TET DSC Psychology 50 Bits in Telugu | Important Questions

TET and DSC
Psychology (Paper 1&2)        PART-4

TET DSC Psychology 50 Bits in Telugu. TET DSC పరీక్షకు ఉపయోగపడే ముఖ్యమైన Psychology Questions and Answers ను practice చేయండి.

151. కింది వాటిలో పరిణితికి సంబంధించి సరైనది
A. పరస్పర సంబంధమైనది
B. అభ్యసనం, అనుభవాల ద్వారా ఏర్పడుతుంది
C. బహిర్గత మార్పు
D. జన్యు ప్రభావాల సంకలనం

152. పెరుగుదలకు సంబంధించనిది
A. గుణాత్మక మార్పు
B. ప్రత్యేకాంశానికి సంబంధించినది
C. విస్తృతమైన చర్య
D. మానసిక మార్పు

153. వినయ్ 3 సం||లకు మాట్లాడితే అభయ్ 4 సంవత్సరాలకు మాట్లాడడం ఏ వికాస నియమాలను తెలుపుతుంది
A. వికాస పరస్పర చర్య
B. సంచితమైనది
C. క్రమానుగతమైనది
D. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి

154. తల్లిదండ్రుల నుండి మంచి గాత్రం లభించిన వ్యక్తికి సరైన శిక్షణ ఇవ్వడం వలన మంచి గాయకుడిగా మారాడు. దానిలో ఇమిడియున్న వికాసం
A. వికాస క్రమానుగతం
B. వికాస పరస్పర చర్య
C. వికాసం ఏకీకృత మొత్తం
D. వికాసం నిరంతర ప్రక్రియ

155. వినయ్కు పరీక్షలో కాపీ కొట్టాలని ఉంది గానీ పట్టుబడితే శిక్షిస్తారు, సమాజం ఆమోదించదు అని కాపీ కొట్టలేదు. కోల్బర్గ్ ప్రకారం వినయ్ ఈ స్థాయికి చెందుతాడు.
A. పూర్వ ప్రచాలక స్థాయి నైతికత
B. సాంప్రదాయిక స్థాయి నైతికత
C. ఉత్తర సాంప్రదాయిక స్థాయి నైతికత
D. విశ్వజనీన నైతిక విలువల ఓరియంటేషన్

156. వెంకట్ పాఠశాల స్థాయిలో మంచి క్రికెటర్గా రాణిస్తున్నాడు. కాబట్టి భవిష్యత్లో జాతీయ స్థాయిలో క్రికెటర్ అవుతాడు అని అంచనా వేయడం ఏ వికాస నియమం
A. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
B. సంచితమైనది
C. పరస్పర సంబంధంగా కొనసాగుతుంది
D. నిరంతర ప్రక్రియ

157. కింది వానిలో అనువంశికతవాది
A. డబ్లూ.సి.బాగ్వే
B. గాల్టన్
C. బోరింగ్
D. లాంగ్ ఫీల్డ్

158. జన్యువు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి కారకం పరిసరమే అని నిర్వచించినది
A. ఉడ్వర్త్
B. బోరింగ్ వెల్డ్
C. గారెట్
D. న్యూమన్, ఫ్రీమన్

159. తల్లిదండ్రుల నుండి జెనిటిక్ కోడ్ను డి.ఎన్.ఎ.కు అందజేసేది
A. ఆర్.ఎన్.ఎ.
B. జన్యువులు
C. క్రోమోసోమ్లు
D. అల్లోసోమ్లు

160. ప్రశ్నార్థకాల దశ
A. శైశవ దశ
B. పూర్వ బాల్య దశ
C. ఉత్తర బాల్య దశ
D. కౌమార దశ

161. పరిపక్వతను నిర్ణయించేది
A. పరిసరం
B. జన్యువులు
C. అనువంశికత, పరిసరం
D. అభ్యసన

162. ఈ క్రింది వికాస నియమాలలో సరికానిది
A. వికాసం క్రమానుగతం
B. సంచితమైనది
C. నిరంతర ప్రక్రియ
D. వైయక్తిక భేదాలుండవు

163. ఈ క్రింది వాటిలో సరికాని జత
A. డగ్డేల్ – జ్యూక్స్ కుటుంబం
B. గోడార్డ్ – కల్లికాక్ కుటుంబం
C. విన్షీప్ – డార్విన్ కుటుంబం
D. కెల్లాగ్ – డొనాల్డ్ శిశువు

164. సంధి దశ
A. శైశవ దశ
B. పూర్వ బాల్యదశ
C. ఉత్తర బాల్యదశ
D. కౌమార దశ

165. శిశువు కనబరిచే మొట్టమొదటి ఉద్వేగం
A. సాధారణ ఉత్తేజం
B. ఏడ్వడం
C. ప్రేమ
D. అసూయ

166. ఉద్వేగ కెథార్సిస్ ప్రదర్శించే దశ
A. కౌమార దశ
B. పూర్వ బాల్యదశ
C. ఉత్తర బాల్యదశ
D. శైశవ దశ

