Telugu Sandhulu Bits / తెలుగు సందులు 50 Important Practice బిట్స్

సంధులు – 50 ముఖ్యమైన MCQs (ప్రాక్టీస్ బిట్స్)

Telugu Sandhulu Bits / తెలుగు సందులు 50 Important Practice బిట్స్
AP/TS TET, DSC పరీక్షలకు సన్నద్ధమవుతున్నారా? తెలుగు వ్యాకరణంలోని ‘సంధులు’ టాపిక్ పై 50 ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ (MCQs), వాటి జవాబులు ఇక్కడే ప్రాక్టీస్ చేయండి.
1. ‘కవీంద్రుడు’ పదంలో దాగి ఉన్న సంధి ఏది?
A) గుణ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) వృద్ధి సంధి
D) యణాదేశ సంధి
జవాబు: B
వివరణ: కవి (ఇ) + ఇంద్రుడు (ఇ) = కవీంద్రుడు (ఈ). ‘ఇ’ కి సవర్ణమైన ‘ఇ’ పరమై దీర్ఘం వచ్చింది.
2. ‘సూర్యోదయం’ పదాన్ని విడదీయగా?
A) సూర్యో + ఉదయం
B) సూర్య + దయం
C) సూర్య + ఉదయం
D) సూర్యా + ఉదయం
జవాబు: C
వివరణ: సూర్య (అ) + ఉదయం (ఉ) = సూర్యోదయం (ఓ). అకారానికి ‘ఉ’ పరమై ‘ఓ’ గుణంగా వచ్చింది (గుణ సంధి).
3. అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే ఏ, ఓ, ఆర్ లు ఏకాదేశంగా వస్తే ఆ సంధి?
A) వృద్ధి సంధి
B) గుణ సంధి
C) యణాదేశ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు: B
వివరణ: గుణ సంధి సూత్రం ప్రకారం ఏ, ఓ, ఆర్ లను గుణాలు అంటారు.
4. ‘అత్యాశ’ అనేది ఏ సంధికి ఉదాహరణ?
A) వృద్ధి సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) యణాదేశ సంధి
D) అత్వ సంధి
జవాబు: C
వివరణ: అతి + ఆశ = అత్యాశ. ‘ఇ’ కి అసవర్ణ అచ్చు ‘ఆ’ పరమై ‘య్’ ఆదేశంగా వచ్చింది.
5. ఏ, ఓ, ఆర్ లను వ్యాకరణ పరిభాషలో ఏమంటారు?
A) వృద్ధులు
B) గుణాలు
C) యణ్ లు
D) త్రికాలు
జవాబు: B
వివరణ: గుణ సంధిలో వచ్చే ఏ, ఓ, ఆర్ లను గుణాలు అంటారు.
6. ‘ఏకైక’ పదంలో జరిగిన సంధి ఏమిటి?
A) యణాదేశ సంధి
B) వృద్ధి సంధి
C) గుణ సంధి
D) అత్వ సంధి
జవాబు: B
వివరణ: ఏక + ఏక = ఏకైక (అ + ఏ = ఐ). అకారానికి ‘ఏ’ పరమై ‘ఐ’ వృద్ధిగా వచ్చింది.
7. ఇ, ఉ, ఋ లకు అసవర్ణ అచ్చులు పరమైతే య్, వ్, ర్ లు ఆదేశంగా వచ్చే సంధి?
A) యణాదేశ సంధి
B) గుణ సంధి
C) వృద్ధి సంధి
D) త్రిక సంధి
జవాబు: A
వివరణ: య, వ, ర లను ‘యణ్’లు అంటారు. ఇవే ఆదేశంగా వచ్చేది యణాదేశ సంధి.
8. ‘గుర్వాజ్ఞ’ పదాన్ని విడదీసే సరైన విధానం?
A) గురు + ఆజ్ఞ
B) గురువ్ + ఆజ్ఞ
C) గురు + వాజ్ఞ
D) గుర్వ + ఆజ్ఞ
జవాబు: A
వివరణ: గురు + ఆజ్ఞ = గుర్వాజ్ఞ (ఉ + ఆ = వ్). ఇది యణాదేశ సంధి.
9. ‘పరమౌషధం’ – ఏ సంధి?
A) గుణ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) వృద్ధి సంధి
D) ఉత్వ సంధి
జవాబు: C
వివరణ: పరమ + ఔషధం = పరమౌషధం. అకారానికి ‘ఔ’ పరమై ‘ఔ’ (వృద్ధి) వచ్చింది.
