Telugu Methodology Bits for TET and DSC

Telugu Methodology Bits for TET and DSC

తెలుగు మెథడ్స్

ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా చదువుతున్న అభ్యర్థుల కోసం.. టెట్ మరియు డిఎస్సీ (TET & DSC) పరీక్షల్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉన్న ‘తెలుగు మెథడాలజీ’ ముఖ్యమైన బిట్స్, వాటి సమాధానాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ ప్రశ్నలను ప్రాక్టీస్ చేసి మీ స్కోర్‌ను మెరుగుపరుచుకోండి.

1. జ్ఞానరంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాల ద్వారా విద్యార్థుల్లో ఈ వికాసం జరుగుతుంది ?(TGT – 2017) (B.Ed. – 2014 )
1. మూర్తిమత్వ వికాసం
2. ఉద్వేగ వికాసం
3. సాంఘిక వికాసం
4. శారీరక వికాసం
2. బోధనా లక్ష్యాలను మొట్టమొదటిగా విశ్లేషించిన విద్యావేత్త ?
(TET – 2018) (D.Ed – 2010)
1. బెంజిమన్ బ్లూమ్
2. కొమర్రాజు లక్ష్మణరావు
3. జె.ఎఫ్.క్రా
4. సర్వేపల్లి రాధాకృష్ణన్
3. ఉపాధ్యాయ కేంద్ర విద్య కాకుండా శిశుకేంద్ర విద్యగా సాగాలన్నది వీరి అభిమతం ?(TET – 2018)
1. మాక్స్ ముల్లర్
2. డార్విన్
3. కారల్ గ్రూస్
4. బ్లూమ్
4. బోధనా లక్ష్యాలను విశ్లేషించిన ప్రముఖులు ?(TGT – 2018) (B.Ed. – 2016)
1. స్కిన్నర్, పావ్లావ్, బ్లూమ్‌ఫీల్డ్
2. సఫైర్, దవే, బ్లూమ్‌ఫీల్డ్
3. బ్లూమ్స్, క్రాత్‌హోల్, సింప్సన్
4. క్రాత్‌హోల్, సింప్సన్, యశ్‌పాల్

5. మానసిక చలనాత్మక రంగంలోని బోధనా లక్ష్యాలను ఈ ముగ్గురూ ప్రచురించారు ?(PGT – 2017) (B.Ed. – 2016)
1. సింప్సన్, దవే, క్రాత్‌హోల్
2. బ్లూమ్, మాసియా, క్రాత్‌హోల్
3. మాసియా, క్రాత్‌హోల్, బ్లూమ్
4. దవే, బ్లూమ్, సింప్సన్

6. జ్ఞానాత్మక రంగానికి సంబంధించి “Taxonomy of Educational Objectives : The classification of Educational Goals : Hand Book I, Cognitive domain” ను ప్రచురించినవారు, సంబంధించిన సంవత్సరం వరుసగా ?(B.Ed. – 2016)
1. బెంజిమన్ బ్లూమ్స్, 1956
2. క్రాత్‌హోల్, బ్లూమ్స్, మాసియా, 1964
3. సింప్సన్, దవే, క్రాత్‌హోల్, 1972
4. బెంజిమన్ బ్లూమ్ – 1964

7. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ హ్యాండ్‌బుక్ – II, ది ఎఫెక్టివ్ డొమైన్ అనే పుస్తకాన్ని రచించినవారు ?(TGT – 2017) (B.Ed. – 2016)
1. క్రాత్‌హోల్, బ్లూమ్, మాసియా
2. బెంజిమన్ బ్లూమ్, దవే, మాసియా
3. బెంజిమన్ బ్లూమ్, సింప్సన్, దవే
4. సింప్సన్, దవే, క్రాత్‌హోల్

8. భావావేశ రంగం (Affective Domain) లోని లక్ష్యాలకు సంబంధించిన విశ్లేషణను తెలియజేసినవారు ?(B.Ed. – 2016)
1. బెంజిమన్ బ్లూమ్స్ – 1956
2. క్రాత్‌హోల్, బ్లూమ్స్, మాసియా – 1964
3. సింప్సన్, దవే, క్రాత్‌హోల్ – 1972
4. బెంజిమన్ బ్లూమ్స్ – 1964

9. విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలు ?(B.Ed. – 2014)
1. ఉద్దేశాలు
2. లక్ష్యాలు
3. గమ్యాలు
4. స్పష్టీకరణలు

