TET DSC Biology 500 Repeated Questions & Answers
500 Most Important Bits
AP & TG TET, DSC అభ్యర్థుల కోసం 500 అత్యంత ముఖ్యమైన Biology Questions & Answers. Repeated Questions, Expected MCQs, Practice Bits మరియు పూర్తి బయాలజీ ప్రిపరేషన్ మెటీరియల్ తెలుగు లో పొందండి.
జీవశాస్త్ర పరిచయం, వర్గీకరణ మరియు కణశాస్త్ర
1. జీవశాస్త్ర మరియు జంతుశాస్త్ర పితామహుడు – అరిస్టాటిల్.
2. వృక్షశాస్త్ర పితామహుడు – థియోఫ్రాస్టస్.
3. ద్విపద నామకరణం (Binomial nomenclature) ప్రతిపాదించింది
– కరోలస్ లిన్నేయస్.
4. ‘సిస్టమా నేచురే’ (Systema Naturae) గ్రంథ రచయిత – లిన్నేయస్.
5. జాతి (Species) అనే పదాన్ని మొట్టమొదట ప్రతిపాదించింది – జాన్ రే.
6. ఐదు రాజ్యాల వర్గీకరణను చేసింది – R.H. విట్టేకర్ (1969).
7. వైరస్ పదాన్ని ప్రవేశపెట్టింది – పాశ్చర్, D.J. ఇవనోవ్స్కీ.
8. వైరస్‌లను స్ఫటికీకరించింది (Crystallization) – W.M. స్టాన్లీ.
9. విరాయిడ్లను (Viroids) కనుగొన్నది – T.O. డైనర్ (1971).
10. బాక్టీరియాను కనుగొన్నది – ఆంటోనీ వాన్ లీవెన్ హుక్.
11. కణాన్ని కనుగొన్నది – రాబర్ట్ హుక్ (1665).
12. కణకేంద్రకాన్ని (Nucleus) కనుగొన్నది – రాబర్ట్ బ్రౌన్ (1831).
13. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది – ష్లీడన్ (వృక్షశాస్త్రవేత్త) మరియు ష్వాన్. (జంతుశాస్త్రవేత్త).
14. ప్రొటీన్ సంశ్లేషణ కేంద్రాలు (Protein factories) – రైబోజోములు.
15. కణ శక్త్యాగారాలు (Powerhouses of the cell) – మైటోకాండ్రియాలు.
16. కణ ఆత్మహత్య కోశాలు (Suicidal bags) – లైసోజోములు.
17. కణ మేధస్సు లేదా కణ నియంత్రణ కేంద్రం – కణకేంద్రకం.
18. కణ కవచం (Cell wall) కేవలం వేటిలో మాత్రమే ఉంటుంది? – వృక్ష కణాల్లో.
19. వృక్ష కణకవచం దేనితో నిర్మితమవుతుంది? – సెల్యులోజ్.
20. శిలీంధ్రాల (Fungi) కణకవచం దేనితో నిర్మితమవుతుంది? – కైటిన్ (Chitin).
21. ఆకుపచ్చని ప్లాస్టిడ్లను ఏమంటారు? – హరితరేణువులు (క్లోరోప్లాస్ట్లు).
22. ప్లాస్టిడ్లు కేవలం ఏ కణాలలో ఉంటాయి? – వృక్ష కణాలలో.
23. కిరణజన్య సంయోగక్రియ (Photosynthesis) జరిగే ప్రదేశం – హరితరేణువు.
24. ఒక కణంలో ఉండే అతిచిన్న కణాంగం – రైబోజోమ్.
25. కణవిభజనకు (Cell division) తోడ్పడే కణాంగం
– సెంట్రోజోమ్ (జంతు కణాలలో).
26. కణవిభజన దశలు – G1, S, G2, M దశలు.
27. DNA ప్రతికృతి (Replication) జరిగే కణచక్ర దశ – S దశ (Synthesis phase).
28. సమవిభజన (Mitosis) జరిగే కణాలు – శారీరక కణాలు (Somatic cells).
29. క్షయకరణ విభజన (Meiosis) జరిగే కణాలు
– ప్రత్యుత్పత్తి కణాలు (Germ cells).
30. క్రాసింగ్ ఓవర్ (Crossing over) జరిగే దశ – ప్రొఫేజ్-I లోని పాకిటీన్ దశ.
31. వృక్ష కణాల్లో జీవ పదార్థం (Protoplasm) అనే పదాన్ని ప్రవేశపెట్టింది – పుర్కింజే.
32. శైవలాల అధ్యయనం – ఫైకాలజీ.
33. శిలీంధ్రాల అధ్యయనం – మైకాలజీ.
34. లైకెన్లు వేటి కలయిక వల్ల ఏర్పడతాయి? – శైవలాలు మరియు శిలీంధ్రాలు. (సహజీవనం).
35. వాయు కాలుష్య సూచికలుగా (ముఖ్యంగా SO2) పనిచేసేవి – లైకెన్లు.
36. వృక్ష రాజ్యంలో ఉభయచరాలు (Amphibians of Plant Kingdom) – బ్రయోఫైట్లు.
37. ప్రసరణ కణజాలం (దారువు, పోషక కణజాలం) గల మొట్టమొదటి నేల మొక్కలు – టెరిడోఫైట్లు.
38. నగ్న విత్తనాలు గల మొక్కలు – వివృతబీజాలు (Gymnosperms).
39. ఫలాలతో కప్పబడిన విత్తనాలు గల మొక్కలు – ఆవృతబీజాలు (Angiosperms).
40. అతి పెద్ద పుష్పం – రఫ్లీషియా.
41. అతి చిన్న పుష్పం – ఉల్ఫియా.
42. పండ్ల (ఫలాల) అధ్యయనం – పోమాలజీ.
43. పుష్పాల అధ్యయనం – ఆంథాలజీ.
44. వేరు రూపాంతరాలకు ఉదాహరణలు – క్యారెట్, ముల్లంగి, బీట్ రూట్.
45. కాండం రూపాంతరాలకు ఉదాహరణలు – బంగాళాదుంప, పసుపు, అల్లం, ఉల్లి.
46. పత్రం రూపాంతరాలకు ఉదాహరణలు – బఠానీ (నులితీగలు), కలబంద, కాక్టస్ (కంటకాలు).
47. నత్రజని స్థాపన చేసే వేరు బుడిపెలు ఉండే మొక్కల కుటుంబం
– ఫాబేసి (లెగ్యుమినేసి).
48. పాలను పెరుగుగా మార్చే బాక్టీరియా – లాక్టోబాసిల్లస్.
49. పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ ను కనుగొన్నది – అలెగ్జాండర్ ఫ్లెమింగ్.
50. భూమి మీద అత్యధికంగా ఉండే ఎంజైమ్ – రుబిస్కో (RuBisCO).
జంతు సామ్రాజ్యం మరియు శరీర ధర్మశాస్త్రం
51. జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం – ఆర్ధ్రోపోడా (కీటకాలు మొదలైనవి).
52. జంతు రాజ్యంలో రెండవ అతిపెద్ద వర్గం – మొలస్కా.
53. దేహంపై రంధ్రాలు కలిగిన జంతువులు – పొరిఫెరా (స్పంజికలు).
54. దంశకణాలు (Cnidoblasts) కలిగిన వర్గం – నిడేరియా (సీలెంటిరేటా).
55. బల్లపరుపు పురుగులు (Flatworms) అని వేటిని అంటారు? – ప్లాటీహెల్మింథిస్.
56. గుండ్రటి పురుగులు (Roundworms) అని వేటిని అంటారు? – నిమాటిహెల్మింథిస్.
57. దేహం ఖండితాలుగా (Segments) విభజించబడిన జంతువులు?
– అనెలిడా (ఉదా: వానపాము).
58. వానపాము విసర్జక అవయవాలు – నెఫ్రీడియాలు.
59. కీటకాల అధ్యయనం – ఎంటమాలజీ.
60. కీటకాల విసర్జక అవయవాలు – మాల్ఫీజియన్ నాళికలు.
61. సాలీడు శ్వాస అవయవాలు – పుస్తకాకార ఊపిరితిత్తులు (Book lungs).
62. రక్తం లేని శ్వాసక్రియ జరిపే జీవి – హైడ్రా.
63. బొద్దింక (Periplaneta americana) హృదయంలోని గదుల సంఖ్య – 13.
64. ముత్యాలను ఉత్పత్తి చేసే జీవులు ఏ వర్గానికి చెందుతాయి? – మొలస్కా.
