TET and DSC
Psychology (Paper 1&2) PART-3
TET DSC Psychology 50 Bits in Telugu. TET DSC పరీక్షకు ఉపయోగపడే ముఖ్యమైన Psychology Questions and Answers ను practice చేయండి.
101. కార్ల్ రోజర్స్ వికాస సిద్ధాంతంకి సంబంధించినది
A. వ్యక్తి ఎదుగుతున్న కొద్దీ తనకు అనువంశికంగా సంక్రమించిన సామర్థ్యాల ఆధారంగా ఆత్మసాక్షాత్కారం వైపు ఎదుగుతాడు.
B. వ్యక్తి తాను ఎలా ఉండదల్చుకున్నాడో ఆదర్శాత్మక ఆత్మభావన తెలుపుతుంది.
C. ఆదర్శాత్మక అహం, వాస్తవికత అహం వైపు ప్రయాణిస్తే సయోధ్య కుదురుతుంది.
102. వెంకటేష్ అనే ఉపాధ్యాయుడు రవి అనే విద్యార్థికి “మొదట వృత్తం గీయడం నేర్పించి తరువాత చతురస్రం గీయడం నేర్పించాడు. అయితే వెంకటేష్ ఏ వికాస నియమాలను అనుసరించాడు
A. వికాసం క్రమానుగతమైనది
B. వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ
C. వికాసం ఏకీకృత మొత్తం
D. వికాసం సంచితమైనది.
103. ‘వివేకానందునికి శాస్త్రీయ చింతన ఎక్కువ’, పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం వివేకానందుడు ఏ దశకు చెందుతాడు
A. సంవేదన చాలక దశ
B. పూర్వప్రచాలక దశ
C. మూర్త ప్రచాలక దశ
D. అమూర్త ప్రచాలక దశ
104. గాంధీజీ సర్వమానవ సమానత్వం కోసం పాటుపడినాడు. అయితే గాంధీజీ కోల్బర్గ్ నైతికాభివృద్ధి ప్రకారం ఏ స్థాయికి చెందుతాడు
A. పూర్వ సంప్రదాయ స్థాయి
B. నైతిక స్థాయి
C. ఉత్తర సంప్రదాయ స్థాయి
D. సంప్రదాయ స్థాయి
105. వికాస లక్షణం కానిది
A. గుణాత్మకమైనది
B. నిరంతర ప్రక్రియ
C. ప్రాగుక్తీకరించడం
D. పరిమాణాత్మకమైనది
106. పెరుగుదల లక్షణం కానిది
A. సంకుచితమైన భావన
B. నిరంతర ప్రక్రియ
C. ఖచ్చితంగా కొలవవచ్చు
D. పరిమాణాత్మకం
107. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావ చర్య అని దీనిని అంటారు
A. వికాసం
B. పెరుగుదల
C. పరిపక్వత
D. అభ్యసనము
108. ‘పండితపుత్ర పరమ శుంఠః’ అను నానుడి ఈ నియమానికి వర్తిస్తుంది.
A. సారూప్యత
B. వైవిధ్య
C. ప్రతిగమన
D. పోలిక నియమము
109. భాషాబోధన విషయంలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేవి ఒక క్రమంగా నేర్పించుటకు కారణం
A. వికాసం ఏకీకృత మొత్తం
B. వికాసను ప్రాగుక్తీకరించవచ్చు
C. వికాసం క్రమానుగతమైనది
D. వికాసం సంచితమైనది
110. రాణికి పుట్టిన ఇద్దరు పిల్లల్లో ప్రణతి తెలుపు రంగులోను, ప్రణీత్ నలుపు రంగులోను పుట్టాడు. దీనికి అనువంశిక నియమం
A. సారూప్య నియమము
B. వైవిధ్య నియమము
C. ప్రతిగమన నియమము
D. తిరోగమన నియమము
111. వికాస నియమానికి సంబంధించి సరికానిది
A. వికాసంను ప్రాగుక్తీకరించవచ్చు
B. వికాసం ఏకీకృత మొత్తం
C. వికాసం విచ్ఛిన్న ప్రక్రియ
D. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
112. విష్ణు ‘బడి నియమాల’ అనుసారంగా నడుచుకోవాలి అని తెలుసుకొని ప్రవర్తించాడు అయితే విష్ణు కోల్బర్గ్ యొక్క ఈ నైతిక వికాస స్థాయికి చెందుతాడు
A. పూర్వ సంప్రదాయ స్థాయి
B. ఉత్తర సంప్రదాయ స్థాయి
C. సంప్రదాయ స్థాయి
D. మధ్య సంప్రదాయ స్థాయి
113. పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని రాజేష్ కనిపించని తల్లిని గూర్చి వెతికితే రాజేష్ ఈ భావన పొందినట్లు
A. పదిలపరచుకునే భావన
B. వస్తు స్థిరత్వ భావన
C. పూర్వ క్రమయుత భావన
D. సమయ భావన
114. ప్రణతి బొమ్మలకు స్నానం చేయించడం, దుస్తులు వేయడం, సీసాతో పాలు త్రాగించడం వంటి పనులు చేస్తూ ఆడుకుంటుంది. అయిన ప్రణతి పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతుంది
A. సంవేదన చాలక దశ
B. పూర్వ ప్రచాలక దశ
C. మూర్త ప్రచాలక దశ
D. అమూర్త ప్రచాలక దశ
115. క్రింది వికాస నియమాలలో తప్పుగా రాయబడినది
A. వికాసం రెండు నిర్దిష్ట పోకడలు కల్గి ఉంటుంది
B. వికాసం నిరంతర ప్రక్రియ
C. వికాసం సంచిత ప్రక్రియ
D. వికాసం నిర్దిష్ట అంశాల నుండి సాధారణ అంశాల వైపు ప్రయాణిస్తుంది.
116. శ్రీ బాలాజీని 3 సం||ల వయస్సులో సూదితో గ్రుచ్చినపుడు మొదట శరీరాన్నంతటిని కదిలించడం. 10 సం|| వయస్సుకు సూదితో గ్రుచ్చితే గ్రుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదిలించడం. అయితే ఇది ఏ వికాస నియమాన్ని తెలుపుతుంది
A. వికాస ఏకీకృత మొత్తం
B. వికాసం రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది
C. వికాసం క్రమానుగతమైనది
D. వికాసం సాధారణ నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది
117. మందబుద్ధి గల కరుణాకర్ మానసిక వికాసంతో పాటు భాషా, సాంఘిక వికాసాలలో కూడా వెనుకబడి ఉన్నాడు. అయితే ఇది ఈ వికాస నియమాన్ని తెలుపుతుంది
A. వివిధ వికాసాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి
B. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
C. వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ
D. వికాసం సంచితమైనది.
118. నైతిక వికాసం ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది
A. భాషా వికాసం
B. సాంఘిక వికాసం
C. సంజ్ఞానాత్మక వికాసం
D. ఉద్వేగ వికాసం
119. ప్రకాశ్ మంచివాడు అనిపించుకోవడానికి ఉపాధ్యాయుడు చెప్పిన పనులన్నీ చేయడం అనేది కోల్బర్గ్ ప్రకారం
A. పూర్వ సంప్రదాయ స్థాయి
B. సంప్రదాయ స్థాయి
C. ఉత్తర సంప్రదాయ స్థాయి
D. నైతికాభివృద్ధి స్థాయి
120. నువ్వు నాగరాజుతో స్నేహం చేశావ్ వాడు చెడిపోయేది కాక నిన్ను చెడగొడుతున్నాడు అని తండ్రి అనగా నువ్వు నన్ను ఏమైనా అనుగానీ నాగరాజుని ఏమైనా అంటే నేను ఊరుకోను అని వెంకటేష్ అన్నాడు. ఇలాంటి సందర్భం ఏ వయస్సులో సహజం
A. పూర్వ బాల్యదశ
B. కౌమార దశ
C. వయోజన దశ
D. ఉత్తర బాల్య దశ
121. క్రింది వాటిలో వికాసం గూర్చి సరికానిది
A. వికాసం అనేది సంచితమైనది
B. వికాసం క్రమానుగతమైనది
C. వికాసం మాపనయుతమైనది
D. వికాసను ప్రాగుక్తీకరించవచ్చు
122. “హోం వర్క్ చేయాలి – లేకపోతే అమ్మకొడుతుంది”అనే పిల్లవాడు ఏ నైతిక స్థాయికి చెందుతాడు
A. పాఠశాల సంప్రదాయ స్థాయి
B. పూర్వ సంప్రదాయ స్థాయి
C. సంప్రదాయ స్థాయి
D. ఉత్తర సంప్రదాయ స్థాయి
123. జానకి తన ఎదురుగా ఉన్న వారిలో అందరికంటే పొడవైన వారు ఎవరో చెప్పగలిగినది, కానీ ఎదురుగా లేనప్పుడు ఊహించలేకపోయినది – అయితే పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఈ దశకు చెందుతుంది
A. సంవేదన చాలక దశ
B. పూర్వ ప్రచాలక దశ
C. మూర్త ప్రచాలక దశ
D. అమూర్త ప్రచాలక దశ
124. విద్యార్థి పాఠశాల పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడం పియాజే ప్రకారం
A. ఆపరేషన్స్
B. వ్యవస్థీకరణం
C. సంశ్లేషణం
D. అనుగుణ్యత