10. ఆశయాల విశదీకరణే ?(SGT – 2019) (B.Ed. – 2016)
1. గమ్యం
2. ఉద్దేశం
3. లక్ష్యం
4. స్పష్టీకరణ

11. విద్యాపరంగా ఊహాజనిత సుదూర గమ్యాలు ?(LP – 2018)
1. విద్యాదర్శాలు
2. విద్యోద్దేశాలు
3. విద్యాలక్ష్యాలు
4. విద్యాస్పష్టీకరణలు

12. విద్యా గమ్యాలు అంటే ?(TGT – 2017) (B.Ed. – 2016)
1. విషయ ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి, స్వల్పకాలికాలు
2. పాఠ్యాంశాల ఎంపికకు తోడ్పడేవి, స్వల్పకాలికాలు
3. విద్యాప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి, దీర్ఘకాలికాలు
4. బోధనా కృత్యాల రూపకల్పనకు తోడ్పడేవి, దీర్ఘకాలికాలు

13. గమ్యాలనే ఇలా కూడా పిలుస్తారు ?(B.Ed. – 2002)
1. ఉద్దేశాలు
2. ధ్యేయాలు
3. లక్ష్యాలు
4. స్పష్టీకరణలు

14. గమ్యాలు (Goals) కు సంబంధించి సరైనవి ?(B.Ed. – 2014)
A) పాఠశాల ద్వారా కాకుండా వ్యవస్థకు సంబంధమున్న అందరూ కలసి సాధించవలసినవి.
B) సాధించడానికి దుర్లభమైనవి
C) ప్రజాస్వామ్య వ్యవస్థాపన, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత అనేవి ఆధునిక భారతీయ విద్యా గమ్యాలు.
D) సుదీర్ఘకాలంలో మొత్తం విద్యాప్రణాళిక ద్వారా సాధించవలసిన ప్రవర్తనా మార్పుల మొత్తాలు – గమ్యాలు.
1. A, B, C లు సరైనవి
2. B, C, D లు సరైనవి
3. C, D లు సరైనవి
4. A, B, C మరియు D లు సరైనవి

15. విషయ ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల అధ్యయనం ద్వారా విద్యార్థులు కనబరచవలసిన స్థూలమైన ప్రవర్తనా మార్పులు తెలిపేవి ?(TGT – 2018, TET – 2018) (B.Ed. – 2016)
1. ఉద్దేశాలు
2. సహజాతాలు
3. ప్రకృతులు
4. వికృతులు

16. పాఠ్యాంశాల బోధన ద్వారా విద్యార్థులలో ఆశిస్తున్న స్థూలమైన ప్రవర్తనా మార్పులు తెలిపేవి ?(PGT – 2018) (B.Ed. – 2016)
1. ఉద్దేశాలు
2. స్పష్టీకరణలు
3. గమ్యాలు
4. లక్ష్యాలు

17. ఇవి విషయ ప్రణాళికల రూపల్పనను నిర్దేశిస్తాయి ?(TGT – 2018) (B.Ed. – 2016)
1. గమ్యాలు
2. ఉద్దేశాలు
3. లక్ష్యాలు
4. ఆదర్శాలు

18. విద్యా ధ్యేయాల నుండి ప్రభవించినవి ?(SGT – 2019)
1. విద్యాదర్శాలు
2. విద్యోద్దేశాలు
3. విద్యాగమ్యాలు
4. విద్యాలక్ష్యాలు

19. పిల్లలు తమ అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను లిఖిత రూపంలో వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ స్థాయిలో తెలుగు బోధనోద్దేశం ?(SGT – 2019) (D.El.Ed – 2018)
1. ప్రాథమిక స్థాయి
2. మాధ్యమిక స్థాయి
3. ఉన్నత స్థాయి
4. స్నాతకోత్తర స్థాయి

20. ఉద్దేశ్యాలు, గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతిగది బోధనకు మార్గదర్శకత్వం నెరపి, ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పుల్ని సూచించేవి ?(TET – 2018) (B.Ed – 2016)
1. స్పష్టీకరణలు
2. లక్ష్యాలు
3. ధ్యేయాలు
4. సూక్ష్మరూపాలు

21. ఈ క్రింది వానిలో సరికానిది ?(D.Ed – 2010)
1. ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి (లేదా) ఏ విధంగానూ వ్యాఖ్యానానికి లోబడనివి – సంవృత లక్ష్యాలు
2. అనేక వ్యాఖ్యలలో సమాధానం కోరే లక్ష్యాలు – వివృత లక్ష్యాలు
3. అభ్యసన ప్రక్రియకు ముందుగానే పేర్కొనే అభిలషణీయమైన ఫలితం – స్పష్టీకరణ
4. ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి – వివృత లక్ష్యాలు

22. ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాలనే విద్యా పరిభాషలో ఇలా అంటారు ?(D.Ed – 10)
1. గమ్యాలు
2. ఉద్దేశాలు
3. లక్ష్యాలు
4. స్పష్టీకరణలు

23. “ప్రవర్తనా భాగం”, “పాఠ్యభాగం” – ఈ రెండు ముఖ్య భాగాలు దీనిలో ఉంటాయి ?(TGT – 2019)
1. విద్యాలక్ష్యం
2. విద్యాధ్యేయం
3. విద్యాగమ్యం
4. విద్యాదర్శం

24. క్రింది వాటిలో విద్యాలక్ష్యాల లక్షణం కానిది ?(SGT – 2019) (B.Ed. – 2014)
1. పూర్వ నిర్ణీతాలు
2. విద్యార్థుల ప్రవర్తనా రూపంలో చెప్పబడతాయి.
3. సామూహికంగా వర్ణింపబడవు.
4. కొలవదగని ప్రవర్తనా పరివర్తనలు

25. “స్పష్టీకరణలు” (Specifications) కి సంబంధించి సరికానిది ?(D.Ed – 2010)
1. విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను, ఆవయవిక చర్యలను స్పష్టీకరణలు అంటారు.
2. విద్యార్థుల్లో వెంటనే ఆశించే ప్రవర్తనా మార్పులు
3. ఆశించే అభ్యసన ఫలితాలు అని కూడా అంటారు.
4. స్పష్టీకరణలనే గమ్యాలు / ధ్యేయాలు అని కూడా అంటారు.

26. “స్పష్టీకరణలు” లక్షణాలకు సంబంధించి సరికానిది ?(D.Ed – 2010)
1. ఒక పాఠ్యాంశం పిల్లలకు బోధిస్తే దాని ద్వారా పిల్లల నుండి ఏమికోరుకుంటామో వాటినే స్పష్టీకరణలు అనవచ్చు.
2. స్పష్టీకరణలనే సామర్థ్యాలని పిలుస్తారు.
3. విద్యాప్రణాళిక తయారుచేసుకోవడానికి తోడ్పడుతాయి.
4. బోధన ప్రణాళికను తయారుచేసుకోవడానికి ఉపకరిస్తాయి.

27. స్పష్టీకరణలు (Specifications) లక్షణాలతో సంబంధం లేనిది ?
(B.Ed. – 2002)
1. మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉంటాయి.
2. రెండు లక్ష్యాల మధ్య భేదాలు చెప్పడానికి ఉపకరించేవి.
3. బోధనాభ్యసన సన్నివేశాల్లో అంతరదృష్టిని సారించడానికి, మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి తోడ్పడుతాయి.
4. లక్ష్యాల అర్థాలను పరిమితం చేసేవి.

28. బోధన లక్ష్యాలను ప్రవర్తనా రూపంలో వాచ్యం చేసి, బోధన కృత్యానికి ప్రాతిపదికలుగా, అభ్యసనానికి సాక్ష్యాలుగా ఉండేవి ?(TGT – 2018) (B.Ed. – 2016)
1. అక్షర చిత్రాలు
2. కల్పనలు
3. ఆలోచనలు
4. స్పష్టీకరణలు

29. కింది వానిలో స్పష్టీకరణ లక్షణం ?(LP – 2018)
1. వర్గీక్రాంతాలను రూపొందించడానికి ఆధార భూతమవుతాయి.
2. పూర్వ నిర్దేశితాలు
3. పరిశీలించదగిన ప్రవర్తనా మార్పులను సూచిస్తాయి.
4. సంపూర్ణ వాక్యాలుగా ఉంటాయి.