65. జల ప్రసరణ వ్యవస్థ (Water vascular system) గల వర్గం – ఇఖైనోడెర్మేటా (ఉదా: స్టార్ ఫిష్).
66. నోటోకార్డ్ (పృష్టవంశం) గల జీవుల వర్గం – కార్డేటా.
67. చేపల అధ్యయనం – ఇక్తియాలజీ.
68. ఉభయచరాల (Amphibians) అధ్యయనం – బట్రకాలజీ.
69. సరీసృపాల (Reptiles) అధ్యయనం – హెర్పటాలజీ.
70. పక్షుల అధ్యయనం – ఆర్నిథాలజీ.
71. క్షీరదాల (Mammals) అధ్యయనం – మమ్మాలజీ.
72. చేపల హృదయంలోని గదుల సంఖ్య – 2.
73. ఉభయచరాల హృదయంలోని గదుల సంఖ్య – 3.
74. సరీసృపాల హృదయంలో గదులు – 3 (మినహాయింపు: మొసలిలో 4).
75. పక్షులు, క్షీరదాల హృదయంలో గదుల సంఖ్య – 4.
76. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి – కాలేయం (Liver).
77. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం – చర్మం.
78. ఎముకల అధ్యయనం – ఆస్టియాలజీ.
79. మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య – 206 (శిశువుల్లో సుమారు 300).
80. మానవ శరీరంలో అతి పొడవైన ఎముక – ఫీమర్ (తొడ ఎముక).
81. మానవ శరీరంలో అతి చిన్న ఎముక – స్టేపిస్ (మధ్య చెవిలో ఉంటుంది).
82. కండరాల అధ్యయనం – మయాలజీ.
83. మానవ శరీరంలో అతి బలమైన కండరం – మాసెటర్ (దవడ కండరం).
84. దంతాల అధ్యయనం – ఒడెంటాలజీ.
85. మానవ దంత విన్యాసం (Dental formula)
– 2123/2123 (మొత్తం 32 దంతాలు).
86. పిండి పదార్థాల (Carbohydrates) జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? – నోరు.
87. ప్రొటీన్ల జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? – జీర్ణాశయం (Stomach).
88. జీర్ణక్రియ సంపూర్ణంగా పూర్తయ్యే ప్రదేశం – చిన్నప్రేగు.
89. పిత్తరసం (Bile juice) ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? – కాలేయం.
90. ఉత్పత్తి అయిన పిత్తరసం ఎక్కడ నిల్వ ఉంటుంది?
– పిత్తాశయం (Gall bladder).
91. రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నది – విలియం హార్వే.
92. రక్త వర్గాలను (Blood groups) కనుగొన్నది – కార్ల్ లాండ్ స్టీనర్.
93. ఎర్ర రక్త కణాల జీవిత కాలం – 120 రోజులు.
94. తెల్ల రక్త కణాల జీవిత కాలం – 12-13 రోజులు.
95. ఎర్ర రక్త కణాల శ్మశానవాటిక (Graveyard of RBC) – ప్లీహం (Spleen).
96. విశ్వ దాత (Universal Donor) రక్త వర్గం – O గ్రూపు.
97. విశ్వ గ్రహీత (Universal Recipient) రక్త వర్గం – AB గ్రూపు.
98. ఆరోగ్యవంతమైన మానవుని సాధారణ రక్త పీడనం (BP)
– 120/80 mm Hg.
99. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ – విటమిన్ K.
100. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే ఖనిజం – క్యాల్షియం.
నాడీ వ్యవస్థ, జన్యుశాస్త్రం మరియు వృక్ష ధర్మశాస్త్రం
101. మూత్రపిండాల అధ్యయనం – నెఫ్రాలజీ.
102. మూత్రపిండాల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు – నెఫ్రాన్లు.
103. మెదడు మరియు నాడుల అధ్యయనం – న్యూరాలజీ / ఫ్రినాలజీ.
104. నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక ప్రమాణాలు – నాడీ కణాలు (న్యూరాన్లు).
105. మానవ శరీరంలో అతి పొడవైన కణం – నాడీ కణం.
106. మెదడును కప్పి ఉంచే పొరలను ఏమంటారు? – మెనింజెస్ (Meninges).
107. ఆలోచనలు, తెలివితేటలు, జ్ఞాపకశక్తికి కేంద్రం – మస్తిష్కం (Cerebrum).
108. దేహ సమతాస్థితిని (Body Balance) నియంత్రించే మెదడు భాగం – అనుమస్తిష్కం (Cerebellum).
109. శ్వాసక్రియ, హృదయ స్పందన వంటి అనియంత్రిత చర్యలను నియంత్రించేది – మజ్జాముఖం (Medulla Oblongata).
110. కంటి అధ్యయనం – ఆప్తమాలజీ.
111. కంటిలో ప్రతిబింబం ఏర్పడే ప్రదేశం – రెటీనా.
112. నేత్రదానంలో (Eye donation) దానం చేసే కంటి భాగం – కార్నియా.
113. వర్ణ అంధత్వం (Color blindness) ఉన్నవారు గుర్తించలేని రంగులు – ఎరుపు, ఆకుపచ్చ.
114. చెవికి ధ్వనిని గ్రహించే సామర్థ్యం (శ్రవ్య అవధి) – 20 Hz నుండి 20,000 Hz.
115. మాస్టర్ గ్లాండ్ (మాస్టర్ గ్రంథి) అని దేనిని అంటారు?
– పీయూష గ్రంథి (Pituitary gland).
116. పీయూష గ్రంథిని నియంత్రించే మెదడు భాగం – హైపోథాలమస్.
117. అత్యవసర హార్మోన్ (Emergency/Fight or Flight hormone) – అడ్రినలిన్.
118. జీవ గడియారం (Biological clock) గా పనిచేసే గ్రంథి – పీనియల్ గ్రంథి.
119. రక్తం మరియు మూత్రంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హార్మోన్ – ఇన్సులిన్.
120. ఇన్సులిన్ ను స్రవించే గ్రంథి
– క్లోమం (Pancreas – ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హాన్స్).
121. DNA ద్వికుండలి నిర్మాణాన్ని (Double helix) కనుగొన్నది
– వాట్సన్ మరియు క్రిక్.
122. జెనెటిక్స్ (జన్యుశాస్త్రం) పితామహుడు – గ్రెగర్ జోహన్ మెండల్.
123. మెండల్ తన ప్రయోగాలకు ఎంచుకున్న మొక్క
– బఠానీ (Pisum sativum).
124. ఉత్పరివర్తనలు (Mutations) సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది – హ్యూగో డీ వ్రిస్.
125. మానవుని క్రోమోజోముల సంఖ్య – 46 (23 జతలు).
126. మానవునిలో ఆటోజోములు (శారీరక క్రోమోజోములు) – 22 జతలు.
127. మానవునిలో అల్లోజోములు (లైంగిక క్రోమోజోములు)
– 1 జత (స్త్రీలలో XX, పురుషులలో XY).
128. డౌన్ సిండ్రోమ్ (Down Syndrome) కు కారణం
– 21వ క్రోమోజోమ్ ట్రైసోమి.
129. టర్నర్ సిండ్రోమ్ (Turner Syndrome) క్రోమోజోమ్ అమెరిక – 44 + XO (45).
130. క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ (Klinefelter Syndrome) అమెరిక – 44 + XXY (47).
131. పుష్పించే మొక్కలలో జరిగే ఫలదీకరణ- ద్విఫలదీకరణ (Double fertilization).
132. ఫలదీకరణ జరగకుండానే ఫలాలు ఏర్పడటాన్ని ఏమంటారు?
– అనిషేక ఫలనం (Parthenocarpy).
133. మొక్కలలో నీటి రవాణాకు తోడ్పడే కణజాలం – దారువు (Xylem).
134. మొక్కలలో ఆహార పదార్థాల రవాణాకు తోడ్పడే కణజాలం- పోషక కణజాలం (Phloem).
135. కిరణజన్య సంయోగక్రియలో వెలువడే ఆక్సిజన్ దేని నుండి వస్తుంది? – నీరు (H2O).
136. వరి, గోధుమ లాంటి మొక్కలు ఏ రకానికి చెందుతాయి? – C3 మొక్కలు.
137. మొక్కజొన్న, చెరకు లాంటి మొక్కలు ఏ రకానికి చెందుతాయి? – C4 మొక్కలు.
138. గ్లైకాలసిస్ (Glycolysis) ఆవిష్కర్తలు – అబ్డెన్, మేయర్ హాఫ్, పర్నాస్ (EMP పదం).