125. వరుణ్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇళ్లు చెట్లు వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తున్నాడు అయితే వరుణ్ పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు
A. పూర్వ ప్రచాలక దశ
B. మూర్త ప్రచాలక దశ
C. ఇంద్రియ చాలక దశ
D. అమూర్త ప్రచాలక దశ
126. యశ్వంత్ నీకొక తమ్ముడున్నాడా ? ఉన్నాడు, పేరు ఏమిటి ? కౌశిక్, కౌశిక్ అన్నయ్య ఉన్నాడా ? లేడు అని చెప్తే పియాజే ప్రకారం యశ్వంత్ ఏ దశకు చెందుతాడు
A. మూర్త ప్రచాలక దశ
B. నియత ప్రచాలక దశ
C. ఇంద్రియ చాలక దశ
D. పూర్వ ప్రచాలక దశ
127. వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, తరువాత పదాలు, వాక్యాలు రాయగలిగే నియమం
A. వికాసం సంచితమైనది
B. వికాసం ప్రాగుక్తీకరించవచ్చు
C. వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ
D. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
128. ఏకాంతర క్రీడ లక్షణం కానిది
A. శైశవ దశలో కన్పిస్తుంది
B. ఒంటరి ఆటల పట్ల ఆసక్తి చూపుతారు
C. ఇది రెండు సంవత్సరాల వయస్సు వరకు ఉంటుంది
D. ఇతరులతో కలిసి ఆడుకోవడానికి ఇష్టం చూపుతారు
129. సాంఘిక క్రీడ లక్షణం కానిది
A. ఇది సాంఘిక వికాసానికి మొదటి మెట్టు
B. ఇతర పిల్లలు తమ వస్తువులను తాకడానికి ఒప్పుకోరు
C. తమకి ఇష్టమైన వాళ్ళతో ఆడుకుంటారు
D. జట్లు, జట్లుగా ఆడుకుంటారు.
130. భార్గవ్ ఒకే సంఖ్యలో ఉన్న గోళీకాయలు దగ్గరగా ఉన్నప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నాయని, దూరం దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని భావించాడు. అయిన భార్గవ్ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతాడు.
A. ఇంద్రియ చాలక దశ
B. పూర్వ ప్రచాలక దశ
C. నియత ప్రచాలక దశ
D. మూర్త ప్రచాలక దశ
131. పదిలపరచుకునే భావన అభివృద్ధి చెందే దశ
A. మూర్త ప్రచాలక దశ
B. పూర్వ ప్రచాలక దశ
C. అమూర్త ప్రచాలక దశ
D. ఇంద్రియ చాలక దశ
132. అమూర్త ప్రచాలక దశకు చెందనిది
A. ప్రకల్పన నిగమనాత్మక వివేచనం ఉంటుంది
B. స్వీయ కేంద్రీకృతం ఎక్కువ
C. కార్యకారణ సంబంధం ఏర్పరచగలరు
D. చింతనం అమూర్త విషయాల పట్ల కలుగుతుంది.
133. శైశవ దశ లక్షణం
A. విమర్శ, విరోధ స్వభావం కల్గి ఉండటం
B. సహకార క్రీడల్లో పాల్గొనడం
C. అన్వేషణ దశ
D. శారీరక పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది
134. శైశవ దశ లక్షణం కానిది
A. జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది
B. పాలదంతాలు ప్రారంభం అవుతాయి
C. గొంతు మారటం
D. ఏకాంతర క్రీడల్లో పాల్గొంటారు
135. పూర్వ బాల్య దశ లక్షణం
A. అభ్యసన సంసిద్ధత ఏర్పడుతుంది
B. కిశోర ప్రాయదశ
C. ప్రశ్నించే వయస్సు
D. గ్యాంగ్ దశ
136. పూర్వ బాల్యదశ లక్షణం కానిది
A. సహకార క్రీడల్లో పాల్గొంటారు
B. పాత్ర సందిగ్ధత గల దశ
C. పాఠశాల పూర్వ దశ
D. ప్రమాద వయస్సు
137. ఉత్తర బాల్య దశ లక్షణం కానిది
A. అభ్యసన సంసిద్ధత ఏర్పడుతుంది
B. ముఠాదశ
C. ఉద్వేగ స్థిరత్వం కల దశ
D. వ్యక్తి పరిపూర్ణత పొందే దశ
138. కౌమార దశ లక్షణం కానిది
A. ఒత్తిడి ఒడిదుడుకుల దశ
B. సందిగ్ధ వయస్సు
