TET DSC Psychology 50 Bits in Telugu | Important Questions

TET and DSC
Psychology (Paper 1&2)

TET DSC Psychology 50 Bits in Telugu. TET DSC పరీక్షకు ఉపయోగపడే ముఖ్యమైన Psychology Questions and Answers ను practice చేయండి.

1. శిశువు యొక్క వికాసం (260 Bits)
Part – 1 (50 Bits)
1. భాషా వికాసానికి సంబంధించి సరైన క్రమం
A. ముద్దుపలుకుల దశ – పూర్వ భాషా దశ – శబ్దానుకరణ దశ – శబ్దగ్రాహక దశ
B. పూర్వ భాషా దశ – ముద్దుపలుకుల దశ – శబ్దానుకరణ దశ – శబ్దగ్రాహక దశ
C. శబ్దానుకరణ దశ – శబ్దగ్రాహక దశ – పూర్వ భాషాదశ – ముద్దుపలుకుల దశ
D. పూర్వభాషా దశ – శబ్ద అనుకరణ దశ – ముద్దుపలుకుల దశ – శబ్దగ్రాహక దశ

2. వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని సమర్థిస్తూ చేసిన అధ్యయనం
A. కల్లికాక్ కుటుంబ అధ్యయనం
B. జ్యూక్స్ కుటుంబ అధ్యయనం
C. ఫ్రాన్సిస్ గాల్టన్ అధ్యయనాలు
D. జీప్సీ పిల్లలపై గోర్డన్ అధ్యయనం

3. సాధారణంగా పిల్లల్లో మొదటి పన్ను కనిపించే వయస్సు (సుమారు)
A. 2 నుండి 4 నెలల మధ్య
B. 6 నుండి 8 నెలల మధ్య
C. 12 నుండి 16 నెలల మధ్య
D. 1 నుండి 3 నెలల మధ్య

4. శైశవ దశ లక్షణం కానిది
A. ప్రమాద వయస్సు
B. ముద్దుగొలుపు వయస్సు
C. సందిగ్ధ వయస్సు
D. క్లిష్టదశ

5. సరైన క్రమం
A. ఏకాంత క్రీడ – సమాంతర క్రీడ – సహకార క్రీడ
B. సహకార క్రీడ – సమాంతర క్రీడ – ఏకాంత క్రీడ
C. సమాంతర క్రీడ – ఏకాంత క్రీడ – సహకార క్రీడ
D. ఏకాంత క్రీడ – సహకార క్రీడ – సమాంతర క్రీడ

6. శైశవ దశలో పిల్లలు తమను తాము ప్రేమించుకునే వైఖరి ఉంటుంది. దానిని ఇలా పిలుస్తారు.
A. క్రియేటివిజం
B. సహజ సామర్థ్యం
C. తాదాత్మీకరణం
D. నార్సిసిజమ్

7. క్రింది వానిలో పెరుగుదలకు చెందినది
A. భాష అవగాహన పెరుగుట
B. నైతిక విచక్షణ పెరుగుట
C. పొడవు పెరుగుట
D. చలన కౌశలాలు పెరుగుట

8. క్రింది వాటిలో సరికానిది
A. పెరుగుదల గుణాత్మకమైనది
B. పెరుగుదల వికాసంలో ఒక భాగం
C. పెరుగుదల వలన వచ్చే మార్పులు కొలవగలము
D. పెరుగుదల శారీరక మార్పులను సూచిస్తుంది.

9. క్రింది వారి ప్రకారం భాష ఆర్జించే ప్రక్రియ
A. స్పియర్ మన్
B. చోమ్ స్కీ
C. హార్లాక్
D. టోల్మన్

10. పిల్లల్లో పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు ఏర్పడే క్రమం
A. సంవేదనలు, మూర్త భావాలు, అమూర్త భావాలు
B. మూర్త భావాలు, అమూర్త భావాలు, సంవేదనలు
C. అమూర్త భావాలు, సంవేదనలు, మూర్త భావాలు
D. సంవేదనలు, అమూర్తభావనలు, మూర్తభావనలు

11. చోమ్ స్కీ ప్రకారం పిల్లలు జన్మతః ఈ క్రింది సామర్థ్యం కలిగి ఉంటారు.
A. వైఖరులను ప్రదర్శించటం
B. భాషను నేర్చుకోవటం
C. సృజనాత్మక ఆలోచన
D. నైతిక సూత్రాల అనుసరణ