139. క్రెబ్స్ వలయం (Krebs cycle) ఎక్కడ జరుగుతుంది? – మైటోకాండ్రియా మాత్రికలో.
140. కిణ్వనం (Fermentation) పై ప్రయోగాలు చేసింది – లూయీ పాశ్చర్.
141. మొక్కల పెరుగుదలను కొలిచే సాధనం – క్రెస్కోగ్రాఫ్ (కనుగొన్నది J.C. బోస్).
142. మొక్కల్లో అగ్రకోరక ఆధిక్యతను (Apical dominance) కలుగజేసే హార్మోన్లు – ఆక్సిన్లు.
143. విత్తనాల సుప్తావస్థను (Seed dormancy) పోగొట్టేవి – జిబ్బరెల్లిన్లు.
144. కణవిభజనను ప్రేరేపించే వృక్ష హార్మోన్లు – సైటోకైనిన్లు.
145. పండ్లను పండించడానికి ఉపయోగించే వాయు రూప హార్మోన్ – ఇథిలీన్ (Ethylene).
146. వృక్ష స్ట్రెస్ హార్మోన్ (ఆకులు రాలడాన్ని ప్రేరేపించేది) – అబ్సిసిక్ ఆమ్లం (ABA).
147. పాలలో ఉండే చక్కెర – లాక్టోస్.
148. రక్తంలోని చక్కెర – గ్లూకోజ్.
149. పండ్లలో ఉండే చక్కెర – ఫ్రక్టోజ్ (ఇది అత్యంత తీయనైన సహజ చక్కెర).
150. టేబుల్ షుగర్ మరియు చెరకులో ఉండే చక్కెర – సుక్రోజ్.
వ్యాధులు, పర్యావరణం మరియు రసాయనాలు
151. వ్యాధి నిరోధక శాస్త్ర పితామహుడు (Father of Immunology) – ఎడ్వర్డ్ జెన్నర్.
152. మశూచి (Smallpox) కి టీకా కనుగొన్నది – ఎడ్వర్డ్ జెన్నర్.
153. పోలియో (Polio) వ్యాక్సిన్ కనుగొన్నది – జోనాస్ సాల్క్.
154. రేబిస్ వ్యాక్సిన్ (కుక్క కాటు మందు) కనుగొన్నది – లూయీ పాశ్చర్.
155. మలేరియా వ్యాధికి కారణం – ప్లాస్మోడియం (ఒక ప్రోటోజోవా పరాన్నజీవి).
156. మలేరియాను వ్యాప్తి చేసే వాహకం – ఆడ అనాఫిలిస్ దోమ.
157. డెంగ్యూ (Dengue) వ్యాధిని వ్యాప్తి చేసే దోమ – ఏడిస్ ఈజిప్టి (Aedes aegypti).
158. టైఫాయిడ్ వ్యాధిని నిర్ధారించే పరీక్ష – వైడల్ టెస్ట్ (Widal Test).
159. AIDS వ్యాధిని నిర్ధారించే పరీక్షలు – ELISA మరియు వెస్ట్రన్ బ్లాట్.
160. క్షయ (TB) వ్యాధి నివారణకు ఇచ్చే వ్యాక్సిన్ – BCG (బాసిల్లస్ కాల్మెట్ గురిన్).
161. DPT (ట్రిపుల్ యాంటిజెన్) వ్యాక్సిన్ ఏ వ్యాధులకు ఇస్తారు?
– డిఫ్తీరియా, పెర్టుసిస్ (కోరింత దగ్గు), టెటానస్.
162. అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి – గాయిటర్ (థైరాయిడ్ వాపు).
163. ప్రోటీన్ల లోపం వల్ల చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి – క్వాషియోర్కర్.
164. ప్రోటీన్లు మరియు కేలరీల లోపం వల్ల వచ్చే వ్యాధి – మరాస్మస్.
165. పర్యావరణ దినోత్సవం – జూన్ 5.
166. ప్రపంచ జనాభా దినోత్సవం – జులై 11.
167. ఓజోన్ పొర రక్షణ దినోత్సవం – సెప్టెంబర్ 16.
168. ప్రపంచ AIDS దినోత్సవం – డిసెంబర్ 1.
169. వన్యప్రాణుల సంరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం – 1972.
170. నీటి కాలుష్య నివారణ చట్టం – 1974.
171. అటవీ సంరక్షణ చట్టం – 1980.
172. వాయు కాలుష్య నివారణ చట్టం – 1981.
173. పర్యావరణ పరిరక్షణ చట్టం (Environmental Protection Act) – 1986.
174. గ్రీన్ హౌస్ ప్రభావానికి (గ్లోబల్ వార్మింగ్) ప్రధాన కారణమైన వాయువు – కార్బన్ డయాక్సైడ్ (CO2).
175. ఆమ్ల వర్షాలకు (Acid rains) కారణమయ్యే వాయువుల
– సల్ఫర్ డయాక్సైడ్ (SO2), నైట్రోజన్ డయాక్సైడ్ (NO2).
176. ఓజోన్ పొరను దెబ్బతీసే ప్రధాన రసాయనాలు – CFCs (క్లోరో ఫ్లోరో కార్బన్లు).
177. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో (1984) వెలువడిన విష వాయువు
– మిథైల్ ఐసో సయనేట్ (MIC).
178. అడవుల సంరక్షణకు సంబంధించిన ఉద్యమం – చిప్కో ఉద్యమం (సుందర్ లాల్ బహుగుణ).
179. వానపాము ద్వారా తయారయ్యే సేంద్రియ ఎరువు – వర్మీ కంపోస్ట్.
180. తేనెటీగల పెంపకం – ఎపికల్చర్ (Apiculture).
181. పట్టుపురుగుల పెంపకం – సెరికల్చర్ (Sericulture).
182. చేపల పెంపకం – పిసికల్చర్ (Pisciculture).
183. కండరాల అలసటకు (Muscle fatigue) కారణమయ్యే ఆమ్లం – లాక్టిక్ ఆమ్లం.
184. నిమ్మ, నారింజలలో ఉండే ఆమ్లం – సిట్రిక్ ఆమ్లం.
185. చింతపండు, ద్రాక్షలో ఉండే ఆమ్లం – టార్టారిక్ ఆమ్లం.
186. చీమలు, తేనెటీగలు కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లం – ఫార్మిక్ ఆమ్లం.
187. టమాటాలో ఉండే ఆమ్లం – ఆక్సాలిక్ ఆమ్లం.
188. ఆపిల్ లో ఉండే ఆమ్లం – మాలిక్ ఆమ్లం.
189. మానవుని జీర్ణాశయంలోని జఠర రసం (Gastric juice) లో ఉండే ఆమ్లం – హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl).
190. మానవుని లాలాజలం (Saliva) pH విలువ – సుమారు 6.8.
191. మానవుని రక్తం pH విలువ – 7.4 (కొద్దిగా క్షార స్వభావం).
192. మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణద్రవ్యం – యూరోక్రోమ్.
193. మానవ చర్మానికి మరియు జుట్టుకు రంగును ఇచ్చే వర్ణద్రవ్యం – మెలనిన్.
194. మొక్కల పచ్చదనానికి కారణమైన వర్ణద్రవ్యం – క్లోరోఫిల్.
195. క్లోరోఫిల్ (పత్రహరితం) లో ఉండే లోహ మూలకం – మెగ్నీషియం (Mg).
196. రక్తంలోని హీమోగ్లోబిన్ లో ఉండే లోహ మూలకం – ఇనుము (Fe).
197. విటమిన్ B12 (సైనకోబాలమిన్) లో ఉండే మూలకం – కోబాల్ట్ (Co).
198. ఇన్సులిన్ హార్మోన్ లో ఉండే మూలకం – జింక్ (Zn).
199. సముద్ర గర్భంలో నేలపై నివసించే జీవులను ఏమంటారు? – బెంథాస్ (Benthos).
200. ద్రావణాల గాఢతను బట్టి కణజాలం ముడుచుకుపోవడాన్ని (Shrinkage) ఏమంటారు? – ప్లాస్మోలైసిస్ (కణద్రవ్య సంకోచం).
వృక్ష బాహ్య స్వరూప శాస్త్రం – అంతర్నిర్మాణం
201. వాయుగత వేర్లు (Epiphytic roots) గల మొక్కకు ఉదాహరణ – వాండా.
202. కిరణజన్య సంయోగక్రియ జరిపే వేర్లు గల మొక్కలు – టీనియోఫిల్లం, ట్రాపా.