10. ఐ, ఔ లను ఏమంటారు?
A) గుణాలు
B) వృద్ధులు
C) యణ్ లు
D) అచ్చులు
జవాబు: B
వివరణ: వృద్ధి సంధిలో వచ్చే ఐ, ఔ లను వృద్ధులు అంటారు.
11. ‘రాముడతడు’ పదాన్ని విడదీయగా?
A) రాముడు + తడు
B) రాముడ + అతడు
C) రాము + అతడు
D) రాముడు + అతడు
జవాబు: D
వివరణ: రాముడు (ఉ) + అతడు (అ). ఉత్తునకు అచ్చు పరమైంది కాబట్టి ఉకార సంధి.
12. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి?
A) వైకల్పికము
B) బహుళము
C) నిత్యము
D) నిషేధము
జవాబు: C
వివరణ: ఉకార సంధి సూత్రం ప్రకారం సంధి నిత్యంగా (తప్పకుండా) జరుగుతుంది.
13. ‘రామయ్య’ అనేది ఏ సంధి?
A) ఉత్వ సంధి
B) అత్వ సంధి
C) ఇత్వ సంధి
D) యడాగమ సంధి
జవాబు: B
వివరణ: రామ (అ) + అయ్య (అ) = రామయ్య. అత్తునకు అచ్చు పరమైంది (అకార/అత్వ సంధి).
14. అత్తునకు సంధి ఎలా జరుగుతుంది?
A) నిత్యము
B) వైకల్పికము
C) బహుళము
D) ఏదీకాదు
జవాబు: C
వివరణ: అకార సంధి సూత్రం “అత్తునకు సంధి బహుళముగా నగును”.
15. ‘ఏమంటివి’ పదాన్ని విడదీయండి?
A) ఏమ + అంటివి
B) ఏమి + అంటివి
C) ఏ + మంటివి
D) ఏము + అంటివి
జవాబు: B
వివరణ: ఏమి (ఇ) + అంటివి (అ) = ఏమంటివి. ఇది ఇత్వ సంధి.
16. ‘ఏమ్యాదుల ఇత్తునకు సంధి?
A) బహుళం
B) వైకల్పికం
C) నిత్యం
D) నిషేధం
జవాబు: B
వివరణ: ఏమి, మరి తదితర పదాల ఇత్తునకు సంధి వైకల్పికంగా (జరగొచ్చు/జరగకపోవచ్చు) వస్తుంది.
17. ‘మాయమ్మ’ పదంలో జరిగిన సంధి?
A) అత్వ సంధి
B) ఉత్వ సంధి
C) యడాగమ సంధి
D) గసడదవాదేశ సంధి
జవాబు: C
వివరణ: మా + అమ్మ = మాయమ్మ. సంధి లేని చోట రెండు అచ్చుల మధ్య ‘య్’ ఆగమంగా వచ్చింది.
18. ‘పట్టపగలు’ ఏ సంధికి ఉదాహరణ?
A) ద్విరుక్త టకార సంధి
B) త్రిక సంధి
C) ఆమ్రేడిత సంధి
D) అత్వ సంధి
జవాబు: C
వివరణ: పగలు + పగలు = పట్టపగలు. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణాలకు అదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది.
19. ఆమ్రేడితం అంటే ఏమిటి?
A) మొదటి పదం
B) ద్విరుక్తం (రెండుసార్లు పలికిన పదం) లోని రెండవ పదం
C) అచ్చు
D) హల్లు
జవాబు: B
వివరణ: ఔర + ఔర లో రెండవ సారి వచ్చిన ‘ఔర’ను ఆమ్రేడితం అంటారు.
20. ‘చిట్టెలుక’ పదాన్ని విడదీయగా?
A) చిట్ట + ఎలుక
B) చిరు + ఎలుక
C) చిట్టి + ఎలుక
D) చిరు + లుక
జవాబు: B
వివరణ: చిరు + ఎలుక = చిట్టెలుక. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలలోని ఋ, డు లకు అచ్చు పరమైతే ‘ట్’ ద్విరుక్తంగా వస్తుంది (ద్విరుక్త టకార సంధి).
21. ఆ, ఈ, ఏ – అనే సర్వనామాలను ఏమంటారు?
A) గుణాలు
B) త్రికాలు
C) వృద్ధులు
D) యణ్ లు
జవాబు: B
వివరణ: త్రిక సంధిలో ఆ, ఈ, ఏ లను త్రికములు అంటారు.
