TET DSC Psychology 60 Bits in Telugu | Important Questions

TET and DSC
Psychology (Paper 1&2)       PART-5

TET DSC Psychology 60 Bits in Telugu. TET DSC పరీక్షకు ఉపయోగపడే ముఖ్యమైన Psychology Questions and Answers ను practice చేయండి.

201. ఈ క్రింది వాటిలో పూర్వ ప్రచాలక దశకు చెందనిది
A. అహం కేంద్రీకృతం
B. సర్వాత్మక వాదం
C. కన్జర్వేషన్ లోపం
D. ప్రకల్పనాత్మక వివేచన

202. ఈ క్రింది వాటిలో అంతర్ బౌద్ధిక దశకు చెందిన పరిమితి కానిది
A. పదిలపరచుకొనే భావన లోపం
B. పూర్వక్రమయుత దశ తెలియదు
C. ఏకమితి
D. సర్వాత్మక వాదం

203. వ్యక్తి అవసరాలే వ్యక్తి గమనాని నిర్దేశిస్తాయి అని కార్ల్ రోజర్స్ దేనిలో తెలిపాడు.
A. ఆత్మ సిద్ధాంతం
B. నిర్దేశిత మంత్రణం
C. దృగ్విషయ క్షేత్రం
D. అనిర్దేశక మంత్రణం

204. వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచన మూర్త విషయాలకు మాత్రమే పరిమితం అయ్యే దశ
A. ఇంద్రియ చాలక
B. అమూర్త ప్రచాలక
C. పూర్వప్రచాలక
D. మూర్త ప్రచాలక

205. విశ్వవ్యాప్తమైన నైతిక విలువలు పాటించాలనుకునే దశ
A. పూర్వ సంప్రదాయ
B. ఉత్తర సంప్రదాయ
C. నిమ్న సంప్రదాయ
D. సంప్రదాయ

206. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ
A. ఇంద్రియ చాలక
B. పూర్వ ప్రచాలక
C. మూర్త ప్రచాలక
D. అమూర్త ప్రచాలకదశ

207. భాషా వికాసంలో మూడవ దశ
A. ప్రాగ్భాష దశ
B. ముద్దు మాటల దశ
C. శబ్దానుకరణ దశ
D. భాషావగాహన దశ

208. ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోసోమ్ల సంఖ్య
A. 20 జతలు
B. 22 జతలు
C. 23 జతలు
D. 16 జతలు

209. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి
A. సర్వాత్మక వాదం
B. పదిలపరచుకొనే భావన లోపం
C. వస్తు శాశ్వతత్వం
D. అహంకేంద్రవాదం

210. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ
A. పూర్వ సంప్రదాయ స్థాయి – 1వ దశ
B. పూర్వ సంప్రదాయ స్థాయి – 2వ దశ
C. సంప్రదాయ స్థాయి – 3వ దశ
D. సంప్రదాయ స్థాయి – 4వ దశ

211. పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొనే వయస్సు
A. 1 సం||లోపు
B. 2 సం||లు
C. 3-4 సం||లు
D. 1 నుండి 2 సం||లు

212. 1 సం||లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు గానీ ఇతరులు గాని సంతృప్తి పరచనపుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి
A. నమ్మకం – అపనమ్మకం
B. చొరవ – తప్పు చేశానన్న భావన
C. శ్రమించడం – న్యూనత
D. పాత్ర గుర్తింపు – సందిగ్ధం

213. పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ
A. ఉత్తర బాల్యదశ
B. పూర్వ బాల్యదశ
C. పూర్వ కౌమార దశ
D. ఉత్తర కౌమారదశ

214. పరీక్షలలో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టడం లేదు. ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ
A. 2వ దశ – పూర్వ
B. 1వ దశ – పూర్వ
C. 5వ దశ – ఉత్తర
D. 4వ దశ – సంప్రదాయ

215. కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందు వల్ల కుక్క అని భావించడం
A. అనుగుణ్యత
B. వ్యవస్థీకరణం
C. సాంశీకరణం
D. సమతుల్యత

