AP TET 2026 Notification: ఏపీ టెట్ జూన్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు, ముఖ్యమైన తేదీలు ఇవే!

AP TET 2026 Notification:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ‘ఏపీ టెట్ జూన్ 2026’ (AP TET-JUNE-2026) నోటిఫికేషన్‌ను ఈరోజు (జూన్ 5, 2026) విడుదల చేసింది. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే అభ్యర్థుల కోసం ఈ అర్హత పరీక్షను ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ – CBT) విధానంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

ముఖ్యమైన తేదీలు (Important Dates)

నోటిఫికేషన్ విడుదల తేదీ: 05-06-2026.

ఫీజు చెల్లింపు తేదీలు: 05-06-2026 నుండి 05-07-2026 వరకు.

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ: 05-06-2026 నుండి 05-07-2026 వరకు.

ఆన్‌లైన్ మాక్ టెస్ట్: 15-07-2026 నుండి అందుబాటులో ఉంటుంది.

హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: 25-07-2026 నుండి ప్రారంభం అవుతుంది.

పరీక్షల తేదీలు: 05-08-2026 నుండి 21-08-2026 వరకు జరుగుతాయి.

ప్రాథమిక ‘కీ’ (Initial Key) విడుదల: 24-08-2026.

‘కీ’ పై అభ్యంతరాల స్వీకరణ: 25-08-2026 నుండి 31-08-2026 వరకు.

ఫైనల్ ‘కీ’ విడుదల: 08-09-2026.

తుది ఫలితాల ప్రకటన: 15-09-2026 న విడుదల చేయబడతాయి.

పరీక్ష విధానం మరియు ఫీజు వివరాలు

పరీక్ష సమయం: ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతాయి. సెషన్-I ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.00 వరకు, సెషన్-II మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: పరీక్ష ఫీజును ప్రతి పేపర్‌కు (Paper-1A, Paper-1B, Paper-2A, Paper-2B) రూ. 1000/- గా నిర్ణయించారు.
ఒకవేళ అర్హత ఉన్న అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పేపర్లకు దరఖాస్తు చేయాలనుకుంటే, ప్రతి పేపర్‌కు విడిగా రూ. 1000/- చెల్లించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు ఒకసారి ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అందులో ఎలాంటి మార్పులు (Edit / Modify) చేసుకోవడానికి అవకాశం లేదు. తప్పుగా నమోదు చేసి మళ్ళీ సవరించుకోవాలి అంటే గడువు ముగియకముందే మళ్ళీ రూ. 1000 చెల్లించి కొత్త అప్లికేషన్ పెట్టుకోవాలి.

ఏ పేపర్ ఎవరికి?

  • Paper-1A: 1 నుండి 5వ తరగతి (రెగ్యులర్ స్కూల్స్) బోధించాలనుకునే వారు రాయాలి.
  • Paper-2A: 6 నుండి 8వ తరగతి (రెగ్యులర్ స్కూల్స్) బోధించాలనుకునే వారు రాయాలి.
  • Paper-1B & 2B: స్పెషల్ స్కూల్స్ (Special Schools) లో 1-5 తరగతులకు Paper-1B, 6-8 తరగతులకు Paper-2B రాయాలి.
  • ఉత్తీర్ణత సాధించడానికి కావలసిన మార్కులు (Pass Criteria)
  • ఏపీ టెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహించబడుతుంది. ఏ కేటగిరీకి ఎన్ని మార్కులు రావాలో ఇక్కడ చూడండి:
  • OC / EWS అభ్యర్థులకు: 60% మరియు అంతకంటే ఎక్కువ (అంటే 90 మార్కులు రావాలి).
  • BC అభ్యర్థులకు: 50% మరియు అంతకంటే ఎక్కువ (అంటే 75 మార్కులు రావాలి).
  • SC / ST / PwBD & ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు: 40% మరియు అంతకంటే ఎక్కువ (అంటే 60 మార్కులు రావాలి).
  • అభ్యర్థులకు ముఖ్య గమనికలు
  • DSC వెయిటేజీ: టెట్ పరీక్షలో సాధించిన మార్కులకు రాబోయే టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TRT/DSC) లో 20% వెయిటేజీ
  • ఇవ్వబడుతుంది (మిగిలిన 80% వ్రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది).
  • సర్టిఫికెట్ వ్యాలిడిటీ: ఒకసారి ఏపీ టెట్ లో అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్ జీవితకాలం (Life time) వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
  • అధికారిక వెబ్‌సైట్: నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, పూర్తి సిలబస్ మరియు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం అభ్యర్థులు అధికారిక
  • వెబ్‌సైట్ http://tet2dsc.apcfss.in లేదా http://cse.ap.gov.in ని సందర్శించగలరు.
  • హెల్ప్ డెస్క్: అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే, పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నంబర్లకు (8121947387,
  • 8125046997, 7995649286, 7995789286, 9398810958, 6281704160) కాల్ చేయవచ్చు. ఇవి అన్ని పని దినాల్లో ఉదయం 10:00
  • గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పని చేస్తాయి

apply now

Leave a Comment