AP & TG TET DSC Telugu Methodology భాష – సమాజం – సాహిత్య ప్రక్రియలు Previous Questions & Answers

AP & TG TET DSC Telugu Methodology

AP & TG TET, DSC, SGT, SA, TGT, PGT పరీక్షలకు ఉపయోగపడే భాష – సమాజం – సాహిత్య ప్రక్రియలు (Language, Society & Literary Processes) పై ముఖ్యమైన Previous Questions & Answers. పరీక్షల్లో పదేపదే అడిగిన MCQs, సమాధానాలు మరియు తెలుగు మెథడాలజీ ముఖ్యమైన బిట్స్‌ను ఇక్కడ పొందండి. AP & TG TET DSC Telugu Methodology imp MCQ’S

భాష – సమాజం – సాహిత్య ప్రక్రియలు
1. “భాష” అనే పదం ఏ సంస్కృతధాతువు నుండి ఉద్భవించింది ? (D.El.Ed – 2016)
1. బాస
2. భాస్
3. భాశ్
4. భాష్

2. “సైమన్ పాటర్” రచించిన గ్రంథం ? (TGT – 2018) (B.Ed. – 2014)
1. ఎ కోర్స్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్స్
2. ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్
3. లాంగ్వేజ్ ఇన్ ద మోడరన్ వరల్డ్
4. మోడరన్ లింగ్విస్టిక్

3. “ఇంట్రడక్షన్ టు ట్రాన్స్‌ఫర్మేషనల్ గ్రామర్” అనే గ్రంథంలో ‘భాష అనంతమైన వాక్యాల సముదాయం’ అన్నవారు ? (D.El.Ed – 2016) (TGT – 2018, LP – 2019, SGT – 2019)
1. ఎడ్వర్డ్ సెఫైర్
2. ఎమ్మాన్ బాక్
3. నిఘంటుకారులు
4. నోమ్ చామ్స్కీ

4. “భావ వ్యక్తీకరణలో వాక్యం ప్రధాన అంశం” అన్నది ఎవరి అభిప్రాయం ? (D.El.Ed – 2016)
1. స్టర్ట్‌వర్ట్
2. ఎమ్మాన్ బాక్
3. ఎడ్వర్డ్ సఫేర్
4. జాస్.పి.హ్యూగ్స్

5. “ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్” అనే రచనలో “ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష” అని నిర్వచించిన భాషావేత్త ? (D.El.Ed – 2016)
1. స్టర్ట్‌వర్ట్
2. ఎమ్మాన్ బాక్
3. ఎడ్వర్డ్ సఫేర్
4. జాస్.పి.హ్యూగ్స్

6. “ఎ కోర్స్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్” అనే గ్రంథంలో “వివిధ (అనేక) భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష” అని నిర్వచించిన భాషావేత్త ? (D.El.Ed – 2016) (TET – 2018, SA – 2018)
1. హాకెట్
2. ఎమ్మాన్‌బాక్
3. సెఫైర్
4. స్టర్ట్‌వర్ట్

7. “భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది” అని అభిప్రాయపడ్డవారు ? (B.Ed. – 2016) (TGT – 2017, 2019)
1. వెస్లర్
2. అరిస్టాటిల్
3. బెంజిమన్ వోర్ఫ్
4. జాన్ స్టువర్ట్ మిల్

8. భాషకు మూలం ఏది ? (TGT – 2018) (B.Ed. – 2002)
1. పదం
2. వాక్యం
3. ధ్వని
4. అర్థం

9. “భాష-భావం” అనే భావనలకు సంబంధించి సరైనవి ? (B.Ed. – 2002)
A) భాష-భావం నాణానికి రెండువైపులుగా చెప్పవచ్చు.
B) భాష మనిషికి శరీరం లాంటిదయితే, భావం ప్రాణం లాంటింది.
C) భాషకు – భావాలకు అవినాభావ సంబంధం ఉంటుంది.
1. A, B లు మాత్రమే సరైనవి
2. C మాత్రమే సరైనది
3. A, B మరియు C లు సరైనవి
4. A, C లు సరైనవి