216. ఈ క్రింది వాటిలో పెరుగుదల లక్షణం కానిది
A. పరిమాణాత్మకమైనది
B. ఇది వికాసంలో ఒక భాగం
C. జీవితాంతం కొనసాగదు
D. ఇది సమగ్రమైనది

217. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది, దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం
A. వికాసం ఒక పరస్పర చర్య
B. వికాసం సంచితమైనది
C. వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి
D. వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ

218. ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతుంది
A. ఉత్తర బాల్యదశ
B. పూర్వ యౌవన దశ
C. పూర్వ కౌమార దశ
D. మధ్య యౌవన దశ

219. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు
A. గాల్టన్
B. పావ్లోవ్
C. గెసెల్
D. హర్లాక్

220. వికాసం గురించి సరికాని ప్రవచనం
A. క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది
B. వైయక్తిక భేదాలుంటాయి
C. అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది
D. సంచిత ప్రక్రియ

221. కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది
A. పూర్వ సంప్రదాయ
B. సంప్రదాయ
C. సంప్రదాయేతర
D. ఉత్తర సంప్రదాయ

222. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి
A. ఇంద్రియ చాలక దశ
B. పూర్వ ప్రచాలక దశ
C. మూర్త ప్రచాలక దశ
D. నియత ప్రచాలక దశ

223. పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు
A. అభ్యసనం & పునర్బలనం
B. ప్రోత్సాహం & బహుమతులు
C. పరిశోధన & ప్రేరణ
D. అన్వేషణ & అనుభవం

224. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం
A. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
B. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతుంది
C. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది
D. వికాసం ఒక పరస్పర చర్య

225. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం
A. చలన వికాసం
B. అనువంశికత
C. పరిసరాలు
D. అభ్యాసము

226. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి
A. నమ్మకం & అపనమ్మకం
B. శ్రమించడం & న్యూనత
C. ఉత్పాదకత & స్తబ్ధత
D. చిత్తశుద్ధి & నిరాశ

227. పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ
A. శైశవ దశ
B. పూర్వ బాల్యదశ
C. ఉత్తర బాల్యదశ
D. కౌమారదశ

228. అభ్యసన సంసిద్ధత ఏర్పడే దశ
A. శైశవ దశ
B. పూర్వ బాల్యదశ
C. ఉత్తర బాల్యదశ
D. కౌమారదశ

229. శిశువులో కన్పించే మొట్టమొదటి ఉద్వేగం
A. కోపం
B. భయం
C. ఏడుపు
D. ఉత్తేజం

230. పాత్ర గుర్తింపు ఈ వికాసాన్ని తెలియజేస్తుంది
A. శారీరక వికాసం
B. మానసిక వికాసం
C. నైతిక వికాసం
D. ఉద్వేగ వికాసం

231. ‘సంధి దశ’ ఈ వికాసానికి సంబంధించినది
A. శారీరక
B. మానసిక
C. ఉద్వేగ
D. సాంఘిక

232. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది
A. జంతువాదం – పూర్వ ప్రచాలక దశ
B. వస్తు స్థిరత్వ భావన – ఇంద్రియ చాలక దశ
C. మంచి బాలుని నీతి – సంప్రదాయ నైతికత
D. నిగమనాత్మక వివేచనం – మూర్త ప్రచాలక దశ

233. ఈ క్రింది వాటిలో శారీరక వికాసానికి సంబంధించనిది ?
A. పెరుగుదల వేగంగా చాల ఎక్కువ
B. పాలదంతాలు వస్తాయి
C. జ్ఞానేంద్రియాల వికాసం ఎక్కువ
D. ప్రశ్నించడం నేర్చుకుంటారు

234. వికాసం గురించి సత్యమైన ప్రవచనం (C TET 2021 January)
A. పిల్లల వికాసంలో సాంస్కృతిక వైవిధ్యం చాలా ఉంది
B. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఒకే క్రమాన్ని ఒకే సమయంలో పొందుతారు
C. వికాసం అనేది ఒక చక్కని ముందుగా ఊహించిన జన్యు కారకాల క్రమంలో జరుగుతుంది
D. వికాసం సరళమైనది మరియు ఏకమితిని కలిగి ఉంటుంది.

