AP TET & DSC Biology Important Bits 2026 | 50 Most Important Biology MCQs with Answers in Telugu

AP TET & DSC Biology Important Bits 2026

AP TET, DSC, SGT మరియు SA Biology పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు Biology ఒక స్కోరింగ్ సబ్జెక్ట్. అయితే చాలా మంది అభ్యర్థులు మొత్తం సిలబస్ చదివినా పరీక్షలో వచ్చే ముఖ్యమైన బిట్స్‌పై సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల మార్కులు కోల్పోతున్నారు. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే జీర్ణక్రియ, శ్వాసక్రియ, రక్త ప్రసరణ, పోషకాహారం, హార్మోన్లు, నాడీ వ్యవస్థ మరియు పునరుత్పత్తి వంటి అంశాల నుంచి పదే పదే ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తుంది.

అందుకే ఈ వ్యాసంలో AP TET Biology Important Bits రూపంలో పరీక్షల్లో ఎక్కువగా వచ్చే 85 అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలను అందిస్తున్నాము. ఇవి కేవలం AP TET మాత్రమే కాకుండా DSC, TRT, SGT మరియు ఇతర ఉపాధ్యాయ నియామక పరీక్షలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. మీరు పరీక్షకు ముందు ఈ Biology Important Bits ను ఒకసారి రివిజన్ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదివి మీ ప్రిపరేషన్‌ను మరింత బలపరచుకోండి.

1. మానవుని జీర్ణ వ్యవస్థ యొక్క విధులు వరుసగా

1) జీర్ణక్రియ, అంతర గ్రహణం, శోషణ, మల విసర్జన

2) అంతర గ్రహణం, జీర్ణక్రియ, మలవిసర్జన, శోషణ

3) అంతరగ్రహణం, శోషణ, జీర్ణక్రియ, మలవిసర్జన

4) అంతరగ్రహణం, జీర్ణక్రియ, శోషణ, మలవిసర్జన

2. కేలరీలపరమైన పోషకాహార లోపాన్ని గుర్తించండి.

1) మరాస్మస్

2) క్వాషియార్కర్

3) ఒబేసిటీ

4) ఫోలిక్ ఆసిడ్

3. నియాసిన్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి

1) రేచీకటి

2) బెరిబెరి

3) పెల్లాగ్రా

4) అనీమియా

4. విటమిన్ ‘డి’ : రికెట్స్ :: విటమిన్ ‘సి’ : …

1) గ్లాసిటిస్

2) స్కర్వీ

3) వంధ్యత్వం

4) అనీమియా

5. విటమిన్ ఎ, బి, డి, ఇ ల రసాయన నామములు వరుసగా

1) థయామిన్, రెటినాల్, కాల్సిఫెరాల్, టోకోఫెరాల్

2) రెటినాల్, థయామిన్, టోకోఫెరాల్, కాల్సిఫెరాల్

3) రెటినాల్, థయామిన్, కాల్సిఫెరాల్, టోకోఫెరాల్

4) కాల్సిఫెరాల్, టోకోఫెరాల్, థయామిన్, రెటినాల్

6. తెల్లరక్త కణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణమయ్యే విటమిన్

1) ఫోలిక్ ఆసిడ్

2) బయోటిన్

3) రెటినాల్

4) ఫైలోక్వినోన్

7. అమైనో ఆమ్లాలను ఏర్పరచే జీర్ణక్రియా ఎంజైమ్

1) సుక్రేజ్

2) పెప్టిడేజ్

3) ట్రిప్సిన్

4) అమైలేజ్

8. కాలేయం : పైత్యరసం :: క్లోమం : ……

1) అమైలేజ్, సుక్రేస్

2) ట్రిప్సిన్, సుక్రేస్

3) ట్రిప్సిన్, లైపేజ్

4) లైపేస్, టయలిన్

9. అమీబా వంటి ఏకకణ జీవులలో జీవ పదార్థ చలనం

1) పెరిస్టాల్టిక్

2) ద్రవాభిసరణ

3) బ్రౌనియన్

4) సంవాహనం

10. ద్రవాల కదలిక కోసం సంకోచించే నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న జీవులు

1) నిమాటీ హెల్మింథిస్లు

2) అనెలిడ్లు

3) ప్లాటీ హెల్మింథిస్లు

4) పారాజోవన్లు

11. ఎడినోసిన్ డై ఫాస్ఫేట్ కు ఎక్కువ శక్తి గల ఫాస్ఫేట్ చేర్చి ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ ఏర్పడటానికి జరిగే క్రియ