10. భాష ఆవిర్భావానికి మూల కారణం ? (PGT – 2018) (B.Ed. – 2002)
1. ఉత్పాదకత
2. భావ వినిమయం
3. ఆదరణీయత
4. సంభావ్యత

11. మానవుడి తరతరాల వారసత్వ సంపద, సాంస్కృతిక వస్తు విశేషం ? (TGT – 2017)
1. సంపద
2. భాష
3. వ్యవసాయం
4. గృహం

12. భాష – భావంకు సంబంధించి సరికానిది ? (B.Ed. – 2002)
1. సజీవుల నుండి వెలువడే ధ్వనుల నుండి భావం తెలుసుకోవచ్చు.
2. నిర్జీవుల నుండి వెలువడే ధ్వనులకు కారణం తెలుసుకోవచ్చు.
3. భాషకు భావ సౌందర్యం ఉంటే, భావంలో అంతః సౌందర్యం ఉంటుంది. ఈ రెండూ కలిస్తే మానవుడికి ఆనందానుభూతి కలుగుతుంది.
4. సజీవుల నుండి వెలువడే ధ్వనుల నుండి కారణం తెలుసుకోవచ్చు.

13. “భాష అనేది ఒక మానవీయ సమాచారాన్ని ప్రసాదించే ఒక అద్భుత సాధనం” అని నిర్వచించిన వారు ? (TGT – 2018) (B.Ed. – 16)
1. ప్రొ|| కృష్ణ కుమార్ (2010)
2. జె.వాట్.మా
3. స్టర్ట్‌వర్ట్
4. బ్లాచ్ & ట్రాగర్

14. “ఒక సమాజము నందలి సభ్యులు వ్యవహరించుటకు ఉపయోగించు స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థయే భాష” అన్నవారు ? (D.El.Ed – 2016)
1. ఆస్ట్ వల్డ్ & పెల్ట్‌సన్
2. బ్లాచ్ & ట్రాగర్
3. SK వర్మ & N. కృష్ణస్వామి
4. స్టర్ట్‌వర్ట్

15. “ఒక సాంఘిక సముదాయం పరస్పరం సహకరించుకొనుటకు తోడ్పడే స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థయే భాష” అన్నది ? (D.El.Ed – 2016)
1. ఆస్ట్‌వల్డ్ & పెల్ట్‌సన్
2. బ్లాచ్ & ట్రాగర్
3. SK వర్మ & N. కృష్ణస్వామి
4. స్టర్ట్‌వర్ట్

16. “భాష ఒక ఆలోచనా సాధనంగా, వివిధ విషయాలకు అనుభూతిని పొందించేది, ప్రతిస్పందింపజేసేది భాషా ప్రయోజనం” అని నిర్వచించినవారు ?
1. ప్రొ|| కృష్ణ కుమార్
2. పోరంకి దక్షిణామూర్తి
3. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి
4. SK వర్మ & N. కృష్ణస్వామి

17. భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది ? (SGT – 2019) (D.El.Ed – 2018)
1. తల్లిదండ్రుల ద్వారా
2. మిత్రుల ద్వారా
3. సందర్భాల సృష్టి ద్వారా
4. పాఠశాలకు వెళ్ళడం ద్వారా

18. ఒక వ్యక్తిగానీ, వ్యక్తుల సమూహంగానీ ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడే స్థితి ? (PGT – 2018) (B.Ed. – 2016)
1. సంస్కృతీకరణం
2. సామాజికీకరణం
3. వైవిధ్యత
4. బహుభాషీయత

19. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడే స్థితిని “బహుభాషిత్వం” అంటారని నిర్వచించినది ? (B.Ed. – 2016)
1. ఎన్.వై.మూర్
2. వివియన్‌కుక్
3. బోస్నార్తన్
4. హాల్

20. బహుభాషిత్యానికి సంబంధించి తప్పుగా పేర్కొనబడినది ? (D.El.Ed – 2018)
1. ఒక్క భాషలోనే మాట్లాడగలిగే వ్యక్తిని ఏకభాషీయుడు అంటారు.
2. రెండు భాషలలో మాట్లాడగలిగే వారిని ద్విభాషీయులు అంటారు.
3. అనేక భాషలలో మాట్లాడగలిగిన వారిని బహుభాషీయులు అనవచ్చు.
4. రెండు భాషలలో మాట్లాడగలిగే వారిని బహుభాషీయులు అనవచ్చు.

