Class 6 Social Chapter 2 Model of the Earth 28 Important MCQs with Answers | CBSE & NCERT

Class 6 Social Chapter 2 Model of the Earth

CHAPTER :2 “గ్లోబ్ – భూమికి నమూనా (Globe – Model of the Earth)” Practice Class 6 Social Chapter 2 Model of the Earth with 28 important MCQs and answers. Best for CBSE, NCERT, school exams, quizzes, and quick revision.

1. “గ్లోబ్ (Globe)” అనే పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించింది?
A) గ్రీకు (గెబ్లోస్)
B) లాటిన్ (గ్లోబస్)
C) స్పానిష్ (గ్లోబో)
D) ఫ్రెంచ్ (గ్లోబ్)

జవాబు: B
వివరణ: గ్లోబ్ (Globe) అనే ఆంగ్ల పదం “గ్లోబస్ (Globus)” అనే లాటిన్ పదం నుండి వచ్చింది, అనగా గోళం (Sphere) అని అర్థం.

2. 1492లో ప్రపంచంలోనే అతి పురాతనమైన భౌమ గ్లోబును (Terrestrial globe) తయారు చేసినది ఎవరు?
A) తఖి అల్-దిన్
B) మార్టిన్ బెహైమ్
C) టాలమీ
D) గెలీలియో

జవాబు: B
వివరణ: 1492లో మార్టిన్ బెహైమ్ (Martin Behaim) అతి పురాతనమైన భౌమ గ్లోబును తయారు చేశాడు.

3. ప్రపంచంలోనే మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును (Seamless celestial globe) ఎవరి ఆదరణలో నిర్మించారు?
A) మౌర్యులు
B) గుప్తులు
C) మొఘల్ శాస్త్రవేత్తలు
D) బ్రిటిష్ వారు

జవాబు: C
వివరణ: ప్రపంచంలోనే మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును మొఘల్ సామ్రాజ్య కాలంలో మొఘల్ శాస్త్రవేత్తలు నిర్మించారు.

4. భూమి ఆకారాన్ని గ్లోబ్ సరిగ్గా సూచిస్తుంది. భూమి ఆకారం గురించి సరైన వాక్యం ఏది?
A) పూర్తిగా గుండ్రంగా ఉంటుంది.
B) ధృవాల వద్ద ఉబ్బి, భూమధ్యరేఖ వద్ద చదునుగా ఉంటుంది.
C) ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి, మధ్యలో ఉబ్బి ఉంటుంది.
D) దీర్ఘ వృత్తాకారంగా ఉంటుంది.

జవాబు: C
వివరణ: భూమి కచ్చితమైన గోళం కాదు. ఇది ఉత్తర, దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి, మధ్యలో ఉబ్బి ఉంటుంది.

5. భూమికి గల ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ గీసిన ఊహా రేఖను ఏమంటారు?
A) అక్షం (Axis)
B) కర్కటక రేఖ
C) మకర రేఖ
D) కక్ష్య

జవాబు: A
వివరణ: భూమి యొక్క భ్రమణ అక్షం అనేది ఉత్తర మరియు దక్షిణ ధృవాల గుండా పోయే ఒక ఊహాత్మక సరళ రేఖ.

6. భూమిని ఉత్తర, దక్షిణ అర్ధగోళాలుగా (Hemispheres) విభజించే 0 (సున్నా డిగ్రీల) అక్షాంశం ఏది?
A) ప్రధాన రేఖాంశం
B) భూమధ్యరేఖ (Equator)
C) కర్కటక రేఖ
D) ఆర్కిటిక్ వలయం

జవాబు: B
వివరణ: గ్లోబ్ మధ్యలో అడ్డంగా గీసిన ఊహా రేఖ భూమిని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. ఈ రేఖను భూమధ్యరేఖ (0° అక్షాంశం) అంటారు.