12. వికాసం తల నుండి పాదాల వైపు ఉంటుందని తెలిపేది
A. సమీప దూరస్థ దశ
B. శిరః హస్తాభిముఖ దశ
C. సరళ సంక్లిష్ట దశ
D. శిరఃపాదాభిముఖ దశ

13. వికాసం గురించి సరైన ప్రవచనం
A. అన్ని జాతులలో వికాస వేగం ఒకేలా ఉంటుంది
B. వికాసం పాఠశాల వలన మాత్రమే జరుగుతుంది.
C. వికాసనం ప్రాగుక్తీకరించలేము
D. వికాసం సంచితమైనది.

14. శ్రీధర్ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే వారి మెప్పుకోసం ఇంటి పనులు చేస్తాడు. కోల్ బర్గ్ ప్రకారం ఇతను నైతిక వికాసం దృష్ట్యా ఈ క్రింది దానికి చెందుతాడు.
A. 1వ స్థాయి 1వ దశ
B. 1వ స్థాయి 2వ దశ
C. 2వ స్థాయి 3వ దశ
D. 2వ స్థాయి 4వ దశ

15. శైశవ దశ గురించి సరికాని వాక్యం
A. అత్యంత వేగంగా పెరిగేదశ
B. పాలదంతాలు వచ్చే దశ
C. పూర్వపాఠశాల దశ
D. ఏకాంత క్రీడలో పాల్గొంటారు.

16. సందిగ్ధ వయస్సుగా ఈ దశను పిలుస్తారు.
A. ఉత్తర బాల్యదశ
B. కౌమార దశ
C. శైశవ దశ
D. పూర్వ బాల్యదశ

17. చామ్ స్కీ ప్రకారం సరికాని ప్రవచనం
A. పిల్లల భాషాభివృద్ధికి బోధనే సరైన మార్గం
B. ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది.
C. పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు.
D. పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది.

18. వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది (టెట్ 2024)
A. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
B. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది
C. వికాసం అవిచ్ఛిన్న చర్య
D. వికాసం అన్ని దశలలో ఒకేలా సాగదు

19. “పరిపక్వత అంటే జీవి జన్యుపటిష్టాన్ని (Genetic Potential) తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో జరుగుతుంది” అన్నవారు (టెట్ 2024)
A. గెసెల్
B. హర్లాక్
C. గాల్టన్
D. క్రైగ్

20. క్రింది వాటిలో ‘ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది
A. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి
B. ఈ దశలో వస్తుస్థిరత్వం భావన ఏర్పడుతుంది
C. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు
D. పుట్టినప్పటి నుండి 2 సం|| వయస్సు వరకు ఈ దశ ఉంటుంది.

21. వ్యక్తి వికాసంపై పరిసరాలకన్నా ఆనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపినవారు
A. వాట్సన్
B. బాగ్వే
C. గోర్డాన్
D. గాల్టన్

22. కోల్ బర్గ్ ప్రకారం “మంచి బాలుడు – బాలిక నేపథ్య నీతి” ఉండేదశ
A. 1వ స్థాయి, 1వ దశ
B. 1వ స్థాయి, 2వ దశ
C. 2వ స్థాయి, 3వ దశ
D. 2వ స్థాయి, 4వ దశ

23. పియాజే ప్రకారం సర్వాత్మవాదం కనపడే దశ (టెట్ 2024)
A. ఇంద్రియ చాలక దశ
B. పూర్వ ప్రచాలక దశ
C. మూర్త ప్రచాలక దశ
D. నియత ప్రచాలక దశ

24. ‘వస్తు స్థిరత్వ భావన’ ఏర్పడే దశ
A. పూర్వ ప్రచాలక దశ
B. ఇంద్రియ చాలక దశ
C. మూర్త ప్రచాలక దశ
D. అమూర్త ప్రచాలక దశ

25. “భాషా గ్రహణ యంత్రం” (Language acquisition Device) భావనను ప్రవేశపెట్టినవారు
A. స్కిన్నర్
B. బండూరా
C. చోమ్ స్కీ
D. పావ్ లోవ్

26. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది
A. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
B. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
C. వికాసం సంచితమైనది
D. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము

27. భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దుపలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం (టెట్ 2024)
A. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
B. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
C. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది
D. వికాసం సంచితమైనది

28. అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ
A. పూర్వబాల్యదశ
B. ఉత్తర బాల్యదశ
C. శైశవదశ
D. కౌమారదశ

29. ‘సహకారక్రీడ’ ఈ వయస్సులో (సుమారు) మొదలవుతుంది
A. 2 సం||ల వయస్సులో
B. 3 లేదా 4 సంవత్సరాల వయస్సులో
C. 5 సంవత్సరాల వయసులో
D. 10 సంవత్సరాల వయస్సులో

30. పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావనా లోపం (Lack of Concept of Irreversibility) కనపడే దశ
A. పూర్వప్రచాలక దశ
B. నియత ప్రచాలక దశ
C. మూర్త ప్రచాలక దశ
D. సాధారణ ప్రచాలక దశ

31. పిల్లలలో ‘స్వీయ భావన/ఆత్మ భావన’ ప్రారంభమయ్యేదశ (టెట్ 2024)
A. శైశవదశ
B. పూర్వ బాల్యదశ
C. ఉత్తరబాల్యదశ
D. కౌమారదశ

32. కోల్బర్గ్ ప్రకారం ‘శిక్షను తప్పించుకోవటానికి పిల్లలు విధేయత చూపడం’ ఈ దశలో కనపడుతుంది.
A. పూర్వ సంప్రదాయ స్థాయి – 1వ దశ
B. పూర్వ సంప్రదాయ స్థాయి – 2వ దశ
C. సంప్రదాయ స్థాయి – 3వ దశ
D. ఉత్తర సంప్రదాయ స్థాయి – 5వ దశ

33. ఎరిక్సన్ ప్రకారం ‘స్వయంప్రతిపత్తి – సందేహం’ అనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు (సుమారు)
A. పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వయస్సు వరకు
B. 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయస్సు మధ్య
C. 3 సంవత్సరం నుండి 6 సంవత్సరం వయస్సు మధ్య
D. 6 సంవత్సరం నుండి 12 సంవత్సరం వయస్సు మధ్య

34. ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి
A. చొరవ – అపరాధం
B. సాన్నిహిత్యం – ఏకాంతం
C. ఉత్పాదకత – స్తబ్ధత
D. సమైక్యత – నిరాశ

35. ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి
A. ఉత్పాదకత – స్తబ్ధత
B. సమైక్యత – నిరాశ
C. పాత్ర గుర్తింపు – పాత్ర సందిగ్ధం
D. శ్రమశీలత – న్యూనత

36. పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి
A. స్వయంప్రతిపత్తి Vs సందేహం
B. చొరవచూపడం Vs తప్పు చేశానన్న భావన
C. శ్రమించడం Vs న్యూనత
D. పాత్ర గుర్తింపు Vs పాత్ర సందిగ్ధం

37. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి (టెట్ 2024)
A. సమైక్యత – నిరాశ
B. స్వయంప్రతిపత్తి – సందేహం
C. నమ్మకం – అపనమ్మకం
D. ఉత్పాదకత – స్తబ్ధత

38. ఎరిక్సన్ మనో సాంఘిక సిద్ధాంతంలో పేర్కొన్న ఈ దశలో సంతృప్తి ‘ఆశ’ అనే సద్గుణానికి కారణం అవుతుంది
A. పూర్వ శైశవ దశ
B. ఉత్తర శైశవ దశ
C. క్రీడా దశ
D. కౌమార దశ

39. ఎరిక్సన్ ప్రకారం ఈ క్రింది మనో సాంఘిక క్లిష్ట పరిస్థితిని సంతృప్తికరంగా ఎదుర్కొంటే మనోబలం అనే లక్షణం ఏర్పడుతుంది.
A. నమ్మకం – అపనమ్మకం
B. స్వయంప్రతిపత్తి – సందేహం
C. ఉత్పాదకత – స్తబ్ధత
D. శ్రమ – న్యూనత

