైతిక పరిపక్వత
89. అమూర్త ప్రచాలక దశకు చెందనిది
A. విభిన్న ఆలోచన
B. ప్రకల్పన నిగమనాత్మక ఆలోచన
C. కన్జర్వేషన్ లోపం
D. కార్యకారణ సంబంధం
90. ఈ క్రింది వారిలో మానవతావాది
A. కార్ల్ రోజర్
B. జీన్ పియాజే
C. కోల్బర్గ్
D. నోమ్ చోమ్స్కీ
91. జ్ఞానేంద్రియ చాలక దశకు సంబంధించి సరికానిది
A. శిశువు 1 నుండి 4 నెలలు మధ్య – ఇంతకు ముందు తృప్తినిచ్చిన కృత్యాలను తిరిగి చేయడం నేర్చుకుంటారు
B. శిశువు 8 నుండి 12 నెలలు మధ్య – వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది
C. శిశువు 18 నుండి 24 నెలల మధ్య – అంతర దృష్టి ఉపయోగిస్తారు
D. శిశువు 12 నుండి 18 నెలలు మధ్య – స్కీమాటాలను ఉద్దేశపూర్వకంగా కొత్త సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తాడు.
92. ఈ క్రింది వానిలో సరికానిది
A. కన్జర్వేషన్ – వస్తువుకి ఆకారం, పరిస్థితి మార్చినా దాని గుణాలు మారవు
B. సర్వాత్మక వాదం – జీవం లేని వస్తువులకు జీవం ఆపాదించడం
C. అహోర కేంద్రవాదం – తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా అందరి చుట్టూ కేంద్రీకరించబడి ఉంది
D. వస్తు స్థిరత్వ భావన – వస్తువు శాశ్వతం అని తెలుసుకోవడం
93. చింపాంజీ, కోతి లాగా ఉన్నప్పటికీ ధ్వని, ఆకారం, రంగులలో భేదం ఉంది. కాబట్టి వేరు వేరు జీవులు అని గుర్తించడం ఏ సంజ్ఞానాత్మక నిర్మితి
A. అనుగుణ్యం
B. వ్యవస్థీకరణం
C. సాంశీకరణం
D. సంశ్లేషణం
94. పిల్లల ఆలోచనలు పెద్దల ఆలోచనలతో పోలిస్తే గుణాత్మకంగా భేదం కలిగి ఉంటుందని తెలిపినవారు
A. లారెన్స్ కోల్బర్గ్
B. లెవ్ వైగోట్ స్కీ
C. హోవార్డ్ గార్డ్నర్
D. జీన్ పియాజే
95. ఈ క్రింది వాటిలో సరికానిది
A. ఏకమితి – నీకొక అక్క ఉందా ? ఉంది. పేరు ఏమిటి ? సుజాత. ఆమెకి ఒక చెల్లి ఉందా అంటే లేదు అని చెప్పడం.
B. అవిపర్యాత్మక భావన లోపం – ఐసు గడ్డ నీరుగా మారుతుంది. నీటిని బాగా చల్లబరిస్తే ఐసు గడ్డగా మారుతుంది అని గుర్తించలేకపోవడం
C. నిగమనాత్మక ఆలోచన – ప్రధానోపాధ్యాయుడు 1 నుండి 4 తరగతుల పిల్లలకు రేపు సెలవు అంటే 2 తరగతి పిల్లవాడు తనకి సెలవు అని తెలుసుకొనుట.
D. సర్వాత్మక వాదం – తన చుట్టూ తన ప్రపంచమంతా కేంద్రీకరించబడటం.
96. రెడ్ సిగ్నల్‌ను చూసి బైక్ ఆపడం కోల్బర్గ్ ప్రకారం ఈ దశ
A. సాధనోపయోగ దశ
B. ప్రజాస్వామికంగా అంగీకరింపబడిన చట్టనీతి
C. మంచి ప్రవర్తన
D. అధికారం, సాంఘిక క్రమాన్ని నిర్వహించడం.
97. కోల్బర్గ్ ప్రకారం సంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది
A. సాంఘిక నియమాలకు కట్టుబడి ఉంటారు
B. ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా మంచి చెడులను గుర్తిస్తాడు
C. అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారు
D. చట్టం, ధర్మం ప్రకారం నడుచుకుంటారు.
98. ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అనిపించుకొనుటకు సహస్ర ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది. సహస్ర కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతుంది.
A. పూర్వ సంప్రదాయ స్థాయి
B. ఉత్తర సంప్రదాయ స్థాయి
C. ఉన్నత సంప్రదాయ స్థాయి
D. సంప్రదాయ స్థాయి
99. ఉత్తర సంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది
A. స్వయం – అంగీకార సూత్రాల నైతికత
B. అంతరాత్మ న్యాయం, సమానత్వం ఆధారంగా నిర్ణయాలు చేస్తారు
C. సమాజ శిక్షకు భయపడి సమాజంలోని నియమాలను తూ.చ తప్పకుండా పాటిస్తారు
D. మానవ హక్కులను గౌరవిస్తారు.
100. నోమ్ చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతంనకు సంబంధించి సరైనది
A. శిశువు నిబంధనం ద్వారా భాషలను నేర్చుకుంటాడు
B. పిల్లల మెదడును భాషార్జన చేసే యంత్రాలుగా పేర్కొన్నాడు
C. పిల్లలు పరిసరం ద్వారా భాషను నేర్చుకుంటారు
D. సంప్రదాయ వ్యాకరణ పద్ధతిని సమర్థించాడు
సమాధానాలు
51-1 52-4 53-2 54-2 55-2 56-4 57-2 58-3 59-1 60-4
61-1 62-4 63-4 64-2 65-3 66-1 67-3 68-3 69-2 70-3
71-1 72-4 73-2 74-1 75-4 76-3 77-1 78-3 79-4 80-4
81-1 82-3 83-1 84-4 85-3 86-3 87-2 88-1 89-3 90-1
91-4 92-3 93-4 94-4 95-4 96-4 97-3 98-4 99-3 100-2