167. మొదటి సాంఘిక కృత్యంగా ఏ క్రీడను పేర్కొంటారు
A. సమాంతర క్రీడ
B. సంసర్గ క్రీడ
C. ఏకాంతర క్రీడ
D. సాంఘిక క్రీడ

168. తప్పు చేసినా నేరం చేశామన్న భావన లేని దశ
A. కౌమార దశ
B. ఉత్తర బాల్యదశ
C. శైశవ దశ
D. పూర్వ బాల్యదశ

169. భాషా వికాసంలో 2వ దశ
A. ప్రాగ్భాష దశ
B. శబ్దానుకరణ దశ
C. శబ్ద గ్రాహ్యక దశ
D. ముద్దుపలుకుల దశ

170. శిశువు యొక్క మెదడులో భాషార్జన చేసే యంత్ర ఉపకరణాలు ఉంటాయని పరికల్పన చేసినవారు
A. గాల్టన్
B. చోమ్స్కీ
C. కోల్బర్గ్
D. స్కిన్నర్

171. ‘నిబంధనం’ ద్వారా భాషా వికాసం జరిగే దశ
A. శబ్ద గ్రాహ్య దశ
B. ముద్దు పలుకుల దశ
C. పూర్వ భాష దశ
D. శబ్దానుకరణ దశ

172. వాగుడుకాయ దశగా పిలువబడేది
A. పూర్వ బాల్యదశ
B. కౌమార దశ
C. శైశవ దశ
D. ఉత్తర బాల్యదశ

173. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణం
A. సాంశీకరణం
B. సానుకూల ప్రక్రియ
C. స్కీమాటా
D. వ్యవస్థీకరణం

174. LSRW క్రమంలో బోధన అనేది ఏ వికాసను సమర్థిస్తుంది.
A. క్రమానుగతం
B. నిరంతర ప్రక్రియ
C. ప్రాగుక్తీకరించవచ్చు
D. పరస్పర చర్య

175. వస్తు స్థిరత్వ భావన ఈ దశలో ఏర్పడుతుంది
A. పూర్వ ప్రచాలకదశ
B. మూర్త ప్రచాలకదశ
C. ఇంద్రియ చాలకదశ
D. అమూర్త ప్రచాలక దశ

176. ‘Make a believe Play’ ఏ దశలో కనిపిస్తుంది
A. పూర్వభావనాత్మక దశ
B. ఇంద్రియ చాలక దశ
C. అమూర్త ప్రచాలక దశ
D. మూర్త ప్రచాలక దశ

177. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవటానికి విధేయత చూపటం ఈ దశలో కనపడుతుంది
A. 1వ
B. 3వ
C. 4వ
D. 2వ

178. Language Acquisition Theory గ్రంథ రచయిత
A. కోల్బర్గ్
B. స్కిన్నర్
C. పియాజే
D. చోమ్స్కీ

179. Freedom to Learn for the Eightees గ్రంథ రచయిత
A. కార్ల్ రోజర్స్
B. చోమ్స్కీ
C. పియాజే
D. కోల్బర్గ్

180. ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో కన్పించే సద్గుణం
A. సామర్థ్యం
B. ప్రేమ
C. విశ్వసనీయత
D. లక్ష్యం

181. కోల్బర్గ్ ప్రకారం బహుమతి పొందాలి అనే లక్ష్యంతో పిల్లలు ప్రవర్తించే నైతిక వికాస దశ
A. 4వ
B. 6వ
C. 3వ
D. 2వ

182. పియాజే ప్రకారం ప్రకల్పన నిగమనాత్మక వివేచనం కనిపించే దశ
A. అమూర్త ప్రచాలక దశ
B. పూర్వ ప్రచాలక దశ
C. జ్ఞానేంద్రియ చాలక
D. మూర్త ప్రచాలక దశ

183. పూర్వ వయోజన దశలో కన్పించే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితులు
A. శ్రమశీలత – ఆత్మన్యూనత
B. ఉత్పాదకత – స్తబ్ధత
C. చిత్తశుద్ధి – నిరాశ
D. సాన్నిహిత్యం – ఏకాంతం

184. కార్ల్ రోజర్స్ ప్రకారం అభ్యాసకుని అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసనం
A. సంజ్ఞానాత్మక
B. అనుభవపూర్వక
C. నైతిక అభ్యసనం
D. సాంఘిక అభ్యసనం

185. గాంధీజీ, హరిశ్చంద్రుడు, మదర్ థెరిస్సా వంటి వారు కోల్బర్గ్ ప్రకారం ఈ నైతిక స్థాయికి చెందుతారు
A. పూర్వ సంప్రదాయ
B. సంప్రదాయ
C. ఉత్తర సంప్రదాయ
D. బహుళ సంప్రదాయ

186. వికాస సూత్రం
A. D=f(MxL)
B. D=f[M/L]
C. D=GxL
D. D=f(MxG)

187. ఈ క్రింది వాటిలో వికాసానికి సంబంధించి సరికానిది
A. గుణాత్మకం
B. ప్రాగుక్తీకరించవచ్చు
C. సమగ్రమైనది
D. గణనాత్మకం