22. ‘అక్కన్య’ పదంలో ఉన్న సంధి ఏది?
A) యడాగమ సంధి
B) త్రిక సంధి
C) ఆమ్రేడిత సంధి
D) ఉత్వ సంధి
జవాబు: B
వివరణ: ఆ + కన్య = అక్కన్య. త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం వచ్చి, ముందున్న దీర్ఘం హ్రస్వమైంది.
23. ప్రథమ మీది పరుషములకు గసడదవలు ఏ విధంగా వస్తాయి?
A) నిత్యం
B) వైకల్పికం
C) బహుళం
D) అరుదుగా
జవాబు: C
వివరణ: గసడదవాదేశ సంధి సూత్రం “ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగా నగు”.
24. ‘వాడుగొట్టె’ విడదీస్తే?
A) వాడు + గొట్టె
B) వాడు + కొట్టె
C) వా + డుగొట్టె
D) వాడుగ + ఒట్టె
జవాబు: B
వివరణ: వాడు + కొట్టె = వాడుగొట్టె. ప్రథమా విభక్తి (డు) మీది పరుషం ‘క’ స్థానంలో ‘గ’ వచ్చింది (గసడదవాదేశ సంధి).
25. ‘సరసపుమాట’ ఏ సంధికి ఉదాహరణ?
A) త్రిక సంధి
B) అత్వ సంధి
C) పుంప్వాదేశ సంధి
D) ఉత్వ సంధి
జవాబు: C
వివరణ: సరసము + మాట = సరసపుమాట. కర్మధారయంలో ‘ము’ వర్ణకానికి ‘పు’ ఆదేశంగా వచ్చింది.
26. ‘పితౄణం’ పదాన్ని విడదీయండి.
A) పిత + ఋణం
B) పితృ + రణం
C) పితృ + ఋణం
D) పిత + రణం
జవాబు: C
వివరణ: పితృ (ఋ) + ఋణం (ఋ) = పితౄణం (ౠ). ఇది సవర్ణదీర్ఘ సంధి.
27. ‘మహర్షి’ అనేది ఏ సంధి?
A) గుణ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) వృద్ధి సంధి
D) అత్వ సంధి
జవాబు: A
వివరణ: మహా (ఆ) + ఋషి (ఋ) = మహర్షి (ఆర్). అకారానికి ఋ పరమై ఆర్ గుణంగా వచ్చింది.
28. ‘దేశౌన్నత్యం’ పదంలో వృద్ధిగా వచ్చిన అక్షరం?
A) ఓ
B) ఔ
C) ఐ
D) ఏ
జవాబు: B
వివరణ: దేశ + ఔన్నత్యం = దేశౌన్నత్యం. అకారానికి ‘ఔ’ పరమై ‘ఔ’ వృద్ధిగా వచ్చింది.
29. సంధి జరగని చోట స్వరంబుకంటె పరంబైన స్వరంబునకు ఏమగును?
A) యడాగమం
B) వృద్ధి
C) గుణం
D) అత్వం
జవాబు: A
వివరణ: సంధి లేని చోట రెండు అచ్చుల మధ్య ‘య్’ ఆగమంగా వస్తుంది. (యడాగమ సంధి).
30. ‘ఔరౌర’ పదంలో ఉన్న సంధి?
A) అత్వ సంధి
B) ఆమ్రేడిత సంధి
C) ద్విరుక్త టకార
D) వృద్ధి సంధి
జవాబు: B
వివరణ: ఔర + ఔర. అచ్చునకు ఆమ్రేడితం పరమైంది కాబట్టి ఆమ్రేడిత సంధి.
31. ‘కట్టకడ’ పదాన్ని విడదీయగా?
A) కట్ట + కడ
B) కడ + కడ
C) కడ + కట్ట
D) క + కడ
జవాబు: B
వివరణ: కడ + కడ = కట్టకడ. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణాలకు ద్విరుక్త టకారం వస్తుంది.
32. ‘ఇక్కాలము’ ఏ సంధి?
A) త్రిక సంధి
B) ఇత్వ సంధి
C) ఆమ్రేడిత సంధి
D) ద్విరుక్త టకార
జవాబు: A
వివరణ: ఈ + కాలము = ఇక్కాలము. ‘ఈ’ అనేది త్రికం.
33. ‘నిజముదెలిసి’ విడదీయండి?