1) ఫాస్ఫారిలేషన్

2) ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్

3) ఫోటాలసిస్

4) గ్లైకాలిసిస్

12. గ్లూకోజ్ వంటి అణువుల ద్వారా శక్తి విడుదలయ్యే ప్రక్రియ

1) క్షయకరణం

2) ఆక్సీకరణం

3) ఫాస్ఫారిలేషన్

4) ఫాటాలైసిస్

13. ఒక ATP నుంచి విడుదలయ్యే శక్తి

1) 7200 కిలో కాలరీలు

2) 72 కాలరీలు

3) 720 కాలరీలు

4) 7200 కాలరీలు

14. గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడునపుడు పొందే నికరలాభం

1) 2 ATP అణువులు

2) 38 ATP అణువులు

3) 4 ATP అణువులు

4) 36 ATP అణువులు

15. శ్వాసక్రియ, దహన చర్యతో ఈ కింది వాటిలో తేడా చూపిస్తుంది.

1) ఒక్కసారిగా వేడిమి ఉత్పత్తి అవుతుంది

2) అనేక దశలలో వేడిమి ఉత్పత్తి అవుతుంది

3) పదార్థాన్ని మొదట మండించాలి

4) ఆక్సిజన్ మొదటిసారిగా అందివ్వాలి.

16. వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరిపేవి

1) ఈస్ట్ కణాలు

2) కండరాలు

3) టెటనస్ బాక్టీరియాలు

4) మొలకెత్తు విత్తనాలు

17. కణశ్వాసక్రియ జరిగే స్థలం

1) కణ ద్రవ్యం

2) కేంద్రకం

3) హరిత రేణువులు

4) మైటోకాండ్రియాలు

18. శ్వాసక్రియ కింది వాటి సమక్షంలో జరుగుతుంది.

1) తేమ

2) కాంతి

3) సరైన ఉష్ణోగ్రత

4) పత్రహరితం

19. ఒక గదిలో ఫలాలను ఈ ఉష్ణోగ్రత ఉంచినపుడు అవి తొందరగా పక్వానికి వస్తాయి

1) 35° సెం. – 45° సెం.

2) 32° సెం. – 40° సెం.

3) 30° సెం. – 40° సెం.

4) 30° సెం. – 35° సెం.

20. సరైన వాక్యాన్ని గుర్తించండి

1. 1°C ఉష్ణోగ్రత పెంచితే శ్వాసక్రియ రెండురెట్లు పెరుగుతుంది.

2. శ్వాసక్రియ రేటు ఎక్కడ గరిష్టంగా ఉంటుందో దాన్ని అత్యంత అనుకూల ఉష్ణోగ్రత అంటారు

1) 1 సరైనది

2) 2 మాత్రమే సరైనది

3) 1 మరియు 2 సరైనవి

4) 1 మరియు 2 రెండూ సరైనవి కావు

21. మానవ రక్తంలోని కణజాలాల్లో ఎక్కువ సంఖ్యలో ఉండేవి.

1) రక్త ఫలకికలు

2) ఎర్ర రక్త కణాలు

3) తెల్ల రక్త కణాలు

4) గ్లియల్ కణాలు

22. ఎర్ర రక్తకణాల ఉత్పత్తి

1) ల్యూకోపాయిసిస్

2) త్రాంబోపాయిసిస్

3) ఎరిత్రోపాయిసిస్

4) ప్లాస్మోలైసిస్

23. రక్త సేకరణలో ఏ రసాయనం వాడనపుడు రక్తం గడ్డ కట్టగా మిగిలిన ద్రవం

1) ప్లాస్మామాతృక

2) ప్లాస్మా మాత్రమే

3) ప్లాస్మా మరియు సీరం

4) సీరం

24. రక్త అధ్యయనాన్ని ………… అంటారు

1) హెమటాలజీ

2) డెర్మటాలజి

3) కాస్మటాలజి

4) ప్లాస్టటాలజి

25. తెల్లరక్త కణాలలో అతి చిన్న కణాలు

1) న్యూట్రోఫిల్స్

2) లింఫోసైట్స్

3) మోనోసైట్స్

4) ఇస్నోఫిల్

26. మానవుని హృదయం : 4 గదులు :: బొద్దింక : ……………..