203. శ్వాస వేర్లు (Pneumatophores) ఏ మొక్కలలో కనిపిస్తాయి? – రైజోఫోరా (మడ అడవులు).
204. పరాన్నజీవి వేర్లు (Haustoria) దేనిలో ఉంటాయి? – కస్కుటా, స్ట్రైగా.
205. పుష్పంలోని రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళిని కలిపి ఏమంటారు? – అనావశ్యక అంగాలు.
206. కేసరావళి, అండకోశంలను కలిపి ఏమంటారు? – ఆవశ్యక అంగాలు.
207. ఏకదళబీజ (Monocot) విత్తనాలలో ఉండే ఒకే ఒక బీజదళం పేరు ఏమిటి? – స్కుటెల్లం.
208. మామిడి, కొబ్బరి లలో ఉండే ఫలం ఏ రకానికి చెందినది? – టెంక గల ఫలం (Drupe).
209. ఆపిల్ ఏ రకమైన ఫలానికి ఉదాహరణ? – అనృత ఫలం (False fruit – ఇది పుష్పాసనం నుండి ఏర్పడుతుంది).
210. మొక్కల పొడవు పెరగడానికి కారణమైన కణజాలం – అగ్ర విభాజ్య కణజాలం.
211. వృక్షాల వయస్సును వాటి కాండంలోని ఏ వలయాలను లెక్కించడం ద్వారా తెలుసుకుంటారు? – వార్షిక వలయాలు (Annual rings).
212. వార్షిక వలయాలను అధ్యయనం చేసే శాస్త్రం – డెండ్రోక్రోనాలజీ.
213. ద్విదళబీజ కాండం మందంగా పెరగడాన్ని (ద్వితీయ వృద్ధి) ప్రేరేపించేది – విభాజ్య కణావళి.
214. వృక్షాల బెరడు (Bark) లో వాయు మార్పిడికి తోడ్పడే రంధ్రాలు – లెంటిసెల్స్ (Lenticels).
215. ప్రపంచంలో అతి పెద్ద వృక్షం – సికోయా సెంపర్ విరెన్స్ (కాలిఫోర్నియా రెడ్ వుడ్).
216. అతి చిన్న వివృతబీజ మొక్క – జామియా పిగ్మియా.
217. విత్తనాలు ఏర్పడి, ఫలాలు లేని మొక్కల వర్గం – వివృతబీజాలు. (Gymnosperms).
218. సైకాస్ (Cycas) మొక్కలోని పగడపు వేర్లు (Coralloid roots) ఏ బ్యాక్టీరియాతో సహజీవనం చేస్తాయి? – అనబినా, నాస్టాక్.
219. ఉల్లి, వెల్లుల్లి, కలబంద ఏ కుటుంబానికి చెందినవి? – లిలియేసి.
220. టమాటా, బంగాళదుంప, వంకాయ ఏ కుటుంబానికి చెందినవి? – సొలనేసి.
221. చిక్కుడు, వేరుశెనగ మొక్కల కుటుంబం – ఫాబేసి (లెగ్యుమినేసి).
222. పొద్దుతిరుగుడు (Sunflower) మొక్క కుటుంబం – ఆస్టరేసి (మొక్కలలో అతిపెద్ద కుటుంబం).
223. పసుపు, అల్లం ఏ రకమైన కాండ రూపాంతరాలు? – కొమ్ము (Rhizome / భూగర్భ కాండం).
224. కంద (Amorphophallus) ఏ రకమైన రూపాంతరం? – కందం (Corm).
225. ఒకే కణం కలిగిన శిలీంధ్రానికి (Fungi) ఉదాహరణ – ఈస్ట్ (Saccharomyces).
226. బేకరీలలో రొట్టెల తయారీకి, మద్యం తయారీలో వాడే శిలీంధ్రం – ఈస్ట్.
227. వృక్ష సామ్రాజ్యంలో అతిపెద్ద ఆకులు గల మొక్క – విక్టోరియా అమెజోనికా.
228. అగార్-అగార్ (Agar-Agar) ను ఏ శైవలాల నుండి తయారు చేస్తారు? – ఎర్ర శైవలాలు (జెలీడియం, గ్రాసిలేరియా).
229. ఎర్ర సముద్రం (Red Sea) ఎరుపు రంగుకు కారణమైన శైవలం – ట్రైకోడెస్మియం ఎరిత్రియమ్.
230. అంతరిక్ష ప్రయాణాల్లో వ్యోమగాములు ఆక్సిజన్, ఆహారం కోసం ఉపయోగించే శైవలం – క్లోరెల్లా.
231. నీటిపై తేలే స్వేచ్ఛా శైవలాలను ఏమంటారు? – ఫైటోప్లాంక్టాన్ (వృక్ష ప్లవకాలు).
232. పరాగరేణువుల అధ్యయనాన్ని ఏమంటారు? – పాలిలజీ (Palynology).
233. పరాగరేణువులకు పోషణ నిచ్చే పరాగకోశ గోడ పొర – టేపిటమ్.
234. పరాగరేణువుల బాహ్య కవచం (Exine) అత్యంత కఠినమైన ఏ పదార్థంతో నిర్మితమవుతుంది? – స్పోరోపోలెనిన్.
235. గుల్మాలు, పొదలు, వృక్షాలుగా మొక్కలను మొట్టమొదట వర్గీకరించింది – థియోఫ్రాస్టస్.
236. మొక్కలలో బాక్టీరియా వల్ల వచ్చే వ్యాధికి ఉదాహరణ – సిట్రస్ కాంకర్.
237. వైరస్ ల వల్ల మొక్కలకు వచ్చే వ్యాధికి ఉదాహరణ – పొగాకు మొజాయిక్ వ్యాధి (TMV).
238. శిలీంధ్రాల వల్ల మొక్కలకు వచ్చే వ్యాధికి ఉదాహరణ – గోధుమ కుంకుమ తెగులు (Wheat Rust).
జంతుశాస్త్రం – వర్గీకరణ మరియు కణజాలాలు
239. ద్విపద నామకరణం (Binomial nomenclature) లోని రెండు పదాలు ఏమిటి? – ప్రజాతి (Genus) మరియు జాతి (Species).
240. త్రినామ నామకరణం (Trinomial nomenclature) ను ప్రతిపాదించింది – హక్స్ లీ & స్ట్రిక్ లాండ్.
241. మానవుని శాస్త్రీయ నామం – హోమో సెపియన్స్ (Homo sapiens).
242. మానవుని శాస్త్రీయ నామంలో ‘హోమో’ అనేది దేనిని సూచిస్తుంది? – ప్రజాతి.
243. వర్గీకరణలో అత్యల్ప లేదా ప్రాథమిక స్థాయి – జాతి (Species).
244. జీవశాస్త్ర పరంగా మరణం లేని (Immortal) జీవులు – ఏకకణ జీవులు (ఉదా: అమీబా).
245. ‘జీవజనక సిద్ధాంతం’ (Biogenesis – జీవి నుండే జీవి పుడుతుంది) ప్రతిపాదించిన వారు – లూయీ పాశ్చర్.
246. అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు – మార్సెల్లో మాల్ఫీజీ.
247. జంతు కణజాలాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించారు?
– 4 రకాలు (ఉపకళా, సంయోజక, కండర, నాడీ కణజాలాలు).
248. కణజాల శాస్త్రం (Histology) పితామహుడు – బికాట్ (Bichat).
249. రక్తం ఏ రకమైన కణజాలం? – ద్రవరూప సంయోజక కణజాలం (Fluid connective tissue).
250. ఎముకలను కండరాలతో కలిపే తంతువులు – టెండాన్ (స్నాయుబంధనం).
251. ఒక ఎముకను మరొక ఎముకతో కలిపే తంతువులు – లిగమెంట్ (స్నాయువు).
252. చర్మం కింద కొవ్వును నిల్వ చేసే కణజాలం – ఎడిపోజ్ కణజాలం.
253. చెవి దొప్ప, ముక్కు చివరలో ఉండే మృదువైన ఎముక – మృదులాస్థి (Cartilage).
254. మృదులాస్థి ని ఏర్పరిచే కణాలు – కాండ్రోసైట్లు.
255. ఎముకలను ఏర్పరిచే కణాలు – ఆస్టియోసైట్లు.
256. ఎముకలలో ఉండే ప్రధాన ప్రోటీన్ – ఆస్సిన్ (Ossein).
257. మృదులాస్థిలో ఉండే ప్రోటీన్ – కాండ్రిన్.