A) నిజము + తెలిసి
B) నిజము + దెలిసి
C) నిజ + ముదెలిసి
D) నిజముదె + లిసి
జవాబు: A
వివరణ: నిజము + తెలిసి = నిజముదెలిసి. ‘ము’ ప్రథమా విభక్తి. దాని మీది ‘త’ కు ‘ద’ ఆదేశంగా వచ్చింది (గసడదవాదేశం).
34. కర్మధారయములలో ‘ము’ వర్ణకానికి ఏమొస్తాయి?
A) య, వ, ర
B) గ, స, డ
C) పు, ంపు
D) ట్, ట్ట
జవాబు: C
వివరణ: పుంప్వాదేశ సంధి సూత్రం ప్రకారం ‘పు’, ‘ంపు’ లు వస్తాయి.
35. ‘నట్టిల్లు’ విడదీస్తే?
A) నట్టి + ఇల్లు
B) నడు + ఇల్లు
C) నడుమ + ఇల్లు
D) నట్ట + ఇల్లు
జవాబు: B
వివరణ: నడు + ఇల్లు = నట్టిల్లు. కురు, చిరు, కడు, నడు శబ్దాలకి అచ్చు పరమైతే ట్ వస్తుంది (ద్విరుక్త టకార సంధి).
36. ‘ఏమియంటివి’ పదంలో జరిగిన వ్యాకరణ కార్యం?
A) యడాగమం
B) త్రికం
C) వృద్ధి
D) ద్విరుక్తం
జవాబు: A
వివరణ: ఏమి + అంటివి = ఏమంటివి / ఏమియంటివి. ఇత్వ సంధి వైకల్పికం కాబట్టి సంధి జరగనప్పుడు ‘య్’ ఆగమంగా వచ్చింది.
37. ‘భానూదయం’ ఏ సంధి?
A) సవర్ణదీర్ఘ సంధి
B) ఉత్వ సంధి
C) గుణ సంధి
D) వృద్ధి సంధి
జవాబు: A
వివరణ: భాను (ఉ) + ఉదయం (ఉ) = భానూదయం (ఊ). ఉకారానికి ఉకారం పరమై దీర్ఘం వచ్చింది.
38. క, చ, ట, త, ప లను ఏమంటారు?
A) సరళాలు
B) పరుషాలు
C) స్థిరాలు
D) అంతస్థాలు
జవాబు: B
వివరణ: కచటతపలను పరుషాలు అంటారు (గసడదవాదేశ సంధికి ఈ బేసిక్ అవసరం).
39. ‘మహౌషధం’ విడదీయగా?
A) మహా + షధం
B) మహ + ఔషధం
C) మహా + ఔషధం
D) మహా + ఉషధం
జవాబు: C
వివరణ: మహా (ఆ) + ఔషధం (ఔ) = మహౌషధం. ఇది వృద్ధి సంధి.
40. ‘ఎచ్చోట’ పదాన్ని విడదీసే సరైన పద్ధతి?
A) ఎ + చోట
B) ఏ + చోట
C) ఎచ్ + చోట
D) ఏచ్ + చోట
జవాబు: B
వివరణ: ఏ + చోట = ఎచ్చోట. త్రిక సంధి ప్రకారం ‘ఏ’ కు సంయుక్త హల్లు పరమై హ్రస్వమైంది.
41. ‘అమ్మాయిచ్చెను’ ఏ సంధి?
A) ఇత్వ
B) యడాగమ
C) అత్వ
D) ఉత్వ
జవాబు: B
వివరణ: అమ్మ + ఇచ్చెను = అమ్మయిచ్చెను. అత్వ సంధి బహుళం కాబట్టి సంధి జరగని పక్షంలో యడాగమం వచ్చింది. (అమ్మిచ్చెను అయితే అత్వ సంధి).
42. కర్మధారయ సమాసం అనగా?
A) రెండు నామవాచకాలు
B) విశేషణ, విశేష్యాల కలయిక
C) క్రియ, కర్త
D) అవ్యయాలు
జవాబు: B
వివరణ: విశేషణ, విశేష్యాలతో ఏర్పడేదే కర్మధారయ సమాసం (పుంప్వాదేశ సంధికి ఆధారం).
43. ‘సింగారపువొలుకు’ విడదీయండి?
A) సింగార + వొలుకు
B) సింగారము + వొలుకు
C) సింగారపు + వొలుకు
D) సింగారము + పొలుకు
జవాబు: B
వివరణ: సింగారము + వొలుకు = సింగారపువొలుకు. (పుంప్వాదేశ సంధి).