C. సైనిలిటి దశ
D. వికాసాల పతాక స్థాయికి చేరుకునే దశ
139. పిల్లలు ప్రపంచాన్ని తమ దృష్టి నుంచి చూడడాన్ని ఏమంటారు
A. స్వీయ కేంద్రీకృతం
B. ప్రత్యక్ష సామర్థ్యం
C. జ్ఞానేంద్రియ వికాసం
D. అహోర కేంద్రీకృతం
140. పులి ప్రత్యక్షంగా లేకున్నా హిమ అనే విద్యార్థిని వర్ణించగలుగుతుంది. పియాజే ప్రకారం ఇది ఏ దశ
A. మూర్త ప్రచాలక దశ
B. పూర్వ ప్రచాలక దశ
C. అమూర్త ప్రచాలక దశ
D. సంవేదన చాలక దశ
141. ప్రకాశ్ కుమారుడు సాయి దొంగతనం చేశాడు. ఈ విషయం తెలిసిన ప్రకాశ్ చట్టం ముందు అందరూ సమానమే అంటూ కొడుకుని పోలీసులకి అప్పగించాడు. అయితే ప్రకాశ్ కోల్బర్గ్ ఏ స్థాయికి చెందుతారు
A. సంప్రదాయ స్థాయి
B. పూర్వ సంప్రదాయ స్థాయి
C. ఉత్తర సంప్రదాయ స్థాయి
D. దక్షిణ సంప్రదాయ స్థాయి
142. ఈ క్రింది వాటిలో సరియైన ప్రవచనం
A. పెరుగుదల వికాసంలో అంతర్భాగం
B. పెరుగుదల, వికాసం రెండు సమాన అర్థాలు కలవి
C. వికాసం, పెరుగుదలలో అంతర్భాగం
D. పెరుగుదల, వికాసం మధ్య సంబంధం లేదు.
143. శిక్షణతో నిమిత్తం లేకుండా పెరుగుదలతో పాటు సహజంగా ఏర్పడే గుణాత్మక మార్పులు దీనిని సూచిస్తాయి
A. పెరుగుదల
B. వికాసం
C. పరిణితి
D. అనుభవం
144. శైశవ దశలో బంతిని పట్టుకోవడానికి రెండు చేతులతో పాటు శరీరం మొత్తాన్ని కదిపిన శిశువు. బాల్య దశలో అవసరమైన చేతిని మాత్రమే చాపి బంతి పట్టుకోవడాన్ని వివరించే నియమం
A. వికాసం సామాన్యం నుండి నైరళం వైపు ప్రయాణిస్తుంది
B. వికాసం క్రమానుగతమైనది
C. వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది
D. వికాసం సామాన్యం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది.
145. కింది వాటిలో సరికాని ప్రవచనం
A. వికాసం అన్ని దశలలో ఒకే విధంగా కొనసాగుతుంది
B. వికాసం సంచితమైనది
C. వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ
D. వికాసం ఒక పరస్పర చర్య
146. వ్యక్తిని ప్రభావితం చేసే మొదటి కారకం
A. పరిసరం
B. అనువంశికత
C. పరిసరం, అనువంశికత
D. కుటుంబం
147. జన్యువులు వీటిలో ఉంటాయి
A. క్రోమోసోమ్లు
B. శుక్రకణం
C. లైసోజోమ్లు
D. డి.ఎన్.ఎ.
148. నాకొక డజను మంది శిశువులను ఇవ్వండి సరైన పరిసరాలు కల్పించి వారిని మీరు కోరిన విధంగా తయారు చేస్తాను అని చెప్పినవారు
A. మెండల్
B. గాల్టన్
C. డబ్ల్యు.సి. బాగ్వే
D. వాట్సన్
149. కింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది
A. పరిమాణాత్మక మార్పు
B. శారీరక మార్పు
C. గుణాత్మక మార్పు
D. భౌతిక మార్పు
150. కింది వాటిలో వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం
A. సంకుచితమైనది
B. ప్రాగుక్తీకరించవచ్చు
C. ఒక దశలో ఆగిపోతుంది
D. అన్ని దశలలో ఒకేలా ఉంటుంది
సమాధానాలు
101-3 102-1 103-4 104-3 105-4 106-2 107-2 108-3 109-3 110-2
111-3 112-3 113-2 114-2 115-4 116-4 117-1 118-3 119-2 120-2
121-3 122-2 123-3 124-4 125-1 126-4 127-1 128-4 129-2 130-2
131-1 132-2 133-4 134-3 135-3 136-2 137-4 138-3 139-4 140-3
141-3 142-1 143-3 144-4 145-1 146-2 147-1 148-4 149-3 150-2