7. అక్షాంశాలకు (Latitudes) సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
A) ఇవి ఒకదానికొకటి ఖండించుకుంటాయి.
B) ఇవి భూమధ్యరేఖకు సమాంతరంగా గీసిన ఊహా రేఖలు.
C) ఇవి ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతాయి.
D) ఇవి అర్ధ వృత్తాలు.

జవాబు: B
వివరణ: గ్లోబ్‌పై భూమధ్యరేఖకు సమాంతరంగా గీసిన రేఖలను అక్షాంశాలు అంటారు. ఇవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి మరియు ఎప్పటికీ కలుసుకోవు (ఖండించుకోవు).

8. “లాటిట్యూడ్ (Latitude)” అనే ఆంగ్ల పదం ‘లాటిట్యూడో’ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏమిటి?
A) పొడవు, వైశాల్యం
B) వెడల్పు, పరిమాణం లేదా విస్తృతి
C) లోతు, వ్యాసం
D) సమాంతరం, దూరం

జవాబు: B
వివరణ: లాటిట్యూడో అనగా “వెడల్పు, విస్తృతి, పరిమాణం (breadth, width, extent, size)” అని అర్థం.

9. దక్షిణ ధృవం (South Pole) యొక్క అక్షాంశ విలువ ఎంత?
A) 90⁰ ఉత్తరం
B) 0⁰
C) 180⁰ దక్షిణం
D) 90⁰ దక్షిణం

జవాబు: D
వివరణ: భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న 90 Degree అక్షాంశాన్ని దక్షిణ ధృవం అంటారు.

10. భూమి తన అక్షంపై ఏ దిశ నుండి ఏ దిశకు భ్రమణం (Rotation) చేస్తుంది?
A) తూర్పు నుండి పడమరకు
B) పడమర నుండి తూర్పుకు
C) ఉత్తరం నుండి దక్షిణానికి
D) దక్షిణం నుండి ఉత్తరానికి

జవాబు: B
వివరణ: భూమి తన అక్షంపై పడమర నుండి తూర్పుకు (West to East) తిరుగుతుంది.

11. భూమి తన అక్షంపై ఒక భ్రమణం పూర్తి చేయడానికి పట్టే కచ్చితమైన సమయం ఎంత?
A) 24 గంటలు
B) 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు
C) 23 గంటల 50 నిమిషాలు
D) 24 గంటల 5 నిమిషాలు

జవాబు: B
వివరణ: భూమి ఒక భ్రమణం (తన చుట్టూ తాను తిరగడం) పూర్తి చేయడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్ల (సుమారు 24 గంటలు) సమయం పడుతుంది.

12. భూభ్రమణం (Earth’s rotation) వల్ల కలిగే ప్రధాన ఫలితం ఏమిటి?
A) రుతువులు ఏర్పడడం
B) గ్రహణాలు ఏర్పడడం
C) పగలు, రాత్రి ఏర్పడడం
D) సంవత్సరాలు మారడం

జవాబు: C
వివరణ: పగలు మరియు రాత్రి భూభ్రమణం (భూమి తన చుట్టూ తాను తిరగడం) వల్ల ఏర్పడతాయి.

13. సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్ష్య (Orbit) ఏ ఆకారంలో ఉంటుంది?
A) వృత్తాకారం
B) దీర్ఘ వృత్తాకారం (Elliptical)
C) చతురస్రాకారం
D) రేఖాకారం

జవాబు: B
వివరణ: భూమి సూర్యుని చుట్టూ తిరిగే స్థిరమైన మరియు క్రమమైన మార్గాన్ని “కక్ష్య” అంటారు. ఈ కక్ష్య దీర్ఘ వృత్తాకారంలో (Elliptical shape) ఉంటుంది.

14. భూ కక్ష్య (Earth’s orbit) యొక్క పొడవు సుమారుగా ఎంత?
A) 150 మిలియన్ కిలోమీటర్లు
B) 365 మిలియన్ కిలోమీటర్లు
C) 965 మిలియన్ కిలోమీటర్లు
D) 1000 మిలియన్ కిలోమీటర్లు

జవాబు: C
వివరణ: భూ కక్ష్య యొక్క పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు (96.5 కోట్ల కి.మీ).