44. ‘దేవేంద్రుడు’ పదాన్ని విడదీస్తే?
A) దేవా + ఇంద్రుడు
B) దేవ + ఇంద్రుడు
C) దేవే + ఇంద్రుడు
D) దేవ + ఏంద్రుడు
జవాబు: B
వివరణ: దేవ (అ) + ఇంద్రుడు (ఇ) = దేవేంద్రుడు (ఏ). గుణ సంధి.
45. ‘మీయింటికి’ లోని సంధి?
A) అత్వ
B) ఇత్వ
C) యడాగమ
D) ఉత్వ
జవాబు: C
వివరణ: మీ + ఇంటికి = మీయింటికి. సంధి జరగక ‘య్’ ఆగమంగా వచ్చింది.
46. ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏవి?
A) నిన్, నున్, లన్
B) డు, ము, వు, లు
C) చేతన్, చేన్
D) కొఱకున్, కై
జవాబు: B
వివరణ: డు, ము, వు, లు ప్రథమా విభక్తి ప్రత్యయాలు (గసడదవాదేశ సంధిలో ఇవి కీలకం).
47. ‘మేనత్త’ ఏ సంధి?
A) యడాగమ
B) గుణ
C) అత్వ
D) ఉత్వ
జవాబు: C
వివరణ: మేన (అ) + అత్త (అ) = మేనత్త. (అత్వ సంధి).
48. ‘అప్పుసేసి’ విడదీయగా?
A) అప్పు + సేసి
B) అప్పు + చేసి
C) అప్పుస్ + ఏసి
D) అప్ప + చేసి
జవాబు: B
వివరణ: అప్పు + చేసి = అప్పుసేసి. ప్రథమ (ఉ) మీది పరుషం ‘చ’ కు ‘స’ ఆదేశంగా వచ్చింది. (గసడదవాదేశ సంధి).
49. ‘మాత్రాంశ’ విడదీస్తే?
A) మాత్ర + అంశ
B) మాతృ + అంశ
C) మాత్రా + అంశ
D) మాత్రు + అంశ
జవాబు: B
వివరణ: మాతృ (ఋ) + అంశ (అ) = మాత్రాంశ (ర్). యణాదేశ సంధి.
50. ‘మనముంటిమి’ ఏ సంధి?
A) ఉత్వ సంధి
B) అత్వ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) యడాగమ సంధి
జవాబు: A
వివరణ: మనము (ఉ) + ఉంటిమి (ఉ) = మనముంటిమి. ఉత్తునకు అచ్చు పరమైంది.
సంధులు – జతపరచండి (Match the Following)
51. పదాలు – సంధి పేర్లు (సంస్కృత సంధులు)
జాబితా-A (పదం)                         జాబితా-B (సంధి)
A. భానుదయం                            1. వృద్ధి సంధి
B. మహర్షి                                     2. సవర్ణదీర్ఘ సంధి
C. అన్వస్త్రం                                3. గుణ సంధి
D. పరమౌషధం                           4. యణాదేశ సంధి
ఆప్షన్లు:
a) A-2, B-3, C-4, D-1
b) A-3, B-2, C-1, D-4
c) A-2, B-4, C-3, D-1
d) A-4, B-3, C-2, D-1
జవాబు: A
వివరణ: భాను+ఉదయం = భానూదయం (సవర్ణదీర్ఘ), మహా+ఋషి = మహర్షి (గుణ), అను+అస్త్రం = అన్వస్త్రం (యణాదేశ), పరమ+ఔషధం = పరమౌషధం (వృద్ధి సంధి).
52. పదాలు – సంధి పేర్లు (తెలుగు సంధులు)
జాబితా-A (పదం)                          జాబితా-B (సంధి)
A. రాముడతడు                            1. అత్వ సంధి
B. మేనత్త                                      2. ఇత్వ సంధి
C. మాయమ్మ                                3. ఉత్వ సంధి
D. ఏమంటివి                                4. యడాగమ సంధి
ఆప్షన్లు:
a) A-1, B-2, C-3, D-4
b) A-3, B-1, C-4, D-2
c) A-3, B-4, C-1, D-2
d) A-2, B-1, C-4, D-3
జవాబు: B
వివరణ: రాముడు+అతడు (ఉత్వ), మేన+అత్త (అత్వ), మా+అమ్మ=మాయమ్మ (సంధి లేని చోట యడాగమం), ఏమి+అంటివి (ఇత్వ సంధి).