258. కండరాలలో ఉండే ప్రధాన ప్రోటీన్లు – ఆక్టిన్, మయోసిన్.
259. అమీబాలో గమనాంగాలు – మిథ్యాపాదాలు (Pseudopodia).
260. పారమీషియం (స్లిప్పర్ యానిమల్క్యూల్) లో గమనాంగాలు – శైలికలు (Cilia).
261. యూగ్లీనాలో గమనాంగాలు – కశాభాలు (Flagella).
262. వృక్ష మరియు జంతు లక్షణాలు రెండూ ఉండే జీవి – యూగ్లీనా.
263. స్పాంజికలలో (Sponges) నీటి ప్రసరణ జరిగే మార్గం – కుల్యా వ్యవస్థ. (Canal system).
264. జెల్లీ ఫిష్ (Jellyfish) ఏ వర్గానికి చెందినది? – నిడేరియా (సీలెంటిరేటా).
265. హైడ్రాలో ప్రత్యుత్పత్తి ఏ పద్ధతిలో జరుగుతుంది? – మొగ్గలు తొడగడం. (Budding).
266. సముద్రంలో పగడాలు (Corals) ఏ వర్గానికి చెందిన జీవుల ద్వారా ఏర్పడతాయి? – నిడేరియా (ఆంథోజోవా).
267. టేప్ వర్మ్ (బద్దెపురుగు) విసర్జక అవయవాలు – జ్వాలా కణాలు (Flame cells).
268. ‘రైతు మిత్రుడు’ అని ఏ జీవిని అంటారు? – వానపాము (ఎర్రవాక).
269. వానపాములో రక్తం ఎరుపు రంగులో ఉండటానికి కారణం – ప్లాస్మాలో కరిగిన హీమోగ్లోబిన్.
270. జలగ (Leech) రక్తం గడ్డకట్టకుండా విడుదల చేసే పదార్థం – హిరుడిన్.
271. కీటకాల దేహం ఎన్ని విభాగాలుగా ఉంటుంది? – 3 (తల, రొమ్ము, ఉదరం).
272. కీటకాల శ్వాస వ్యవస్థ – వాయునాళ వ్యవస్థ (Tracheal system).
273. బొద్దింక రక్తం ఏ రంగులో ఉంటుంది? – తెలుపు (హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి).
274. బొద్దింక రక్త ప్రసరణ వ్యవస్థ ఏ రకమైనది? – వివృత రక్త ప్రసరణ (Open type).
275. వెండి చేప (Silver fish) అనేది ఏ వర్గానికి చెందినది? – ఆర్ధ్రోపోడా (ఇది చేప కాదు, ఒక కీటకం).
276. నక్షత్ర చేప (Starfish), సీ అర్చిన్ ఏ వర్గం? – ఇఖైనోడెర్మేటా.
277. అకశేరుకాలను (Invertebrates), సకశేరుకాలను (Vertebrates) కలిపే వారధి – హెమికార్డేటా (బెలనోగ్లాసస్).
278. ప్రపంచంలో అతిపెద్ద చేప – వేల్ షార్క్ (తిమింగల సొరచేప).
279. మృదులాస్థి (Cartilage) తో ఏర్పడిన అంతరస్థి పంజరం గల చేపలకు ఉదాహరణ – సొరచేప (Shark), స్కేట్స్.
280. ఎముకల (Bony) చేపలకు ఉదాహరణ – రోహు, కట్ల.
281. ఉభయచరాలకు (Amphibians) ఉదాహరణలు – కప్ప, సాలమాండర్.
282. కప్ప డింభకాన్ని (Larva) ఏమంటారు? – టాడ్ పోల్ (Tadpole).
283. పాముల గురించి చదివే శాస్త్రం – ఒఫియాలజీ (Ophiology).
284. విషపూరితమైన పాములలో విష గ్రంథులు వేటి రూపాంతరాలు?
– పెరోటిడ్ లాలాజల గ్రంథులు.
285. పక్షుల పూర్వీకులు అని వేటిని అంటారు? – సరీసృపాలు (Reptiles).
286. ఎగరలేని పక్షులకు ఉదాహరణ – ఆస్ట్రిచ్, కివి, ఈము.
287. ప్రపంచంలో అతిపెద్ద పక్షి – ఆస్ట్రిచ్ (నిప్పుకోడి).
288. ప్రపంచంలో అతి చిన్న పక్షి – హమ్మింగ్ బర్డ్.
289. పక్షులలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే అవయవం – శబ్దిని (Syrinx).
290. భారతదేశ పక్షి శాస్త్ర పితామహుడు – డాక్టర్ సాలిమ్ అలీ.
291. పక్షులలో బరువు తగ్గడానికి ఎముకలు ఏ విధంగా మార్పు చెందాయి? – గాలితో నిండిన ఎముకలు (Pneumatic bones).
292. గుడ్లు పెట్టే క్షీరదాలకు (Monotremes) ఉదాహరణ – ప్లాటిపస్, ఎకిడ్నా.
293. సంచి గల క్షీరదాలు (Marsupials) అని వేటిని అంటారు? – కంగారు.
294. గాలిలో ఎగిరే ఏకైక క్షీరదం – గబ్బిలం (Bat).
295. గబ్బిలాలు రాత్రిపూట చీకటిలో ప్రయాణించడానికి ఉపయోగించే విధానం – ఎకో లొకేషన్ (అతిధ్వనులను ఉపయోగించి).
జీవ అణువులు – కణశాస్త్రం
296. జీవపదార్థంలో (Living matter) అత్యధికంగా ఉండే మూలకం – ఆక్సిజన్.
297. జంతు దేహంలో అత్యధికంగా ఉండే ప్రొటీన్ – కొల్లాజెన్.
298. మొత్తం జీవావరణంలో (Biosphere) అత్యధికంగా ఉండే ప్రొటీన్ – రుబిస్కో (RuBisCO).
299. ఎంజైములు రసాయనికంగా ఏమిటి? – ప్రొటీన్లు.
300. న్యూక్లియిక్ ఆమ్లాలు (DNA, RNA) దేనితో నిర్మితమవుతాయి? – న్యూక్లియోటైడ్లు.
301. DNA లో ఉండే నత్రజని క్షారాలు – అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్.
302. RNA లో థైమిన్ కు బదులుగా ఉండే నత్రజని క్షారం – యురాసిల్.
303. ఒక DNA కుండలి (Helix) పొడవు ఎంత? – 34 ఆంగ్ స్ట్రామ్స్.
304. కణత్వచం (Cell membrane) ప్రధానంగా వేటితో నిర్మితమవుతుంది? – ఫాస్ఫోలిపిడ్లు, ప్రోటీన్లు.
305. కణత్వచ నిర్మాణాన్ని వివరించే ‘ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా’ను ప్రతిపాదించింది – సింగర్ మరియు నికల్సన్.
306. పాలిసోమ్ లేదా పాలీ రైబోజోమ్ అంటే ఏమిటి? – ఒక mRNA పై అనేక రైబోజోములు చేరడం.
307. కణంలో లిపిడ్లు, స్టిరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణ ఎక్కడ జరుగుతుంది? – నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం (SER).
308. కణస్రావాలు (Secretions) మరియు ప్యాకేజింగ్ లో పాల్గొనే కణాంగాలు – గాల్జీ సంక్లిష్టాలు (Golgi complex).
309. కణవిభజనలో ఏర్పడే స్పిండిల్ తంతువులు (కండె తంతువులు) వేటితో. ఏర్పడతాయి? – మైక్రో ట్యూబ్యూల్స్.
310. సెంట్రోమియర్ క్రోమోజోమ్ సరిగ్గా మధ్యలో ఉంటే దానిని ఏమంటారు? – మెటాసెంట్రిక్ క్రోమోజోమ్.
311. సమవిభజనలో (Mitosis) క్రోమోజోములు స్పష్టంగా కనిపించే దశ – మెటాఫేజ్ (మధ్యస్థ దశ).
312. కణవిభజనలో క్రోమోజోముల సంఖ్యను లెక్కించడానికి అనువైన దశ – మెటాఫేజ్.
313. క్రాసింగ్ ఓవర్ వల్ల ఏమి జరుగుతుంది? – జన్యు పునఃసంయోగం (జన్యు వైవిధ్యం).
314. రెండు అమైనో ఆమ్లాల మధ్య ఉండే బంధం – పెప్టైడ్ బంధం.
315. మోనోశాకరైడ్ల (చక్కెరల) మధ్య ఉండే బంధం – గ్లైకోసిడిక్ బంధం.