1) 11 గదులు

2) 12 గదులు

3) 13 గదులు

4) 14 గదులు

27. వానపాము పృష్ట రక్తనాళంలో రక్తం….

1) ముందు నుంచి వెనుకకు ప్రసరిస్తుంది

2) వెనక నుంచి ముందుకు ప్రసరిస్తుంది

3) మధ్య నుంచి పార్శ్వాలకు ప్రసరిస్తుంది

4) పార్శ్వ భాగం నుంచి మధ్య భాగానికి ప్రసరిస్తుంది

28. వానపాములో ముఖ్య ధమనిగా వ్యవహరించేది

1) ఉదర రక్తనాళం

2) పృష్ట రక్త నాళం

3) పార్శ్వ హృదయం

4) శిరం కోటరం

29. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థగల జీవి

1) పీత

2) నత్త

3) చేప

4) బొద్దింక

30. పక్షాకార కండరాలు గల జీవి

1) కప్ప

2) బొద్దింక

3) చేప

4) నత్త

31. ఎర్ర రక్త కణాలు లేని రక్తంగల జీవి

1) పాము

2) వానపాము

3) కప్ప

4) నెమలి

32. సిరా సరణి దేనికి సంబంధించింది

1) ఊపిరితిత్తులు

2) మెదడు

3) మొప్పలు

4) హృదయం

33. అసంపూర్ణ విభజన చెందిన జఠరిక గల జంతువు

1) కాకి

2) పిల్లి

3) ఒంటె

4) తొండ

34. కప్పలో సిరాసరణి వీటి కలయిక ద్వారా ఏర్పడుతుంది

1) మహాసిరలు

2) మహాధమని

3) జఠరికలు

4) కర్ణికలు

35. మూడు గదుల హృదయం గల జంతువు

1) తొండ

2) కప్ప

3) కాకి

4) కుక్క

36. వర్ణరహిత రక్తం గల జంతువు

1) వానపాము

2) కప్ప

3) నత్త

4) కీటకం

37. మొగాస్కోలెక్స్‌లో హృదయాల సంఖ్య

1) 9 జతలు

2) 8 జతలు

3) 7 జతలు

4) 6 జతలు

38. కింది వాటిలో ఏక వలయ రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి

1) వానపాము

2) బొద్దింక

3) చేప

4) కోతి

39. పూర్తిగా విభజన చెందిన జఠరిక ఉన్న జీవి

1) తొండ

2) చేప

3) మొసలి/క్రొకడైల్

4) పావురం

40. గుండెపోటు సంభవించుటకు ఈ ధమనిలో అడ్డంకులు ఏర్పడతాయి

1) మహాధమని

2) హృదయధమని

3) బృహద్ధమని

4) హృదయ సిర

41. మానవుని గుండెలో అగ్రత్రయ కవాటం ఉండే స్థానం

1) కుడి కర్ణిక – ఎడమ జఠరిక

2) ఎడమ కర్ణిక – కుడి జఠరిక

3) ఎడమ కర్ణిక – ఎడమ జఠరిక

4) కుడి కర్ణిక – కుడి జఠరిక

42. మానవుని గుండెలో మిట్రల్ కవాటం గల గదులు

1) కుడి కర్ణిక – ఎడమ జఠరిక

2) ఎడమ కర్ణిక – ఎడమ జఠరిక

3) కుడి కర్ణిక – కుడి జఠరిక

4) ఎడమ కర్ణిక – కుడి జఠరిక

43. కర్ణికల్లో …….. జఠరికల్లో …….. జఠరికలు చిన్నవి

1) కుడి, ఎడమ

2) ఎడమ, కుడి

3) కుడి, కుడి

4) ఎడమ, ఎడమ

44. మానవునిలో సామాన్య రక్త పీడనం

1) 80/120

2) 100/120

3) 120/80

4) 120/100

45. దైహిక మహాధమని ప్రారంభం అయ్యే గది

1) కుడి జఠరిక

2) కుడి కర్ణిక

3) ఎడమ కర్ణిక

4) ఎడమ జఠరిక

46. రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడు ప్లాస్మా ప్రోటీనులు

1) గ్లోబ్యులిన్లు

2) ఫైబ్రినోజన్

3) ఆల్బుమిన్లు

4) ప్రోథ్రాంబిన్

47. ప్రతిరక్షకాలు ‘A’, ‘B’ లు రెండూ లేని రక్తవర్గం

1) ‘B’

2) ‘AB’

3) ‘O’

4) ‘A’