53. ప్రత్యేక తెలుగు సంధులు
జాబితా-A (పదం)                     జాబితా-B (సంధి)
A. ఎచ్చోట.                               1. గసడదవాదేశ సంధి
B. చిట్టెలుక.                              2. ఆమ్రేడిత సంధి
C. నిజముదెలిసి.                       3. త్రిక సంధి
D. పట్టపగలు.                            4. ద్విరుక్త టకార సంధి
ఆప్షన్లు:
a) A-3, B-4, C-1, D-2
b) A-4, B-3, C-2, D-1
c) A-3, B-1, C-4, D-2
d) A-2, B-4, C-1, D-3
జవాబు: A
వివరణ: ఏ+చోట=ఎచ్చోట (త్రికం), చిరు+ఎలుక=చిట్టెలుక (ద్విరుక్త టకార), నిజము+తెలిసి=నిజముదెలిసి (గసడదవాదేశం), పగలు+పగలు=పట్టపగలు (ఆమ్రేడిత సంధి).
54. వ్యాకరణ పరిభాష – అక్షరాలు
జాబితా-A (పేరు)                               జాబితా-B (అక్షరాలు)
A. గుణాలు.                                       1. ఐ, ఔ
B. వృద్ధులు.                                      2. ఆ, ఈ, ఏ
C. యణ్ లు.                                      3. ఏ, ఓ, ఆర్
D. త్రికాలు.                                        4. య, వ, ర
ఆప్షన్లు:
a) A-3, B-1, C-4, D-2
b) A-1, B-3, C-2, D-4
c) A-3, B-4, C-1, D-2
d) A-2, B-1, C-4, D-3
జవాబు: A
వివరణ: గుణ సంధిలో వచ్చే ఏ, ఓ, ఆర్ లను గుణాలు అంటారు. వృద్ధి సంధిలో వచ్చే ఐ, ఔ లను వృద్ధులు అంటారు. యణాదేశ సంధిలో వచ్చే య, వ, ర లను యణ్ లు అంటారు. త్రిక సంధిలో వచ్చే ఆ, ఈ, ఏ లను త్రికాలు అంటారు.
55. సంధి సూత్రాలు – జరిగే విధానం
 జాబితా-A (సూత్రం/సంధి)                                          జాబితా-B (విధానం)
A. అత్తునకు సంధి.                                                     1. వైకల్పికముగా నగును
B. ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి.                2. బహుళముగా నగును
C. ఏమ్యాదుల ఇత్తునకు సంధి.                                   3. నిత్యముగా నగును
D. ప్రథమ మీది పరుషములకు గసడదవలు.             4. బహుళముగా నగును (గసడదవాదేశం).
ఆప్షన్లు:
a) A-2, B-3, C-1, D-4
b) A-3, B-2, C-4, D-1
c) A-1, B-3, C-2, D-4
d) A-2, B-1, C-3, D-4
జవాబు: A
వివరణ:
• అకార సంధి ఎప్పుడూ బహుళం (జరగవచ్చు, జరగకపోవచ్చు, వేరేలా జరగవచ్చు).
• ఉకార సంధి ఎప్పుడూ నిత్యం (తప్పకుండా జరుగుతుంది).
• ఇకార సంధి ఎప్పుడూ వైకల్పికం (రెండే ఆప్షన్స్: జరిగితే సంధి, జరగకపోతే యడాగమం).
• గసడదవాదేశ సంధి కూడా బహుళంగానే జరుగుతుంది.
56. విడదీసిన పదాలు – కలిపిన రూపాలు
జాబితా-A (విడదీసిన రూపం)                 జాబితా-B (కలిపిన రూపం)
A. కడ + కడ.                                          1.అప్పుసేసి
B. నడు + ఇల్లు.                                      2. సరసపుమాట
C. సరసము + మాట.                              3. నట్టిల్లు
D. అప్పు + చేసి.                                     4. కట్టకడ
ఆప్షన్లు:
a) A-4, B-3, C-2, D-1
b) A-3, B-4, C-1, D-2
c) A-4, B-2, C-3, D-1
d) A-2, B-3, C-4, D-1
జవాబు: A
వివరణ:
కడ+కడ = కట్టకడ (ఆమ్రేడిత సంధి)
నడు+ఇల్లు = నట్టిల్లు (ద్విరుక్త టకార సంధి)
సరసము+మాట = సరసపుమాట (పుంప్వాదేశ సంధి)
అప్పు+చేసి = అప్పుసేసి (గసడదవాదేశ సంధి)

Leave a Comment