316. DNA లోని రెండు నత్రజని క్షారాల మధ్య ఉండే బంధం – హైడ్రోజన్ బంధం.
317. జంతువులలో నిల్వ ఉండే ఆహారం – గ్లైకోజన్.
318. మొక్కలలో నిల్వ ఉండే ఆహారం – పిండి పదార్థం (Starch).
319. గ్లూకోజ్ యొక్క రసాయన ఫార్ములా – C6H12O6.
320. భూమిపై అత్యంత సమృద్ధిగా లభించే సేంద్రియ సమ్మేళనం – సెల్యులోజ్.
మానవ శరీర ధర్మశాస్త్రం – ఆరోగ్యశాస్త్రం
321. దంతాల పైన ఉండే పింగాణీ పొర (Enamel) దేనితో నిర్మితమవుతుంది? – కాల్షియం ఫాస్ఫేట్ & కాల్షియం కార్బోనేట్ (ఫ్లోరో అపటైట్).
322. మానవ దేహంలో అత్యంత కఠినమైన పదార్థం – ఎనామిల్.
323. తలలోని మొత్తం ఎముకల సంఖ్య (పుర్రె + ముఖం + చెవి + హైయాయిడ్) – 29 (కేవలం కపాలంలో 8).
324. ముఖంలో ఉండే ఎముకల సంఖ్య – 14.
325. మానవునిలో ప్రక్కటెముకల (Ribs) జతల సంఖ్య – 12 జతలు (మొత్తం 24).
326. వెన్నెముకలో (Vertebral column) వెన్నుపూసల సంఖ్య – 33.
327. మూత్రపిండాల పైన (టోపీ ఆకారంలో) ఉండే అంతఃస్రావక గ్రంథి – అధివృక్క గ్రంథి (Adrenal gland).
328. థైరాయిడ్ గ్రంథి (అవటు గ్రంథి) శరీరంలో ఎక్కడ ఉంటుంది?
– మెడ భాగంలో వాయునాళం పైన.
329. కన్నీటిని స్రవించే గ్రంథులు – లాక్రిమల్ గ్రంథులు.
330. చెమటను స్రవించే చర్మ గ్రంథులు – స్వేద గ్రంథులు.
331. సెబమ్ (నూనె లాంటి పదార్థం) స్రవించే చర్మ గ్రంథులు – సెబేషియస్ గ్రంథులు.
332. స్త్రీలలో క్షీర గ్రంథులు (Mammary glands) వేటి రూపాంతరాలు? – స్వేద గ్రంథులు.
333. కంటిలోని గ్రుడ్డు కదలికలకు సహాయపడే కండరాల సంఖ్య – 6.
334. కంటిలో రంగులను గుర్తించే కణాలు – శంకువులు (Cones).
335. కంటిలో చీకటిలో లేదా తక్కువ కాంతిలో చూడడానికి సహాయపడే కణాలు- దండాలు (Rods).
336. దండాలలో (Rods) ఉండే వర్ణద్రవ్యం – రొడాప్సిన్.
337. విటమిన్ A (రెటినాల్) లోపం వల్ల కంటికి వచ్చే వ్యాధి – జిరాఫ్తాల్మియా. (కన్ను పొడిబారడం).
338. విటమిన్ D (కాల్సిఫెరాల్) లోపం వల్ల పిల్లల్లో ఎముకలు వంగిపోయే వ్యాధి- రికెట్స్.
339. విటమిన్ E (టోకోఫెరాల్) లోపం వల్ల ప్రధానంగా వచ్చే సమస్య – వంధ్యత్వం (సంతానలేమి).
340. గుండె స్పందనను కొలిచే పరికరం – స్టెతస్కోప్ (దీనిని రెనీ లెన్నెక్ కనుగొన్నాడు).
341. రక్త పీడనాన్ని (BP) కొలిచే పరికరం – స్పిగ్మోమానోమీటర్.
342. సాధారణ మానవుని నిమిషానికి గుండె స్పందన రేటు సగటున – 72 సార్లు.
343. శిశువులలో గుండె స్పందన రేటు నిమిషానికి సుమారు ఎంత ఉంటుంది? – 120 నుంచి 140 సార్లు.
344. మానవ హృదయంలో కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్య ఉండే కవాటం – అగ్రత్రయ కవాటం (Tricuspid valve).
345. మానవ హృదయంలో ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక మధ్య ఉండే కవాటం – అగ్రద్వయ లేదా మిట్రల్ కవాటం (Bicuspid valve).
346. శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు తీసుకువచ్చే రక్తనాళాలు – సిరలు (Veins).
347. రక్తాన్ని గుండె నుండి వివిధ భాగాలకు తీసుకువెళ్ళే రక్తనాళాలు – ధమనులు (Arteries).
348. ఆక్సిజన్ లేని చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకువెళ్ళే ఏకైక ధమని – పుపుస ధమని.
349. ఆక్సిజన్ తో కూడిన మంచి రక్తాన్ని గుండెకు తీసుకువచ్చే ఏకైక సిర – పుపుస సిర.
350. మూత్రపిండాలు పని చేయనప్పుడు కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ – డయాలసిస్.
351. మూత్రంలో ఉండే ప్రధాన నత్రజని వ్యర్థ పదార్థం – యూరియా.
352. మూత్రపిండాలలో రాళ్లు (Kidney stones) ఏర్పడటానికి కారణమైన. రసాయనం – కాల్షియం ఆక్సలేట్.
353. పురుషులలో వృషణాల (Testes) నుండి ఉత్పత్తి అయ్యే హార్మోన్ – టెస్టోస్టిరాన్.
354. స్త్రీలలో అండాశయం నుండి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు – ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్.
355. గర్భధారణను (Pregnancy) నిర్వహించే హార్మోన్ – ప్రొజెస్టిరాన్.
356. ప్రసవ సమయంలో గర్భాశయ కండరాల సంకోచానికి సహాయపడే హార్మోన్ – ఆక్సిటోసిన్.
357. మాతృమూర్తులలో పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ – ప్రోలాక్టిన్.
358. కప్ప హృదయంలో ఉండే గదులు – 3 గదులు (రెండు కర్ణికలు, ఒక జఠరిక).
359. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రం – హెమటాలజీ.
360. తెల్ల రక్తకణాలలో పరిమాణంలో అతిపెద్దవి – మోనోసైట్లు (Monocytes).
361. తెల్ల రక్తకణాలలో పరిమాణంలో అతి చిన్నవి – లింఫోసైట్లు.
362. ఎలర్జీ సమయాల్లో మన శరీరంలో పెరిగే రక్తకణాలు – ఇసినోఫిల్స్.
363. ఎయిడ్స్ (HIV) వ్యాధిలో ప్రధానంగా ఏ తెల్ల రక్తకణాలు నాశనమవుతాయి? –
T-లింఫోసైట్లు (CD4 కణాలు).
364. మానవ కాలేయం (Liver) లో ఉండే కణాలు – హెపాటిక్ కణాలు.
365. బిలిరుబిన్, బిలివర్దిన్ అనే వర్ణద్రవ్యాలు దేనిలో ఉంటాయి? – పిత్తరసం (Bile juice).
366. పచ్చకామెర్లు (Jaundice) వ్యాధిలో దెబ్బతినే ప్రధాన అవయవం – కాలేయం.
367. మానవ మెదడు బరువు సుమారు ఎంత ఉంటుంది? – 1350 నుంచి 1400 గ్రాములు.
368. మెదడు మరియు వెన్నుపాము లోపలి భాగం ఏ రంగులో ఉంటుంది? – తెలుపు రంగు (White matter).
369. కేంద్ర నాడీ వ్యవస్థను అఘాతాల నుండి రక్షించే ద్రవం – మస్తిష్క మేరు ద్రవం (CSF).
370. వెన్నుపాము (Spinal cord) దేని కొనసాగింపుగా ఉంటుంది? – మజ్జాముఖం (Medulla oblongata).
371. అసంకల్పిత ప్రతీకార చర్యలను (Reflex actions) తక్షణమే నియంత్రించేది – వెన్నుపాము.
372. కపాల నాడుల (Cranial nerves) సంఖ్య – 12 జతలు.
373. వెన్ను నాడుల (Spinal nerves) సంఖ్య – 31 జతలు.
374. గొంతు వద్ద ఉండే ‘ఆడమ్స్ ఆపిల్’ అని దేనిని అంటారు? – థైరాయిడ్ మృదులాస్థి.