48. ప్రతిజనకాలు ‘A’, ‘B’ లు రెండూ లేని రక్త వర్గం

1) ‘O’

2) ‘A’

3) ‘B’

4) ‘AB’

49. ఆరోగ్యవంతుడైన వ్యక్తులు రక్తదానం చేయడానికి సూచించదగిన వయస్సు

1) 18-70 సం॥లు

2) 12-60 సం॥లు

3) 18-60 సం॥లు

4) 13-60 సం॥లు

50. రక్త గుచ్చీకరణానికి కారణమైన చర్య

1) ప్లాస్మా – ప్రతిరక్షకం

2) లింఫ్ ద్రవం – ప్రతి జనకం

3) ప్రతిరక్షకం

4) ప్రతిజనకం – ప్రతిరక్షకం

51. శరీరంలో సూక్ష్మ రక్షక భటులని వేటినంటారు

1) ఎరిత్రోసైటులు

2) న్యూట్రోఫిల్స్

3) ఎసిడోఫిల్స్

4) త్రాంబోసైట్స్

52. ఎర్రరక్త కణాల్లో కేంద్రకం కలిగి ఉండే జంతువులు

1) ఒంటె

2) చేపలు

3) ఉభయచర జీవి

4) మానవుడు

53. సరైన వాక్యాన్ని గుర్తించండి

P : పరిసరాలతో కలిగే మార్పులకు ప్రతి జీవి అనుక్రియను చూపుతాయి

Q : ఒక జీవిలో జరిగే అన్నీ పనులు ఒకే సమన్వయంతో ఉండవు

1) P సరైనది

2) P సరైనది కాదు

3) Q సరైనది

4) P సరైనది కాదు, Q సరైనది

54. పేరాథార్మోన్ :: టెటాని :: థైరాక్సిన్ : ………

1) నీటి పునఃశోషణ

2) డయాబెటిస్

3) అధివృక్క గ్రంథి

4) క్రిటినిజమ్

55. ఈ హార్మోను ఉత్పత్తికి అయోడిన్ అవసరం

1) పేరాథార్మోన్

2) వేసోప్రెస్సిన్

3) గ్లూకాగాన్

4) థైరాక్సిన్

56. గ్లూకాగాన్ లోపం వల్ల కలిగే వ్యాధి

1) డయాబెటిస్ మెల్లిటస్

2) డయాబెటిస్ ఇన్సిపిడస్

3) ఎక్సిడెంటల్ డయాబెటిస్

4) హైపోగ్లైసీమియా

57. శరీరంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీనులు, క్రొవ్వుల జీవక్రియను క్రమబద్ధీకరించేది

1) ఇన్సులిన్

2) ప్రొజెస్టిరాన్

3) కార్టిసోల్

4) వాసోప్రెస్సిన్

58. సరైన వాక్యాన్ని గుర్తించండి

R : చాలక నాడులు మస్తిష్కం వల్కల కండరాలు వ్యాకోచిస్తాయి

S : కాళ్ళ చేతులు చాలక నాడుల చర్యల వల్ల కదులుతాయి

1) R సరైనది, S సరైనది కాదు

2) R సరైనది కాదు, S సరైనది

3) R, S లు రెండూ సరైనవి

4) R, S లు రెండూ సరైనవి కావు

59. మెదడులో గ్రేమ్యాటర్ కణాలు ఉన్న భాగం

1) మృద్వి

2) వరాశిక

3) బూడిదరంగు పదార్థం

4) దృఢస్తరి

60. మానవునిలో కపాల, వెన్ను నాడుల జతల సంఖ్య

1) 41

2) 42

3) 43

4) 44

60 ప్రశ్నల ‘ఆన్సర్ కీ’ (Answer Key)

1-4, 2-1, 3-3, 4-2, 5-3, 6-1, 7-2, 8-3, 9-3, 10-2

11-1, 12-2, 13-4, 14-1, 15-2, 16-4, 17-4, 18-3, 19-3, 20-2

21-2, 22-3, 23-4, 24-1, 25-2, 26-3, 27-2, 28-1, 29-4, 30-2

31-2, 32-4, 33-4, 34-1, 35-2, 36-4, 37-2, 38-3, 39-4, 40-2

41-4, 42-2, 43-1, 44-3, 45-4, 46-3, 47-2, 48-1, 49-3, 50-4

51-2, 52-1, 53-1, 54-4, 55-4, 56-1, 57-3, 58-2, 59-3, 60-3

Leave a Comment