21. “మూడు లేదా అంతకంటే ఎక్కువ భాషలను విడివిడిగా లేదా కలగలిపి వినియోగించే సామర్థ్యం గల వ్యక్తిని బహుభాషీయుడు అనవచ్చు” అని నిర్వచించినవారు ? (D.El.Ed – 2018)
1. కెంప్ (2009)
2. వివియన్‌కుక్ (2001)
3. సి.పి. బ్రౌన్
4. కాల్డెవెల్

22. భాషా ప్రణాళిక రచనలో బహుభాషిత్వం కీలకం అని చెప్పినది ? (D.El.Ed – 2018)
1. NCFTE 2010
2. NCF 2005, జాతీయ భాషల బోధన ఆధారపత్రం 2005
3. APSCF 2011
4. NPE 1986

23. ధ్వనులు లేదా వర్ణాలు, పదాలు, వాక్య నిర్మాణ సూత్రాలు వేటిలో అంతర్భాగంగా చెప్పవచ్చు ? (B.Ed. – 2016)
1. సంధి నిర్మాణం
2. సమాస నిర్మాణం
3. అలంకార నిర్మాణం
4. భాషా నిర్మాణం

24. భాషా నిర్మాణానికి మూలాంశం ? (B.Ed. – 2016)
1. ధ్వని లేదా వర్ణం
2. పదం
3. వాక్యం
4. ధ్వన్యుత్పత్తి స్థానాలు

25. మనిషి ముఖ యంత్రం నుండి వెలువడి, పదాల అర్థాలను మార్చగలిగే సామర్థ్యం ఉన్న ధ్వనులు ? (PGT – 2017) (B.Ed. – 2016)
1. పర్యాయ పదాలు
2. సంజ్ఞలు
3. నానార్థాలు
4. వర్ణాలు

26. ఒక పదాన్ని ఉచ్ఛరించినపుడు వెలువడే ధ్వనులను ఇలా పిలుస్తారు ? (B.Ed. – 2016)
1. వర్ణాలు
2. పదాలు
3. వాక్యాలు
4. పదాంశం

27. భాషలోని అర్థవంతమైన ప్రాథమికాంశం ? (B.Ed. – 2016)
1. ధ్వని లేదా వర్ణం
2. పదం లేదా పదాంశం
3. వాక్యం
4. భాషా నిర్మాణం

28. భాష యొక్క మౌలిక / ప్రధాన / ప్రాథమిక ప్రయోజనం దేనిగా చెప్పవచ్చు ? (B.Ed. – 2016)
1. భావ గ్రహణం
2. భావ వ్యక్తీకరణ
3. భావ వినిమయం
4. భాషణం

29. భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఎదుటి వారిలో కలిగించేది ? (TET – 2018)
1. భావ వినిమయం
2. భావ విముక్తి
3. భావముక్తి
4. భావోద్దీపనం

30. పరస్పర భావ వినిమయానికి ఉపకరించే సాధనం.
1. సంస్కృతి
2. విద్య
3. ధ్వని
4. భాష

31. భావ వినిమయం ప్రయోజనాలు ప్రధానంగా రెండు రకాలు మొదటిది భావ వ్యక్తీకరణ / అభివ్యక్తి కాగా, రెండవది ……….. (B.Ed. – 2014)
1. ఆత్మగతం
2. ప్రకాశం
3. భాషాశీలత
4. భావ గ్రహణం / స్వీకరణ