15. సాధారణంగా ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి, అయితే ఒక “లీప్ సంవత్సరంలో (Leap year)” ఎన్ని రోజులు ఉంటాయి?
A) 364
B) 365.25
C) 366
D) 367

జవాబు: C
వివరణ: భూ పరిభ్రమణానికి 365 1/4 రోజులు పడుతుంది. మిగిలిన పావు (1/4) రోజును నాలుగు సంవత్సరాలకు ఒకసారి కలిపి (Leap Year) 366 రోజులుగా లెక్కిస్తారు. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి.

16. ఉత్తర అర్ధగోళంలో వేసవి కాలం లేదా గ్రీష్మ ఆయనాంతం (Summer Solstice) ఏ రోజున ఏర్పడుతుంది?
A) 21 మార్చి
B) 21 జూన్
C) 23 సెప్టెంబర్
D) 22 డిసెంబర్

జవాబు: B
వివరణ: జూన్ 21వ తేదీన ఉత్తర అర్ధగోళం సూర్యుని వైపు వంగి ఉంటుంది, ఆ రోజున సూర్య కిరణాలు కర్కటక రేఖపై నిలువుగా పడతాయి, దీనినే గ్రీష్మ ఆయనాంతం అంటారు.

17. శీతాకాలపు ఆయనాంతం (Winter Solstice) ఏ రోజున సంభవిస్తుంది?
A) 21 జూన్
B) 22 డిసెంబర్
C) 21 మార్చి
D) 23 సెప్టెంబర్

జవాబు: B
వివరణ: డిసెంబర్ 22న శీతాకాలపు ఆయనాంతం (Winter Solstice) సంభవిస్తుంది.

18. పగలు, రాత్రి సమానంగా ఉండే రోజులను విషవత్తులు (Equinoxes) అంటారు. ఇవి సంభవించే రోజులను గుర్తించండి.
A) 21 జూన్, 22 డిసెంబర్
B) 21 మార్చి, 23 సెప్టెంబర్
C) 21 జూలై, 23 ఆగస్టు
D) 22 మార్చి, 21 సెప్టెంబర్

జవాబు: B
వివరణ: 21 మార్చి మరియు 23 సెప్టెంబర్ తేదీలలో భూమి అంతటా పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వీటిని విషవత్తులు (Equinoxes) అంటారు.

19. సూర్య గ్రహణం (Solar Eclipse) ఏ సందర్భంలో ఏర్పడుతుంది?
A) సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు
B) సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు
C) భూమి, సూర్యుడు ఒకే సరళరేఖపై లేనప్పుడు
D) పైవేవీ కావు

జవాబు: B
వివరణ: సూర్యుడు, భూమికి మధ్య ఒకే సరళరేఖపై చంద్రుడు (Moon passes between Sun and Earth) వచ్చినప్పుడు సూర్య గ్రహణం సంభవిస్తుంది.

20. చంద్ర గ్రహణం (Lunar Eclipse) ఎప్పుడు ఏర్పడుతుంది?
A) భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు
B) సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు
C) సూర్యుడు, చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు
D) సూర్యుడు అదృశ్యమైనప్పుడు

జవాబు: C
వివరణ: సూర్యుడు మరియు చంద్రుని మధ్య ఒకే రేఖపై భూమి కదులుతున్నప్పుడు చంద్ర గ్రహణం సంభవిస్తుంది.

21. కింది వాటిలో పటం (Map) యొక్క ప్రధాన అంశం (Component) కానిది ఏది?
A) దిశలు (Directions)
B) స్కేలు (Scale)
C) ఎత్తు (Altitude)
D) చిహ్నాలు (Symbols)

జవాబు: C
వివరణ: పటాలకు ప్రధానంగా నాలుగు ముఖ్యమైన అంశాలు ఉంటాయి: దిశలు (Directions), స్కేలు (Scale), చిహ్నాలు (Symbols) మరియు రంగులు (Colours). ఎత్తు అనేది పటం యొక్క ప్రాథమిక అంశం కాదు.