30. విద్యాభ్యసనానికి సాక్ష్యాలు ?(SGT – 2019)
1. లక్ష్యాలు
2. స్పష్టీకరణలు
3. ఉద్దేశాలు
4. గమ్యాలు

31. వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి జీవిస్తున్న సమాజ వికాసానికి తోడ్పడే విలువలు ?
(B.Ed. – 2014 ; P.No. – 52)
1. సామాన్య విలువలు
2. వృత్తి విలువలు
3. ప్రత్యేక విలువలు
4. రాజకీయ విలువలు

32. మాతృభాష బోధన విలువలకు సంబంధించి సరైన ప్రవచనం?(B.Ed. – 2002)
1. సామాన్య విలువలనే వైయక్తిక విలువలు, సామాజిక విలువలు అని కూడా అంటారు.
2. మాతృభాష బోధన వల్ల వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న దుష్ట లక్షణాలు పోయి ఉత్తమ లక్షణాలు కలుగుతాయి అని చెప్పే విలువలు – వైయక్తిక విలువలు
3. వైయక్తిక విలువల వల్ల వ్యక్తి తనంతట తాను ఎదిగి ఇతరులకు ఆదర్శ ప్రాయుడవుతాడు.
4. పైవన్నీ సరైనవే

33. రసాస్వాదన, సముచిత మనో వైఖరులు, ఆధ్యాత్మిక చింతన, అహంకార రాహిత్యం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మొదలగునవి ఈ విలువలకు చెందినవి ?(TGT – 2017)
1. వైజ్ఞానిక విలువలు
2. జాతీయ విలువలు
3. వైయక్తిక విలువలు
4. సంస్కృతీ విలువలు

34. సామాజిక విలువలనే ఇలా కూడా అంటారు ?(B.Ed. – 2002)
1. వైయక్తిక విలువలు
2. ప్రత్యేక విలువలు
3. ప్రజాస్వామ్య విలువలు
4. సమిష్టి విలువలు

35. సామాజిక విలువలు వీటి నుండి కలుగుతాయి ?(B.Ed. – 2002)
1. వైయక్తిక విలువలు
2. ప్రత్యేక విలువలు
3. ప్రజాస్వామ్య విలువలు
4. సమిష్టి విలువలు

36. దేశభక్తి, త్యాగం, విశ్వ మానవ సౌభ్రాతృత్వం వంటివి ప్రతిబింబించే విలువలు ?
(TET – 2018) (B.Ed. – 2002)
1. వైయక్తిక విలువలు
2. సామాజిక విలువలు
3. సౌందర్యానుభవ విలువలు
4. వృత్తి విలువలు

37. మానవతా వైఖరి, సమిష్టి భావన, సౌభ్రాతృత్వ భావన, స్నేహం, సమసమాజ నిర్మాణ దృక్పథం, దేశభక్తి, ఐకమత్యం, త్యాగం, దేశ సమైక్యత పట్ల నిబద్ధత మొదలగునవి ఏ విలువలకు చెందినవి ?(B.Ed. – 2002)
1. వైయక్తిక విలువలు
2. వృత్తి విలువలు
3. సౌందర్యానుభవ విలువలు
4. సామాజిక విలువలు

38. మానవ చరిత్ర, దేశ చరిత్ర పరిశీలన ద్వారా కలిగే విలువలు ?(B.Ed. – 2002)
1. సామాన్య విలువలు
2. వైయక్తిక విలువలు
3. సామాజిక విలువలు
4. ప్రత్యేక విలువలు

39. సమాజ పరిస్థితిని బట్టి కవులు, రచయితలు, సంఘసంస్కర్తలు మాతృభాషలో ఉత్తమ సాహిత్యం అందించి, పాఠ్య బోధన ద్వారా సాధించే విలువలు ?(B.Ed. – 2002)
1. సామాన్య విలువలు
2. ప్రత్యేక విలువలు
3. సామాజిక విలువలు
4. వైయక్తిక విలువలు

40. ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని సంరక్షించడం, సత్యం, శివం, సుందరం అనే సూక్తినినుసరించి ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండునని చెప్పే విలువలు ?(B.Ed. – 2002)
1. నైతిక విలువలు
2. ఆధ్యాత్మిక విలువలు
3. సౌందర్యానుభవ విలువలు
4. సాంస్కృతిక విలువలు

41. ఈర్ష్యా ద్వేషాలను తొలగించడం, దురాచారాల నిర్మూలన మొదలగునవి ఏ విలువలకు చెందుతాయి ?
1. నైతిక విలువలు
2. ఆధ్యాత్మిక విలువలు
3. సౌందర్యానుభవ విలువలు
4. సాంస్కృతిక విలువలు

42. శతక వాఙ్మయం, పంచతంత్ర కథలు, రామాయణం, భారతం వంటి ఉత్తమ సాహిత్యాన్ని పఠించడం ద్వారా ఈ విలువలు పెంపొందుతాయి ?(TGT – 2017) (B.Ed. – 2002)
1. సృజనాత్మక విలువలు
2. ఆధునిక విలువలు
3. నైతిక విలువలు
4. వృత్తి విలువలు

43. రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్ లాంటివి పఠించడం వల్ల కలిగే విలువలు?
(B.Ed. – 2002)
1. వృత్తి విలువలు
2. సాంస్కృతిక విలువలు
3. సృజనాత్మక విలువలు
4. ఆధ్యాత్మిక విలువలు

44. గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం మొదలగు కళలు మాతృభాష బోధన ప్రత్యేక విలువల్లో ఈ రకానికి చెందినవి ?(PGT – 2017, TET – 2018) (B.Ed. – 2002)
1. ఆధ్యాత్మిక విలువలు
2. వృత్తి విలువలు
3. నైతిక విలువలు
4. సృజనాత్మక విలువలు

45. మాతృభాష ద్వారా సంగీతం, కవిత్వం, నాట్యం వంటి లలిత కళలు విద్యార్థుల్లో ఈ రకమైన ప్రత్యేక విలువలను పెంపొందిస్తాయి ?(PGT – 2017)
1. ప్రజాస్వామ్య విలువలు
2. వృత్తి విలువలు
3. సృజనాత్మక విలువలు
4. నైతిక విలువలు

46. పురాణేతిహాసాల పఠనం వల్ల మానవత్వానికి నిదర్శనాలైన ప్రేమ, కరుణ, త్యాగం వంటివి పెంపొందడాన్ని ఈ విలువలుగా చెప్పవచ్చు ?(TGT – 2017) (B.Ed. – 2002)
1. జర్నలిజం విలువలు
2. సాంకేతిక విలువలు
3. సృజనాత్మక విలువలు
4. సాంస్కృతిక విలువలు

47. పాఠ్యభాగ బోధన ద్వారా విద్యార్థుల్లో కలిగే ప్రేమ, కరుణ, త్యాగం, సేవాతత్పరత, స్నేహశీలత, క్షమాగుణం మొదలైనవి ఈ రకమైన విలువలుగా పిలువబడతాయి ?(PGT – 2017)
1. సాంస్కృతిక విలువలు
2. వృత్తి విలువలు
3. ప్రజాస్వామ్య విలువలు
4. సృజనాత్మక విలువలు

48. విజ్ఞాన, సాంకేతిక, విద్య, వైద్య, ఉపాధ్యాయ వృత్తుల్లో రాణించాలంటే మాతృభాషాభ్యసనం తప్పనిసరి. అయితే ఇవి ఈ విలువలకు చెందుతాయి ?(B.Ed. – 2002)
1. సాంస్కృతిక విలువలు
2. వృత్తి విలువలు
3. ఆధ్యాత్మిక విలువలు
4. సౌందర్యానుభవ విలువలు

49. “యథా ప్రజా తథారాజ్యం” అనే సూక్తిననుసరించి భారతదేశంలో సుస్థిర ప్రజాస్వామ్యం నెలకొని ఉండాలంటే పౌరులందరూ విద్యావంతులు కావాలి అని తెలిపే మాతృభాష ప్రయోజనం ?(B.Ed. – 2002)
1. వృత్తి విలువలు
2. ప్రజాస్వామ్య విలువలు
3. సాంస్కృతిక విలువలు
4. సృజనాత్మక విలువలు

50. ఏడో తరగతి తెలుగు వాచకం (తెలంగాణ రాష్ట్రం) లోని శతక సుధ, అమ్మ జ్ఞాపకాలు, పల్లె అందాలు, ప్రేరణ వంటి పాఠాలను బట్టి మాతృభాషా బోధన ద్వారా విద్యార్థిలో ఎటువంటి విలువలను పెంపొందించాలని ఆశించవచ్చు ?(PGT – 2018)
1. సామాజిక విలువలు
2. నైతిక విలువలు
3. సౌందర్య విలువలు
4. అన్ని రకాలైన విలువలు

జవాబులు
1)1         2)1        3) 4      4)3       5)1
6)1         7)1        8) 2      9)3      10)1
11)1      12)3      13)2     14)4     15)1
16)1      17)2      18)2     19)1     20)2
21)4      22)3      23)1     24)4     25)4
26)3      27)1      28)4     29)1     30)2
31)1      32)4      33)3     34)4     35)1
36)2      37)4      38)4     39)2     40)3
41)1      42)3      43)4     44)4     45)3
46)4      47)1      48)2     49)2     50)4

 

Leave a Comment