32. మొదట మౌఖిక రూపంలో ఉత్పన్నమైన భాష కాలక్రమేణా ఏ రూపం సంతరించుకుంది ? (B.Ed. – 2014)
1. రసరూపం
2. అలంకార రూపం
3. లిఖిత రూపం
4. సంకేత రూపం

33. ప్రపంచంలో ఎన్ని భాషలకు పైగా ఉన్నాయని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం ? (B.Ed. – 2016)
1. 9000 పైగా
2. 8000 పైగా
3. 7000 పైగా
4. 20000 పైగా

34. ఒక మూలభాష నుంచి అంటే ఒక ఆదిమ భాష నుంచి ఏర్పడిన భాషలను ఒక కుటుంబంగా నిర్ణయించడం ఏ ప్రాతిపదికగా భావించవచ్చు ? (B.Ed. – 2016)
1. భౌగోళిక ప్రాతిపదిక (Geographic distribution)
2. భాషా నిర్మాణ ప్రాతిపదిక (Structural Familiarity)
3. వారసత్వ ప్రాతిపదిక (Genelogical Familiarity)
4. చారిత్రక ప్రాతిపదిక (Histroical Familiarity)

35. పదాల, వాక్యాల నిర్మాణక్రమంలో పోలికల ఆధారంగా భాషా కుటుంబాలను విభజించడాన్ని ఇలా పిలుస్తారు ? (B.Ed. – 2016)
1. భాషా నిర్మాణ ప్రాతిపదిక
2. భౌగోళిక ప్రాతిపదిక
3. వారసత్వ ప్రాతిపదిక
4. చారిత్రక ప్రాతిపదిక

36. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లోని అత్యధిక విద్యార్థుల మాతృభాష తెలుగు. దీనినే “ఏకభాషీయస్థితి” అంటారు. అయితే రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఈ క్రింది స్థితి ఉంటుంది ? (B.Ed. – 2016)
1. ఏకభాషీయ స్థితి
2. త్రిభాషీయ స్థితి
3. ద్విభాషీయ స్థితి
4. పైవన్నీ సరైనవే

37. కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ, ఒరియా, బెంగాలీ, గుజరాతీ మాతృభాషలుగా (ప్రథమ భాషగా) కలిగిన విద్యార్థులకు మన రాష్ట్రంలో ద్వితీయ భాషగా బోధిస్తున్న భాష ? (B.Ed. – 2016)
1. ఆంగ్లం
2. హిందీ
3. సంస్కృతం
4. తెలుగు

38. ద్వితీయ భాషగా తెలుగు బోధించేటప్పుడు సాధించవలసిన విలువలలో ఇది ఒకటి (TET – 2017) (B.Ed. – 2002)
1. జేవాధారికాలు
2. ఆధునికాలు
3. అలంకారప్రాయాలు
4. సామాజికాలు

39. సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని, భాషకు వర్గ స్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు ? (SGT – 2018) (D.El.Ed – 2018)
1. చామ్‌స్కీ
2. బ్రూనర్
3. మాక్స్ ముల్లర్
4. ఎన్.వై.మూర్

40. “భాష, సమాజం, సంస్కృతి” అనే మూడు ? (SGT – 2018) (D.El.Ed – 2018)
1. విభిన్నాంశాలు
2. సమానార్థ బోధక అంశాలు
3. అనాలోచనీయాలు
4. పరస్పరాధారిత అంశాలు

41. భాష సమాజాన్ని ? (SGT – 2018) (D.El.Ed – 2018)
1. రక్షిస్తుంది
2. శాసిస్తుంది
3. మారుస్తుంది
4. అధిక్షేపిస్తుంది

42. “గ్రాంథిక భాష” కు సంబంధించి సరైన నిర్వచనం కానిది గుర్తించండి ? (D.Ed – 2010)
1. లిఖితమై, గ్రంథస్థమైన భాషను గ్రాంథిక భాష అనవచ్చు.
2. సాంప్రదాయ సిద్ధమైన కొన్ని నియమ నిబంధనలకు లోబడి రాసే భాషా రూపాన్ని గ్రాంథిక భాష అనవచ్చు.
3. అత్యధిక సంఖ్యాకులు దైనందిన కార్యకలాపాలలో వాడే భాష గ్రాంథిక భాష
4. గ్రంథాల్లో వాడే భాషను గ్రాంథిక భాష అంటారు.