22. పటాలలో ఏ దిశను ప్రధాన దిశగా (Principal direction) పరిగణిస్తారు?
A) తూర్పు
B) పడమర
C) ఉత్తరం
D) దక్షిణం

జవాబు: C
వివరణ: నాలుగు దిశలలో ఉత్తరంను ప్రధాన దిశగా పరిగణిస్తారు. అందుకే అన్ని పటాలలో కుడివైపు పై మూలన ‘N’ అనే అక్షరంతో ఉత్తర దిశను చూపే బాణం గుర్తు ఉంటుంది.

23. భూమిపై గల వాస్తవ దూరానికి మరియు పటంలో చూపిన దూరానికి మధ్య గల నిష్పత్తిని ఏమంటారు?
A) చిహ్నం (Symbol)
B) కొలత (Measure)
C) స్కేలు లేదా రేఖాచిత్రం (Scale)
D) ప్రణాళిక (Plan)

జవాబు: C
వివరణ: స్కేల్ అనగా నేలపై ఉన్న వాస్తవ దూరానికి మరియు పటంలో చూపబడిన దూరానికి మధ్య గల నిష్పత్తి (Ratio).

24. పటాలను (Maps) తయారు చేసేవారిని ఏమని పిలుస్తారు?
A) జియాలజిస్ట్ (Geologist)
B) కార్టోగ్రాఫర్స్ (Cartographers)
C) టోపోగ్రాఫర్స్ (Topographers)
D) ఆస్ట్రనామర్స్ (Astronomers)

జవాబు: B
వివరణ: పటాలను తయారుచేసే వారిని కార్టోగ్రాఫర్లు (Cartographers) అని పిలుస్తారు.

25. పటాల పుస్తకాన్ని (Book of maps) ఏమని అంటారు?
A) మాన్యువల్ (Manual)
B) కాటలాగ్ (Catalogue)
C) అట్లాస్ (Atlas)
D) గ్లోబ్ (Globe)

జవాబు: C
వివరణ: పటాలతో కూడిన పుస్తకాన్ని అట్లాస్ (Atlas) అని పిలుస్తారు.

26. భౌతిక పటాలలో పీఠభూములను (Plateaus) సూచించడానికి ఏ రంగును ఉపయోగిస్తారు?
A) నీలం (Blue)
B) ఆకుపచ్చ (Green)
C) పసుపు (Yellow)
D) గోధుమ (Brown)

జవాబు: C
వివరణ: పటాలలో పీఠభూములను (Plateaus) పసుపు (Yellow) రంగులో చూపుతారు.

27. పటాలలో మైదానాలను లేదా లోతట్టు ప్రాంతాలను (Plains or Low-lands) సూచించడానికి ఏ రంగును ఉపయోగిస్తారు?
A) గోధుమ రంగు (Brown)
B) ఆకుపచ్చ రంగు (Green)
C) నీలం రంగు (Blue)
D) ఎరుపు రంగు (Red)

జవాబు: B
వివరణ: పటాలలో మైదానాలను (Plains) ఆకుపచ్చ (Green) రంగులో సూచిస్తారు.

28. పటాలలో పర్వతాలను (Mountains) సూచించడానికి ఏ రంగును ఉపయోగిస్తారు?
A) తెలుపు (White)
B) పసుపు (Yellow)
C) గోధుమ (Brown)
D) నలుపు (Black)

జవాబు: C
వివరణ: పటాలలో పర్వతాలను (Mountains) సూచించడానికి గోధుమ (Brown) రంగును ఉపయోగిస్తారు. అలాగే నీటి వనరులకు నీలం రంగు వాడతారు.

Leave a Comment