375. ఆహారం వాయునాళంలోకి పోకుండా అడ్డుకునే కవాటం – ఉపజిహ్విక (Epiglottis).
376. ఊపిరితిత్తులను కప్పి ఉంచే పొరలను ఏమంటారు? – ప్లూరా (Pleura).
377. ఊపిరితిత్తులలో వాయు మార్పిడి జరిగే నిర్మాణాలు – వాయుగోణులు (Alveoli).
378. కార్బోహైడ్రేట్లు ఒక గ్రాముకు ఎంత శక్తిని ఇస్తాయి? – 4 కిలో కేలరీలు.
379. ప్రొటీన్లు ఒక గ్రాముకు ఎంత శక్తిని ఇస్తాయి? – 4 కిలో కేలరీలు.
380. కొవ్వులు ఒక గ్రాముకు ఎంత శక్తిని ఇస్తాయి? – 9.45 కిలో కేలరీలు.
381. ఆస్కార్బిక్ ఆమ్లం అని ఏ విటమిన్ కు పేరు? – విటమిన్ సి.
382. ఆహారాన్ని వేడి చేసినప్పుడు సులభంగా నశించిపోయే విటమిన్ – విటమిన్ సి.
383. పెల్లాగ్రా (Pellagra) వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? – విటమిన్ బి3 (నియాసిన్).
384. బెరి-బెరి (Beri-Beri) వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? – విటమిన్ బి1 (థయామిన్).
385. రక్తహీనత (Anemia) ఏ విటమిన్ల లోపం వల్ల కలుగుతుంది? – బి6, బి9. (ఫోలిక్ యాసిడ్), బి12.
386. ఏ మూలకం లోపం వల్ల రక్తహీనత (Anemia) వస్తుంది? – ఇనుము (Iron).
వ్యాధులు మరియు సూక్ష్మజీవులు
387. పెన్సిలిన్ ను ఏ జీవి నుండి కనుగొన్నారు? – పెన్సీలియం నొటేటమ్ (శిలీంధ్రం).
388. ‘వండర్ డ్రగ్’ (అద్భుత ఔషధం) అని దేనిని పిలుస్తారు? – పెన్సిలిన్.
389. స్ట్రెప్టోమైసిన్ కనుగొన్నది – సెల్మాన్ వాక్స్ మన్.
390. కలరా వ్యాధి దేని వల్ల వస్తుంది? – విబ్రియో కలరే (బాక్టీరియా).
391. కలరాను కలుగజేసే బ్యాక్టీరియా ఏ ఆకారంలో ఉంటుంది? – కామా (Comma) ఆకారం.
392. టైఫాయిడ్ కలుగజేసే బ్యాక్టీరియా – సాల్మొనెల్లా టైఫీ.
393. క్షయ (TB) వ్యాధికి కారణం – మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్.
394. కుష్టు (Leprosy) వ్యాధికి కారణం – మైకోబాక్టీరియం లెప్రే.
395. టెటానస్ (ధనుర్వాతం) కు కారణం – క్లాస్ట్రీడియం టెటానీ.
396. సిఫిలిస్ (Syphilis) అనే సుఖ వ్యాధి దేని వల్ల వస్తుంది? – ట్రిపోనిమా పాలిడమ్ (బాక్టీరియా).
397. సర్వసాధారణ జలుబు (Common cold) కు కారణమైన వైరస్ – రైనో వైరస్.
398. రాబిస్ వ్యాధికి కారణమయ్యే వైరస్ – రాబ్డో వైరస్.
399. పోలియో వ్యాధి ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది? – నాడీ వ్యవస్థ (కేంద్ర నాడీ వ్యవస్థ).
400. ఆటలమ్మ (Chickenpox) కు కారణమైన వైరస్ – వేరిసెల్లా జోస్టర్.
401. స్వైన్ ఫ్లూ వ్యాధికి కారణమైన వైరస్ – H1N1.
402. బర్డ్ ఫ్లూ కు కారణమైన వైరస్ – H5N1.
403. రింగ్ వర్మ్ (తామర) ఏ సూక్ష్మజీవుల వల్ల వస్తుంది? – శిలీంధ్రాలు (ఉదా: ట్రైకోఫైటాన్).
404. అమీబియాసిస్ (Amoebic dysentery) కు కారణం – ఎంటమీబా హిస్టోలైటికా.
405. ప్లాస్మోడియం వైవాక్స్ దేనిని కలుగజేస్తుంది? – మలేరియా.
406. ప్లాస్మోడియం యొక్క ప్రాథమిక అతిథేయి – ఆడ అనాఫిలిస్ దోమ.
407. మలేరియా చికిత్సకు వాడే ఔషధం – క్వినైన్.
408. మలేరియా పరాన్నజీవి జీవితచక్రాన్ని దోమలో కనుగొన్నది – సర్ రొనాల్డ్ రాస్.
409. ఆస్కారిస్ (ఏలికపాము) మానవుని ఏ భాగంలో ఉంటుంది? – చిన్న ప్రేగు.
410. ఏనుగు కాలు (బోదకాలు) వ్యాధిని కలిగించే జీవి – ఉచరేరియా బాన్ క్రాఫ్టి.
411. బోదకాలు వ్యాధి ఏ దోమ కుట్టడం వల్ల వ్యాపిస్తుంది? – క్యూలెక్స్ దోమ.
మొక్కల శరీర ధర్మశాస్త్రం మరియు ఆవరణ శాస్త్రం
412. కణజాల వర్ధనం (Tissue culture) పితామహుడు – గొట్లీబ్ హేబర్ లాండ్.
413. ఒక కణం పూర్తి మొక్కగా పెరిగే సామర్థ్యాన్ని ఏమంటారు? – టోటిపొటెన్సీ (Totipotency).
414. వరి శాస్త్రీయ నామం – ఒరైజా సటైవా.
415. గోధుమ శాస్త్రీయ నామం – ట్రిటికమ్ ఈస్టివమ్.
416. మొక్కలలో పత్రరంధ్రాలు (Stomata) తెరుచుకోవడానికి సహాయపడే మూలకం – పొటాషియం (K).
417. పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్లడాన్ని ఏమంటారు? – బాష్పోత్సేకం (Transpiration).
418. బాష్పోత్సేకం రేటును కొలిచే పరికరం – పోటోమీటర్.
419. బిందుస్రావం (Guttation) పత్రాలలోని ఏ నిర్మాణాల ద్వారా జరుగుతుంది? – జలరంధ్రాలు (Hydathodes).
420. నైట్రోజన్ లోపం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారడాన్ని ఏమంటారు? – క్లోరోసిస్.
421. మొక్కలలో కణజాలాలు నశించిపోవడాన్ని ఏమంటారు? – నెక్రోసిస్.
422. యూరియా లో ఉండే ప్రధాన మూలకం – నైట్రోజన్ (46%).
423. లెగ్యుమినేసి మొక్కల వేరు బుడిపెలలో సహజీవనం చేస్తూ నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియా – రైజోబియం.
424. నీటి ద్వారా జరిగే పరాగసంపర్కం – హైడ్రోఫిలి.
425. గాలి ద్వారా జరిగే పరాగసంపర్కం – ఎనిమోఫిలి.
426. కీటకాల ద్వారా జరిగే పరాగసంపర్కం – ఎంటమోఫిలి.
427. పక్షుల ద్వారా జరిగే పరాగసంపర్కం – ఆర్నిథోఫిలి.
428. గబ్బిలాల ద్వారా జరిగే పరాగసంపర్కం – కైరాప్టెరోఫిలి.
429. పాముల ద్వారా జరిగే పరాగసంపర్కం – ఒఫియోఫిలి.
430. కిరణజన్య సంయోగక్రియ వేగం ఏ రంగు కాంతిలో అత్యధికంగా ఉంటుంది? – ఎరుపు మరియు నీలం.
431. కిరణజన్య సంయోగక్రియ ఏ రంగు కాంతిలో తక్కువగా/సున్నా ఉంటుంది? – ఆకుపచ్చ.
432. కిరణజన్య సంయోగక్రియ ఒక – నిర్మాణక క్రియ (Anabolic process).
433. శ్వాసక్రియ అనేది ఒక – విచ్ఛిన్నక క్రియ (Catabolic process).
434. కాంతిచర్యలు (Light reactions) హరితరేణువు లోని ఏ భాగంలో జరుగుతాయి? – గ్రానా (థైలకాయిడ్లు).
435. నిష్కాంతి చర్యలు (Dark reactions/కాల్విన్ వలయం) ఎక్కడ జరుగుతాయి? – స్ట్రోమా (ఆవర్ణిక).