235. ఈ క్రింది వాటిలో ఉద్వేగ వికాసానికి సంబంధించనిది
A. ఉద్వేగ కేథార్సిస్
B. నాయకారాధన
C. అహంకేంద్రీకృతం
D. ఉద్వేగ అస్థిరత

236. ఈ క్రింది వాటిలో సాంఘిక వికాసానికి సంబంధించనిది
A. పాత్ర గుర్తింపు
B. ముఠా ప్రవర్తన
C. గ్యాంగ్ దశ
D. జ్ఞాన దంతం రావడం

237. ఉద్వేగాలు, తీవ్రంగా తరచుగా వచ్చే దశ
A. కౌమార దశ
B. పూర్వ బాల్య దశ
C. ఉత్తర బాల్యదశ
D. శైశవ దశ

238. అహం కేంద్రీకృత స్వభావం కన్పించే దశ
A. పూర్వ బాల్య దశ
B. కౌమార దశ
C. శైశవ దశ
D. ఉత్తర బాల్యదశ

239. సందర్భాన్ని బట్టి నైతికతను అంచనా వేసే దశ
A. శైశవ దశ
B. పూర్వ బాల్యదశ
C. ఉత్తర బాల్యదశ
D. కౌమార దశ

240. ఉద్వేగ కేథార్సిస్ ప్రదర్శించే దశ
A. కౌమార దశ
B. ఉత్తర బాల్యదశ
C. పూర్వబాల్య దశ
D. శైశవ దశ

241. Emovere అనే పదం
A. గ్రీకు
B. లాటిన్
C. రోమన్
D. రష్య

242. భవిష్యత్, వర్తమానం గురించి ఆతురత ఎక్కువగా ఉండే దశ
A. శైశవ దశ
B. ఉత్తర బాల్యదశ
C. కౌమార దశ
D. పూర్వ బాల్యదశ

243. జీవితంలోని అనేక వైఖరులకు, ప్రవర్తనలకు బీజం పడే దశ
A. కౌమార దశ
B. ఉత్తర బాల్యదశ
C. శైశవ దశ
D. పూర్వ బాల్యదశ

244. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది
A. సాంఘిక వికాసం
B. మానసిక వికాసం
C. శారీరక వికాసం
D. ఉద్వేగ వికాసం

245. ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు. కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అంటే జవాబు చెప్పలేడు. ఈ దశ
A. పూర్వ ప్రచాలక
B. ఇంద్రియ చాలక
C. అమూర్త
D. మూర్త ప్రచాలక దశ

246. రంగారావుకు కాలేజీ మాని సినిమాకు వెళ్లాలని ఉన్నా పెద్దవాళ్లు చూస్తే తిడతారని అలా చేయటం లేదు. కోల్బర్గ్ ప్రకారం రంగారావు నైతిక వికాసం దేనికి చెందుతుంది.
A. 1వ స్థాయి – 1వ దశ
B. 1వ స్థాయి – 2వ దశ
C. 2వ స్థాయి – 3వ దశ
D. 2వ స్థాయి – 4వ దశ

247. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి
A. చొరవ మరియు అపరాధం
B. స్వయంప్రతిపత్తి మరియు సందేహాలు
C. పాత్ర గుర్తింపు మరియు సందిగ్ధం
D. శ్రమించడం మరియు న్యూనత

248. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ‘ఆత్మభావన’ ప్రారంభం అయ్యేదశ
A. యవ్వనారంభ దశ
B. ఉత్తర బాల్యదశ
C. పూర్వ బాల్యదశ
D. పూర్వ కౌమార దశ

249. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్ళతో వస్తువును పట్టుకోగల్గుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం
A. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది
B. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
C. అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది
D. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి.