40. ఎరిక్సన్ ప్రకారం పాత్ర గుర్తింపు – పాత్ర సందిగ్ధం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు (సుమారు)
A. 6 – 12 సంవత్సరం
B. 12 – 20 సంవత్సరం
C. 20 – 30 సంవత్సరం
D. 30 – 60 సంవత్సరం

41. పరిణితికి సంబంధించి వాస్తవం కానిది
A. గుణాత్మకమైనది
B. అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది
C. దీనికి శిక్షణ అవసరం లేదు
D. జన్యు సంబంధమైనది

42. వికాసానికి సంబంధించి సరైనది
A. ఇది సంకుచిత భావన
B. శారీరక సంబంధమైనది
C. కార్యాత్మకమైన మార్పులను సూచిస్తుంది
D. ఒక దశలో ఆగిపోతుంది.

43. పెరుగుదలకు సంబంధించి సరికానిది.
A. భౌతిక మార్పులకు సంబంధించినది
B. పరిమాణాత్మకం
C. పెరుగుదలను గమనించలేము
D. నిర్మాణాత్మక మార్పులను సూచిస్తుంది

44. పరిపక్వతకు సంబంధించి సరికానిది
A. ఇది జన్యు ప్రభావాల సంకలనం
B. బాహ్యకారకంతో సంబంధం లేదు
C. శిక్షణ వల్ల మార్పు వస్తుంది
D. అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడదు.

45. ఈ క్రింది వానిలో సరికానిది
A. హర్లాక్ – పెరుగుదల, పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది.
B. గెసెల్ – పరిపక్వత అనునది జన్యు ప్రభావాల సంకలనం
C. క్రైగ్ – పరిపక్వత జీవి జన్యుపటిష్టాన్ని తెలుపుతుంది.
D. అండర్ సన్ – వికాసం ఆకారాలను సమైక్యం చేసే సంక్లిష్ట ప్రక్రియ

46. వికాసం
A. వికాసం = f (పెరుగుదల + పరిణితి)
B. వికాసం = f (పరిణితి + అభ్యసనం)
C. వికాసం = f (పెరుగుదల x పరిణితి)
D. వికాసం = f (పరిణితి x అభ్యసనం)

47. ఈ క్రింది వాటిలో సరైనది
A. పెరుగుదల నిర్మాణాత్మక, కార్యాత్మక మార్పులను సూచిస్తుంది
B. పరిణితి – జన్యు మరియు పరిసర సంబంధమైనది
C. వికాసం – పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది
D. పరిపక్వత – అభ్యసనం, అనుభవాల ద్వారా ఏర్పడుతుంది

48. 3 సంవత్సరాలకి మాట్లాడగలగడం, 11 నెలలకి నడవడం, నాలుగు (4) నెలలకి తలను నిలపడం అనే సంఘటనలు దేనికి సంబంధించినవి
A. పరిపక్వత
B. వికాసం
C. పెరుగుదల
D. వైవస్సీ

49. శిశువులో నైతిక వికాసం శైశవ దశలో చాలా తక్కువగాను, పూర్వ బాల్యదశలో తక్కువగాను, ఉత్తర బాల్య దశలో ఎక్కువగాను, కౌమార దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఏ రకమైన వికాస నియమాన్ని సూచిస్తుంది
A. సమీప దూరస్థ వికాసం
B. వికాసం అవిచ్ఛిన్నమైనది
C. వికాసం అన్ని దశలలో ఒకేలా జరగదు
D. వికాసం క్రమానుగతమైనది.

50. మాట్లాడడానికి ముందు శిశువు శబ్దాలు చేయడం అనేది ఈ వికాస నియమానికి చెందుతుంది
A. వికాసం నిరంతర ప్రక్రియ
B. వికాసం సంచితమైనది
C. వికాసం పరస్పర చర్య
D. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు

సమాధానాలు

1-2    2-4    3-2    4-3    5-1   6-4    7-3    8-1    9-2    10-1   11-2    12-4    13-4    14-3   15-3   16-2    17-1   18-2   19-4    20-3
21-4  22-3  23-2  24-2  25-3  26-4  27-3  28-1   29-2   30-1   31-2   32-1   33-2   34-3    35-4   36-3   37-1   38-1    39-2   40-2
41-2  42-3   43-3   44-3   45-4   46-4   47-3   48-1   49-3   50-2

Leave a Comment