43. ఆదికవి నన్నయ(11వ శతాబ్దం) నుంచి 1930-40 వరకు తెలుగు భాషలో వెలువడిన ప్రబంధాలు, కావ్యాలు, నాటకాలు, ఇతర రచనలు మొదలగునవి అన్నీ ఏ భాషలో రచించారు ? (B.Ed. – 2016)
1. శిష్ట వ్యవహారిక భాష
2. వ్యవహారిక భాష
3. మాండలిక భాష
4. గ్రాంథిక భాష

44. ప్రాచీన సాహిత్యంలోని గ్రంథాలలో ఉపయోగించిన కొన్ని ప్రత్యేక నియమ నిబంధనల ఆధారంగా నిర్మించిన భాషను ఏమంటారు ? (D.Ed – 2010)
1. గ్రాంథిక భాష / కావ్య భాష
2. వ్యవహారిక భాష
3. మాండలిక భాష
4. శిష్ట వ్యవహారిక భాష

45. మాటకు, రాతకు సన్నిహితంగా ఉండి మాట్లాడేవాళ్ళ, రాసేవాళ్ళ భావాలను వినేవాళ్ళు (వక్త భావాన్ని శ్రోత) సులభంగా, స్పష్టంగా గ్రహించడానికి వీలుపడే భాషా విశేషం ? (B.Ed. – 2014)
1. గ్రాంథిక భాష
2. వ్యవహారిక భాష
3. మాండలిక భాష
4. ప్రామాణిక భాష

46. అత్యధిక ప్రజలు తమదైనందిన వ్యవహారాలలో ఉపయోగించే భాష ? (B.Ed. – 2016)
1. గ్రాంథిక భాష
2. ఆధునిక భాష
3. వ్యవహారిక భాష
4. మాండలిక భాష

47. గ్రాంథిక భాషా వాదులు ఏ భాషను దృష్టిలో ఉంచుకొని గ్రామ్యభాష అని అపహాస్యం చేశారు ? (B.Ed. – 2014)
1. గ్రాంథిక భాష
2. ఆధునిక భాష
3. వ్యవహారిక భాష
4. మాండలిక భాష

48. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపాన్ని ఇలా అంటారు ? (TET – 2018) (D.El.Ed – 2016)
1. ప్రామాణిక భాష
2. మాండలిక భాష
3. వ్యవహారిక భాష
4. గ్రాంథిక భాష

49. ఉపభాష, ప్రాదేశిక భాష అని నామాంతరములు గల భాష ? (B.Ed. – 2014)
1. ఆధునిక భాష
2. గ్రాంథిక భాష
3. వ్యవహారిక భాష
4. మాండలిక భాష

50. ఒక మండలంలోని జనులు మాట్లాడే భాష మాండలిక భాష అయితే మండలమనగా ……. (B.Ed. – 2014)
1. దేశంలోని భాగం
2. ప్రజల సమూహం లేదా వర్గం
3. రాష్ట్రంలోని భాగం
4. 1, 2 సమాధానాలు సరైనవి

జవాబులు (Answer Key)

1) 4      2) 4     3) 2     4) 2      5) 4
6) 1      7) 3     8) 3     9) 3     10) 2
11) 2   12) 4   13) 2   14) 4    15) 2
16) 1   17) 3   18) 4   19) 2    20) 4
21) 1   22) 2   23) 4   24) 1    25) 4
26) 1   27) 2   28) 3   29) 4    30) 4
31) 4   32) 3   33) 3   34) 3    35) 1
36) 3   37) 4   38) 1   39) 4    40) 4
41) 2   42) 3   43) 4   44) 1    45) 2
46) 3   47) 3   48) 2   49) 4    50) 4

Leave a Comment