250. ఒక పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ
A. వ్యవస్థీకరణ
B. సాంశీకరణం
C. అనుగుణ్యం
D. సమతుల్యత

251. నోమ్చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం
A. సార్వత్రిక అభ్యసన విభాగం
B. సార్వత్రిక భాషా విభాగం
C. సార్వత్రిక శాస్త్రీయ విభాగం
D. సార్వత్రిక సామ్యవాద విభాగం

252. వ్యక్తి ‘విశ్వసనీయత’ అనే సద్గుణాన్ని సాధించుకొనే మనో సాంఘిక క్లిష్టపరిస్థితి
A. స్వయంప్రతిపత్తి మరియు సందేహం
B. సమగ్రత మరియు నిరాశ
C. చొరవ మరియు అవరోధం
D. పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం

253. వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి, వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ
A. పూర్వ ప్రచాలక దశ
B. మూర్త ప్రచాలక దశ
C. ఇంద్రియ చాలక దశ
D. అమూర్త ప్రచాలక దశ

254. అధికారి శిక్షిస్తాడని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడటం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసంలో
A. 6వ దశ
B. 2వ దశ
C. 4వ దశ
D. 3వ దశ

255. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి
A. నమ్మకం మరియు అపనమ్మకం
B. సాన్నిహిత్యం మరియు ఏకాంతం
C. శ్రమించడం మరియు న్యూనత
D. స్వయంప్రతిపత్తి మరియు సందేహం

256. పియాజే ప్రకారం నియత ప్రచాలక దశలో పిల్లలు (C TET 2021 January)
A. పిల్లలు ప్రకల్పనాత్మక నిగమన వివేచనాన్ని కలిగి ఉంటారు
B. అవిపర్యాత్మక ఆలోచనలను కలిగి ఉంటారు
C. పదిలపరచుకోవటం వర్గీకరించడం, క్రమీకరించడం వంటివి చేయలేరు
D. తయారు చెయ్యి- నమ్ము మరియు ప్రతీకాత్మక క్రీడలలో (make-believe and symbolic play) నిగమ్యమవటం ప్రారంభిస్తారు.

257. ఈ క్రింది వాటిలో కోల్బర్గ్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి చెందినది
A. పూర్వ ప్రచాలక దశ
B. మూర్త ప్రచాలక దశ
C. పూర్వ సంప్రదాయ నైతికత
D. ఉద్వేగ ప్రజ్ఞ

258. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో పేర్కొనని అంశం
A. స్కీమా
B. వస్తు శాశ్వతత్వ భావన
C. సాంశీకరణ
D. మంచి బాలుని నీతి

259. పియాజే ప్రకారం ప్రకల్పనాత్మక నిగమనాత్మక వివేచనం ఏర్పడే దశ (2019 డిసెంబర్)
A. పూర్వ ప్రచాలక దశ
B. ఇంద్రియ చాలక దశ
C. మూర్త ప్రచాలక దశ
D. నియత ప్రచాలక దశ

260. వ్యక్తి కేంద్రిత విధానాన్ని ప్రతిపాదించినది
A. ఎరిక్సన్
B. కార్ల్ రోజర్స్
C. ఫ్రాయిడ్
D. కేటెల్

సమాధానాలు

201-4     202-4     203-1     204-4     205-2     206-1     207-3      208-3     209-2      210-1
211-3     212-1     213-2     214-4     215-3     216-4     217-1      218-3     219-3      220-3
221-1     222-1     223-4     224-3     225-3     226-2     227-1      228-3     229-4      230-2
231-3     232-4     233-4     234-1     235-3     236-4     237-1      238-1     239-3      240-2
241-2     242-3     243-3     244-3     245-4     246-2     247-4      248-3     249-1      250-1
251-2     252-4     253-2     254-1     255-4     256-1     257-3      258-4     259-4      260-2

Leave a Comment