436. కణ శక్తినాణేలు (Energy currency of the cell) అని వేటిని అంటారు? – ATP.
437. ఆవరణశాస్త్రం (Ecology) అనే పదాన్ని ప్రతిపాదించింది – ఎర్నెస్ట్ హేకెల్.
438. ఆవరణ వ్యవస్థ (Ecosystem) పదాన్ని ప్రవేశపెట్టింది – A.G. టాన్స్ లే.
439. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? – ఏకదిశాత్మకం.
440. ఆహారపు గొలుసులో శక్తి బదిలీకి సంబంధించిన ’10 శాతం నియమాన్ని’ ప్రతిపాదించింది – లిండ్ మాన్.
441. ఆహారపు గొలుసు (Food chain) ఎల్లప్పుడూ వేటితో ప్రారంభమవుతుంది? – ఉత్పత్తిదారులు (మొక్కలు).
442. జీవావరణంలో శక్తికి మూలాధారం – సూర్యుడు.
443. మొక్కలను తినే జంతువులను ఏమంటారు? – ప్రాథమిక వినియోగదారులు.
444. చనిపోయిన కళేబరాలను కుళ్ళింపజేసేవి – విచ్ఛిన్నకారులు (బాక్టీరియా, శిలీంధ్రాలు).
445. భూమిపై ఉన్న అతిపెద్ద ఆవరణ వ్యవస్థ – జీవావరణం (సముద్ర ఆవరణ వ్యవస్థ).
446. లైకెన్లు ఏ రకమైన ఆవరణ అనుక్రమానికి (Ecological Succession) మార్గదర్శకాలు? – శిలానుక్రమం (Lithosere).
447. నీటి అభావ పరిస్థితుల్లో పెరిగే మొక్కలు – ఎడారి మొక్కలు (Xerophytes).
448. ఎడారి మొక్కలలో పత్రాలు ఏ విధంగా రూపాంతరం చెందుతాయి? – కంటకాలు (ముళ్ళు).
449. నీటిలో పెరిగే మొక్కలను ఏమంటారు? – హైడ్రోఫైట్స్.
450. ఉప్పు నీటిలో పెరిగే మొక్కలను ఏమంటారు? – హాలోఫైట్స్ (మడ అడవులు).
451. మాంగ్రూవ్స్ (మడ అడవులు) లో కనిపించే మొలక విధానం – జరాయుజ మొలకకట్టడం (Vivipary).
452. నేలల అధ్యయనం – పెడాలజీ (Pedology).
453. కాంతి ప్రభావాన్ని బట్టి మొక్కల పుష్పించడాన్ని ఏమంటారు? – కాంతి కాలావధి (Photoperiodism).
454. మంచు (Snow) మీద పెరిగే శైవలాలను ఏమంటారు? – క్రయోఫైట్స్.
జీవశాస్త్ర ఇతర ముఖ్య అంశాలు
455. DNA జన్యు సమాచారాన్ని RNA కు బదిలీ చేయడాన్ని ఏమంటారు? – అనులేఖనం (Transcription).
456. RNA ద్వారా ప్రోటీన్లు సంశ్లేషణ చెందడాన్ని ఏమంటారు? – అనువాదం (Translation).
457. రక్తంలోని ఆక్సిజన్ ను రవాణా చేసే వర్ణద్రవ్యం – హీమోగ్లోబిన్.
458. కండరాలలో ఆక్సిజన్ ను నిల్వ చేసే వర్ణద్రవ్యం – మయోగ్లోబిన్.
459. పొగాకును నమలడం, ధూమపానం వల్ల ప్రధానంగా వచ్చే క్యాన్సర్ – నోటి మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్.
460. పొగాకులో ఉండే ఆల్కలాయిడ్ – నికోటిన్.
461. ఊపిరితిత్తుల గాలి సామర్థ్యాన్ని కొలిచే సాధనం – స్పైరోమీటర్.
462. కణజాలాలకు ఆక్సిజన్ తగినంత అందకపోవడాన్ని ఏమంటారు? – హైపాక్సియా (Hypoxia).
463. జాతీయ వృక్షం – మర్రిచెట్టు (Ficus benghalensis).
464. జాతీయ జంతువు – పెద్ద పులి (Panthera tigris).
465. జాతీయ పక్షి – నెమలి (Pavo cristatus).
466. జాతీయ జలచరం – గంగా డాల్ఫిన్.
467. గ్లైకాలిసిస్ (Glycolysis) ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? – కణద్రవ్యంలో.
468. క్రెబ్స్ వలయం ఎక్కడ జరుగుతుంది? – మైటోకాండ్రియా మాత్రికలో.
469. కిరణజన్య సంయోగక్రియలో వెలువడే ఆక్సిజన్ దేని నుండి వస్తుంది? – నీరు (H2O).
470. పండ్లలో అత్యధికంగా ఉండే చక్కెర – ఫ్రక్టోజ్.
471. పాలలో ఉండే చక్కెర – లాక్టోస్.
472. చెరకు రసంలో ఉండే చక్కెర – సుక్రోజ్ (టేబుల్ షుగర్).
473. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రం – హెమటాలజీ.
474. కాలేయ వ్యాధులను లేదా సామర్థ్యాన్ని నిర్ధారించే పరీక్ష – LFT (Liver Function Test).
475. పాలు పెరుగుగా మారినప్పుడు దానిలో పెరిగే విటమిన్ ఏది? – విటమిన్ B12.
476. మానవ శరీరంలో రక్తం గడ్డకట్టడానికి పట్టే సగటు సమయం – 3 నుండి 6 నిమిషాలు.
477. ఎర్ర రక్త కణాలు లేని జంతువుకు ఉదాహరణ – వానపాము (రక్తంలో హీమోగ్లోబిన్ కరిగి ఉంటుంది).
478. రక్తదానం చేసినప్పుడు రక్తం గడ్డకట్టకుండా కలిపే రసాయనం – సోడియం సిట్రేట్.
479. బ్లడ్ బ్యాంక్ లో రక్తాన్ని నిల్వ ఉంచే ఉష్ణోగ్రత – 4°C.
480. డెంగ్యూ జ్వరంలో మానవ శరీరంలో ఏవి తగ్గిపోతాయి? – రక్త ఫలకికలు
481. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని ఏమంటారు? – థ్రాంబోసిస్.
482. మెదడు రక్తనాళాలు పగిలిపోవడాన్ని ఏమంటారు? – బ్రెయిన్ హేమరేజ్.
483. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు – కరోనరీ ధమనులు.
484. పుట్టుకతోనే వచ్చే వ్యాధులను ఏమంటారు? – కంజెనిటల్ వ్యాధులు.
485. అంటువ్యాధులు వ్యాప్తి చెందడాన్ని ఏమంటారు? – ఎపిడెమిక్.
486. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే వ్యాధిని ఏమంటారు? – పాండమిక్
487. మానవ శరీరంలో అతిపొడవైన సిర – సాఫినస్ సిర (కాలిలో ఉంటుంది).
488. కణంలో ప్రోటీన్ల కర్మాగారాలు అని దేనిని పిలుస్తారు? – రైబోజోములు.
489. ఏ వ్యాధిని ‘హన్సన్ వ్యాధి’ అని కూడా పిలుస్తారు? – కుష్టు వ్యాధి
490. వ్యాధి నిరోధక శక్తిని పెంచే రక్తకణాలు – తెల్ల రక్తకణాలు.
491. ప్లాస్మాలో నీటి శాతం సుమారుగా ఎంత? – 90 నుంచి 92 శాతం.
492. కండరాలు అలసిపోవడానికి కారణమైన ఆమ్లం – లాక్టిక్ ఆమ్లం.
493. నిమ్మ, నారింజలో ఉండే ఆమ్లం – సిట్రిక్ ఆమ్లం.
494. చింతపండులో ఉండే ఆమ్లం – టార్టారిక్ ఆమ్లం.
495. టమాటాలో ఉండే ఆమ్లం – ఆక్సాలిక్ ఆమ్లం.
496. ఆపిల్ లో ఉండే ఆమ్లం – మాలిక్ ఆమ్లం.
497. చీమలు, తేనెటీగలు కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లం – ఫార్మిక్ ఆమ్లం.
498. మానవుని లాలాజలం (Saliva) pH విలువ ఎంత? – సుమారు 6.8.
499. మానవుని రక్తం pH విలువ – 7.4.
500. మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణద్రవ్యం – యూరోక్రోమ్.