188. విద్యార్థుల సహజ సామర్థ్యాలను బట్టి భవిష్యత్ వృత్తుల గురించి ఊహించడం ఏ వికాస నియమం
A. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
B. శిరఃపాదాభిముఖ వికాసం
C. వికాసం ఒక పరస్పర చర్య
D. వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది

189. వ్యక్తి యొక్క Blue Print గా దేనిని పేర్కొంటారు
A. DNA
B. క్రోమోసోమ్లు
C. జన్యువులు
D. RNA

190. Educational Determinism గ్రంథ రచయిత
A. జె.బి. వాట్సన్
B. గాల్టన్
C. స్కోడాక్
D. డబ్ల్యు.సి. బాగ్వే

191. ఒక బాలుడు తను రోడ్డుపై నడుస్తూ ఉంటే తనతో సూర్యుడు కూడా పయనిస్తున్నాడనుకోవడం – పియాజే ప్రకారం ఏ దశలో జరుగుతుంది.
A. మూర్త ప్రచాలక
B. పూర్వ ప్రచాలక
C. ఇంద్రియ ప్రచాలక
D. అమూర్త ప్రచాలక

192. ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ గల అమ్మాయి అనిపించుకోవడానికి రాణి ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది. ఇది ఏ నైతిక వికాస స్థాయికి చెందినది.
A. పూర్వ సంప్రదాయ స్థాయి
B. సంప్రదాయ స్థాయి
C. ఉత్తర సంప్రదాయ స్థాయి
D. ఉన్నత స్థాయి

193. ఒక వస్తువు ఆకారం మార్చినా, పరిస్థితి మార్చినా దాని గుణాలు మారవు. దీనిని ఏమంటారు
A. సంశ్లేషణ
B. అనుగుణ్యం
C. ఏకమితి
D. కన్జర్వేషన్

194. పియాజే ప్రకారం ఈ దశలో పిల్లలు చంద్రుడు, సూర్యుడు ప్రాణం ఉన్నవిగా భావిస్తారు
A. జ్ఞానేంద్రియ చాలక
B. పూర్వ ప్రచాలక
C. మూర్త ప్రచాలక
D. అమూర్త ప్రచాలక

195. పూర్వ సంప్రదాయ స్థాయిలో శిశువు ఏది తప్పు. ఏది ఒప్పు అనేది దేనిని బట్టి ఆలోచిస్తుంది
A. పరిణామం బట్టి
B. సామాజిక నియమాల ఆధారంగా
C. ఆలోచన బట్టి
D. ఇతరుల మెప్పు పొందటంపై

196. తాను నిర్థారించుకున్న నైతిక నియమాల ప్రకారం నడుచుకునే కోల్బర్గ్ దశ
A. పూర్వ సంప్రదాయ
B. సంప్రదాయ
C. ఉత్తర సంప్రదాయ
D. ఉన్నత సంప్రదాయ

197. ప్రకల్పన నిగమనాత్మక వివేచనం గల పియాజే దశ
A. ఇంద్రియ ప్రచాలక
B. మూర్త ప్రచాలక
C. పూర్వ ప్రచాలక
D. అమూర్త ప్రచాలక

198. 6 సం|| రాజు నాన్న తెచ్చిన పాపాయి బొమ్మకు పాలు త్రాగించుటకు ప్రయత్నిస్తుండెను ఇది పియాజే పేర్కొన్న దశలో దేనికి చెందుతుంది.
A. జ్ఞానేంద్రియ
B. పూర్వ ప్రచాలక
C. అమూర్త ప్రచాలక
D. మూర్త ప్రచాలక

199. దృగ్విషయ క్షేత్ర సిద్ధాంతం గురించి పేర్కొన్నవాడు
A. నోమ్చామ్ స్కీ
B. కార్ల్ రోజర్స్
C. కోల్బర్గ్
D. పియాజే

200. ఉపాధ్యాయుడు 5 సం||ల శిశువుకు నీకొక అన్నయ్య ఉన్నాడా అని అడిగినపుడు ఉన్నాడు అని, మీ అన్నయ్యకు తమ్ముడు ఉన్నాడా అని అడిగితే లేడు అని సమాధానం చెప్పాడు. పియాజే ప్రకారం బాలుడు ఈ దశకు చెందుతాడు
A. ఇంద్రియ చాలక
B. అమూర్త ప్రచాలక
C. పూర్వ ప్రచాలక
D. మూర్త ప్రచాలక

సమాధానాలు

151-4     152-2     153-4     154-2     155-2    156-1    157-2     158-2    159-1     160-2
161-4     162-4     163-3     164-4     165-1    166-3    167-1     168-3    169-2     170-2
171-4     172-1     173-3     174-1     175-3    176-1    177-1     178-4    179-1     180-3
181-4     182-1     183-4     184-2     185-3    186-1    187-4     188-1    189-3     190-2
191-2     192-2     193-4     194-2     195-1    196-3    197-4     198-2    199-2     200-3

Leave a Comment